అన్వేషించండి
Advertisement
Babar Azam: బాబర్ ఆజంపై కుట్ర పన్నారా..? పీసీబీ చీఫ్ ఆడియో లీక్‌తో రచ్చ రచ్చ
Babar Azam: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తాత్కాలిక చీఫ్ జకా అష్రాఫ్‌కి సంబంధించిన ఆడియో.. పాకిస్తాన్ మీడియాలో లీక్ అయింది.. ఇందులో కెప్టెన్సీ విడిచిపెట్టమని బాబర్ ఆజం పై ఒత్తిడి చేస్తున్నట్లు ఉంది.
భారత్(India) వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్(ODI World Cup 2023)లో సెమీస్ కూడా చేరకుండా పాకిస్థాన్ క్రికెట్ జట్టు(Pakistan Cricket Team) వెనుదిరిగింది. ఈ మెగా టోర్నీలో భారత్(Team India ), ఆస్ట్రేలియా(Australia), దక్షిణాఫ్రికా(South Africa), ఇంగ్లండ్(England) వంటి జట్లపైనే కాకుండా.. గతంలో ఎన్నడూ ఓడిపోని ఆఫ్ఘానిస్థాన్(Afghanistan) చేతిలో కూడా పాక్ ఓడిపోయింది. ఈ ఓటములతో మాజీ క్రికెటర్లు, పాక్ అభిమానులు క్రికెటర్లపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మహా సంగ్రామంలో ప్రపంచ నెంబర్ 2 ర్యాంక్ బ్యాటర్ బాబర్ ఆజమ్ ఘోరంగా విఫలమయ్యాడు. ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్‌లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. పాకిస్థాన్ జట్టులో ఆత్మ విశ్వాసం నింపడంలో కూడా బాబర్ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలోనే బాబర్ ఆజమ్ పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. అయితే, మూడు ఫార్మాట్లలోనూ ప్లేయర్‌గా మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేశాడు. ప్రపంచకప్‌లో పాక్ వైఫల్యం తర్వాత పాక్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి బాబర్ ఆజమ్‌ను తప్పిస్తారని ఊహగానాలు చెలరేగాయి. అయితే పాక్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఆ దేశ క్రికెట్ బోర్డు తప్పించేలోపే బాబర్ ఆజమే తానే సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే ఇప్పుడు ఈ కెప్టెన్సీ మార్పు వ్యవహారం... పాక్ క్రికెట్‌లో రచ్చ రేపుతోంది.
బాబర్‌ను బలవంతంగా పంపేశారా?
పాకిస్థాన్ కెప్టెన్‌గా బాబర్ ఆజమ్ మూడు ఫార్మట్ల నుంచి వైదొలగగానే.. పాకిస్తాన్ టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్సీని షాన్ మసూద్‌కు అప్పగించారు. T20 జట్టు కెప్టెన్సీని షాహీన్ షా ఆఫ్రిదికి అప్పగించారు, ఇంకా వన్డే జట్టుకు కెప్టెన్‌ను నియమించలేదు. అయితే బాబర్‌ను బలవంతంగా కెప్టెన్సీ నుంచి తొలగించారన్న వార్తలు అప్పట్లో చాలా వచ్చాయి. అయితే ఇప్పుడు పాక్ మీడియా తాజా కథనం ప్రకారం ఇది నిజమని తేలింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తాత్కాలిక చీఫ్ జకా అష్రాఫ్‌కి సంబంధించిన ఆడియో.. పాకిస్తాన్ మీడియాలో లీక్ అయింది.. ఇందులో కెప్టెన్సీ విడిచిపెట్టమని జకా అష్రాఫ్... బాబర్ ఆజంపై ఒత్తిడి చేస్తున్నట్లు ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆడియోలో.. బాబర్ ఆజం కెప్టెన్సీకి రాజీనామా చేయకముందే... జకా అష్రఫ్ పాకిస్థాన్ క్రికెట్ జట్టు తదుపరి కెప్టెన్‌పై మాట్లాడినట్లు ఉంది.
ఆ ఆడియోలో ఏముంది?
ఆ ఆడియోలో జాకా అష్రాఫ్ మాటలు వినిపిస్తున్నాయి. తాను బాబర్‌ను టెస్ట్ కెప్టెన్‌గా ఉండమని అడిగానని... కానీ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తొలగాలని కోరానని అష్రాఫ్ చెప్పాడు. అయితే బాబర్ దీనిపై ఆలోచించి నిర్ణయం చెప్తానని వెల్లడించినట్లు అష్రాఫ్.. ఎవరో ఒక వ్యక్తికి వివరిస్తున్నట్లు ఆ ఆడియోలో ఉంది. లీకైన ఆడియోలో పీసీబీ చీఫ్ ప్లాన్ బీని సిద్ధంగా ఉంచుకోవడం.. మహ్మద్ రిజ్వాన్‌ను తనకు ఇష్టమైన వ్యక్తిగా కెప్టెన్‌గా పేర్కొనడం సంచలనం రేపుతోంది. బాబర్ అజామ్ తన సన్నిహితులు, స్నేహితులైన ఆటగాళ్లకు మాత్రమే జట్టులో ఆడే అవకాశం ఇస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఆడియో లీక్ తర్వాత, పీసీబీ తాత్కాలిక చీఫ్ జకా అష్రఫ్‌పై బాబర్ అజామ్ అభిమానులు భగ్గుమంటున్నారు.
సెమీస్‌కు చేరకుండానే వెనుదిరిగిన పాక్
భారత్‌లో జరిగిన ప్రపంచకప్ పాక్‌కు తీరని వేదనను మిగిల్చింది. ఎన్నో ఆశలు.. మరెన్నో అంచనాలతో రెండు దశాబ్దాల కలను నెరవేర్చుకునేందుకు భారత్‌లో అడుగుపెట్టిన పాకిస్థాన్ సెమీస్ చేరకుండానే తిరుగు ముఖం పట్టింది. ఆరంభంలో రెండు మ్యాచ్‌లు గెలిచి ఈ మహా సంగ్రామాన్ని ఘనంగా ప్రారంభించిన పాక్ తర్వాత గాడి తప్పింది. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా చలామణి అవుతున్న బాబర్ ఆజమ్... మంచి ఫామ్‌లో ఉన్న రిజ్వాన్, ఇమాముల్ హక్, క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ పేసర్లుగా గుర్తింపు పొందిన షహీన్ షా అఫ్రిదీ, హరీస్ రౌఫ్ ఇలా ఎలా చూసినా అద్భుత ఆటగాళ్లు ఉండడంతో పాక్ సెమీస్ చేరడం ఖాయమని మాజీ క్రికెటర్లు భావించారు. కానీ ఈ అంచనాలు తలకిందులయ్యాయి. పాక్ బ్యాటర్లు అంచనాలను అందుకోలేకపోయారు. ఈ ప్రపంచకప్‌లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన బాబర్ ఆజమ్ ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేదు. ఒక్క షహీన్ షా అఫ్రిదీ తప్పితే మిగిలిన పాక్ బౌలింగ్ దళం పూర్తిగా విఫలమైంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion