అన్వేషించండి
BCCI: తొలి రెండు టెస్టులకు భారత్ టీం ఇదే, పురానేలకు తప్పని నిరాశ
Indias squad: ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ కోసం తొలి రెండు టెస్టులకు జట్టు అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించింది.
ఇంగ్లండ్(England)తో జరిగే ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ కోసం తొలి రెండు టెస్టులకు జట్టు... అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించింది. దాదాపుగా దక్షిణాఫ్రికా(South Africa)తో సిరీస్ లో తలపడిన జట్టునే ఎంపిక చేసింది. . గాయం నుంచి కోలుకోని స్టార్ పేసర్ మహ్మద్ షమి(Shami) జట్టుకు ఎంపిక కాలేదు. తెలుగు కుర్రాడు కేఎస్ భరత్(KS Bharat) జట్టులో చోటు నిలబెట్టుకున్నాడు. అయితే, జట్టులో కేఎల్ రాహుల్(KL Rahul) కూడా ఉండటంతో అతను వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. సీనియర్ ఆటగాళ్లు చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానెలకు మరోసారి నిరాశ తప్పలేదు. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లోనూ వారికి అవకాశం దక్కలేదు. ఇటీవల రంజీ ట్రోఫీలో డబుల్ సెంచరీ సాధించినా పుజారాపై సెలక్టర్లు నమ్మకం ఉంచలేదు. వ్యక్తిగత కారణాలతో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ నుంచి వైదొలిగిన ఇషాన్ కిషన్‌ను కూడా సెలక్టర్లు జట్టులోకి తీసుకోలేదు. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ అవకాశం కల్పించారు. ఉత్తర్‌ప్రదేశ్ వికెట్ కీపర్ ధ్రువ్ ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయలేదు. తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ జట్టులో చోటు నిలబెట్టుకున్నాడు. కేఎల్ రాహులే వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశముంది.
రంజీ ట్రోఫీలో గాయపడిన ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో అవేష్ ఖాన్ టెస్టు జట్టులోకి వచ్చాడు. స్పిన్ విభాగంలో అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్‌లకు తోడుగా కుల్‌దీప్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. రోహిత్ సారథ్యంలోని భారత బృందం ఈ నెల 25న హైదరాబాద్‌లో ఆరంభమయ్యే తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ను ఢీకొంటుంది. బుమ్రా వైస్‌కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
భారత జట్టు: రోహిత్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, అవేశ్ ఖాన్
ముమ్మరంగా ఏర్పాట్లు
విశాఖ(Visakha)లో ఇండియా-ఇంగ్లాండ్(Ind vs EngTest) మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్ విశాఖ VDCA స్టేడియంలో ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు జరుగుతుందని ACA కమిటీ సభ్యలు వెల్లడించారు. మ్యాచ్ కోసం ఈ నెల 15వ తేదీ నుంచి ఆన్ లైన్ లో టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే 26నుంచి ఆఫ్ లైన్ లో టికెట్లు అమ్మకాలను ఉంచుతామన్నారు. అదే విధంగా రోజుకు 2000 మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తామని ACA కమిటీ సభ్యలు తెలిపారు. రెండు క్రికెట్ జట్లకు సంబంధించిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని జల్లా కలెక్టర్ మల్లిఖకార్జున అన్నారు. స్టేడియం దగ్గర ఎలాంటి సంఘనలు జరగకుండా...ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూస్తామని నగర సీపీ రవి శంకర్ అయ్యర్ తెలిపారు.
పటిష్ట భద్రత
ఫిబ్రవరి 2 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ సమావేశమైంది. నిర్వాహక కమిటీ చైర్మన్, కలెక్టర్ మల్లికార్జున సహా ఏసీఏ సభ్యులు పాల్గొని కీలక అంశాలపై చర్చించారు. మ్యాచ్ వీక్షించేందుకు వచ్చే దేశ, విదేశీ అభిమానులకు చిన్నపాటి అసౌకర్యం కూడా కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మూడంచెల పటిష్ట భద్రతతో పాటు తాగునీరు, మెడికల్ సదుపాయాలు, తగినన్ని స్టాల్స్ ఏర్పాటు చేస్తామని, ఉల్లాసభరిత వాతావరణం లో మ్యాచ్ చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే క్రికెట్ ప్రేమికుల కోసం ప్రత్యేక రవాణా సౌకర్యాలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion