News
News
X

BAN vs ENG: ప్రపంచ ఛాంపియన్లకు షాకిచ్చిన బంగ్లాదేశ్.. టీ20 సిరీస్ కైవసం

BAN vs ENG: స్వదేశంలో బంగ్లాదేశ్ అదరగొట్టింది. ప్రపంచ టీ20 ఛాంపియన్లను ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది.

FOLLOW US: 
Share:

BAN vs ENG: స్వదేశంలో బంగ్లాదేశ్ సంచనాలు  నమోదు చేస్తున్నది. వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను వణికించిన ఆ జట్టు.. టీ20 సిరీస్ లో ఏకంగా ప్రపంచ ఛాంపియన్లను ఓడించింది.  బంతితో పాటు బ్యాట్‌తో కూడా రాణించిన ఆ జట్టు.. ఇంగ్లాండ్‌కు షాకులిచ్చింది. మూడు మ్యాచ్‌ల  టీ20 సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో గెలుచుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో  ఇంగ్లాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. గతేడాది డిసెంబర్‌లో భారత జట్టును ఓడించిన బంగ్లాదేశ్ ఇప్పుడు ఏకంగా ఇంగ్లాండ్‌ను ఓడించి తాము ఏ జట్టునైనా ఓడించగలమని చెప్పకనే చెప్పింది.  

ఢాకా వేదికగా  ఆదివారం ముగిసిన  రెండో టీ20లో  బంగ్లాదేశ్..  తొలుత టాస్ గెలిచి   నిర్ణీత  20 ఓవర్లలో  ఇంగ్లాండ్‌ను 117 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో  ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత్ తో వన్డే సిరీస్ లో  రాణించిన మెహదీ హసన్..  నాలుగు ఓవర్లు వేసి 12 పరుగులే ఇచ్చి  నాలుగు వికెట్లు తీయడమే గాక బ్యాట్ తో కూడా కీలక పరుగులు చేసి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర  పోషించాడు.  

ఇంగ్లాండ్‌ బ్యా టర్లు విఫలం.. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాండ్‌కు రెండో  ఓవర్లేనే బంగ్లాదేశ్ షాకిచ్చింది.  ఓపెనర్ డేవిడ్ మలన్ (2)ను టస్కిన్ అహ్మద్ ఔట్ చేశాడు. మోయిన్ అలీ (15)తో పాటు కెప్టెన్ జోస్ బట్లర్ (4),  సామ్ కరన్ (12) కూడా విఫలమయ్యారు.   ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (25), బెన్ డకెట్ (28) ఫర్వాలేదనిపించారు. ఇక ఇంగ్లాండ్ లోయరార్డర్ కూడా  విఫలమవడంతో  ఇంగ్లాండ్ 120 పరుగుల మార్కును కూడా చేరలేదు. మోయిన్ అలీతో  పాటు సామ్ కరన్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్ వికెట్లు కూడా మెహదీ హసన్‌కే దక్కాయి. 

బంగ్లాను ఆదుకున్న శాంతో.. 

స్వల్ప లక్ష్య ఛేదనలో  బంగ్లాదేశ్  కూడా ఓపెనర్లను వెంటవెంటనే కోల్పోయింది.  లిటన్ దాస్ (9), రానీ తాలూక్దార్ (9) ల విఫలమయ్యారు.  కానీ వన్ డౌన్ లో వచ్చిన నజ్ముల్ హోసేన్ శాంతో (47 బంతుల్లో 46, 3 ఫోర్లు) నిలకడగా ఆడాడు. అతడికి హృదయ్ (17), మోహదీ హసన్ (20) లు అండగా నిలిచారు. 

సిరీస్ కైవసం.. 

రెండో టీ20లో విజయంతో  బంగ్లాదేశ్  మరో మ్యాచ్ మిగిలుండగానే  సిరీస్ ను సొంతం చేసుకుంది.  వన్డే సిరీస్ లో కూడా బంగ్లాదేశ్.. తొలి మ్యాచ్ లో గెలిచినంత పని చేసింది.  మూడో మ్యాచ్ లో గెలిచింది. వన్డే సిరీస్ పోయినా పట్టుదలతో ఆడిన బంగ్లా.. ఇప్పుడు టీ20 సిరీస్ ను సాధించడం విశేషం. 

Published at : 13 Mar 2023 12:10 PM (IST) Tags: England Shakib Al Hasan BANvsENG Bangaladesh Jos Buttelr Mehidy Hasan England vs Bangladesh T20I

సంబంధిత కథనాలు

IPL 2023: గాయం కారణంగా ఐపీఎల్‌కు ముఖేష్ చౌదరి దూరం - మరి చెన్నై ఎవర్ని సెలెక్ట్ చేసింది?

IPL 2023: గాయం కారణంగా ఐపీఎల్‌కు ముఖేష్ చౌదరి దూరం - మరి చెన్నై ఎవర్ని సెలెక్ట్ చేసింది?

Shaik Rasheed: అండర్-19 వైస్ కెప్టెన్సీ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ దాకా - షేక్ రషీద్ గత రికార్డులు ఎలా ఉన్నాయి?

Shaik Rasheed: అండర్-19 వైస్ కెప్టెన్సీ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ దాకా - షేక్ రషీద్ గత రికార్డులు ఎలా ఉన్నాయి?

Bhagath Varma: చెన్నై జట్టులో హైదరాబాదీ ప్లేయర్ - ఎవరీ కనుమూరి భగత్?

Bhagath Varma: చెన్నై జట్టులో హైదరాబాదీ ప్లేయర్ - ఎవరీ కనుమూరి భగత్?

మీరు రాకుంటే మేమూ రాం! వన్డే వరల్డ్ కప్‌లో ఆడేందుకు పాక్ అభ్యంతరం

మీరు రాకుంటే మేమూ రాం! వన్డే వరల్డ్ కప్‌లో ఆడేందుకు పాక్ అభ్యంతరం

IPL 2023: ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందిపై కోట్లాది రూపాయల ఖర్చు-ఫ్రాంచైజీలకు ఆ డబ్బు ఎలా వస్తుంది?

IPL 2023: ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందిపై కోట్లాది రూపాయల ఖర్చు-ఫ్రాంచైజీలకు ఆ డబ్బు ఎలా వస్తుంది?

టాప్ స్టోరీస్

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు