అన్వేషించండి

AUS Vs NED: దాసోహమంటారా, చరిత్ర సృష్టిస్తారా? ఆస్ట్రేలియాతో పోరుకు నెదర్లాండ్స్‌ సై!

ODI World Cup 2023: ప్రపంచకప్‌లో సెమీస్‌ చేరాలన్న పట్టుదలతో ఉన్న ఆస్ట్రేలియా.. పసికూన నెదర్లాండ్స్‌తో  మ్యాచ్‌కు సిద్ధమైంది.

ప్రపంచకప్‌లో సెమీస్‌ చేరాలన్న పట్టుదలతో ఉన్న ఆస్ట్రేలియా.. పసికూన నెదర్లాండ్స్‌తో  మ్యాచ్‌కు సిద్ధమైంది. భారత్‌ వేదికగా జరుగుతున్న మహా సంగ్రామంలో ఆరంభ మ్యాచుల్లో ఓటములతో డీలా పడ్డ కంగారు జట్టు... తర్వాత అద్భుతంగా పుంజుకుని విజయాల బాట పట్టి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. పసికూన నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ విజయం సాధించి సెమీ ఫైనల్‌ దిశగా మరో ఆడుగు ముందుకు వేయాలని చూస్తోంది. ఇప్పటికే డిఫెండింగ్‌ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు షాక్ ఇచ్చిన నెదర్లాండ్స్‌ను ఏ మాత్రం తక్కువ అంచనా వేయొద్దన్న విషయం కంగారు జట్టుకు బాగా తెలుసు. అందుకే ఈ మ్యాచ్‌లో ఎలాంటి అలసత్యం ప్రదర్శించబోమని.. ప్రపంచకప్‌లో ప్రతీ మ్యాచ్‌ అత్యంత కీలకమని తమకు తెలుసని ఆస్ట్రేలియా సారధి పాట్‌ కమిన్స్‌ వెల్లడించాడు. కంగారు ఓవెనర్లు ధాటిగా బ్యాటింగ్‌ చేస్తున్నారు. వాళ్ల విధ్వంసం పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో స్పష్టంగా తెలిసింది. ఈ మ్యాచ్‌లోనూ వార్నర్‌ రాణిస్తే ఆసిస్‌ను ఆపడం డచ్‌ జట్టుకు తలకు మించిన బారం కానుంది. అదికాక ప్రపంచకప్‌లాంటి మెగా ఈవెంట్‌లో వేగంగా ఎలా పుంజుకోవాలో ఆస్ట్రేలియా జట్టుకు తెలిసినంత బాగా మరే జట్టుకు తెలీదని కూడా మాజీలు గుర్తు చేస్తున్నారు.
 
ట్రావిస్ హెడ్ మళ్లీ ప్రాక్టీస్‌ మొదలుపెట్టడం ఆస్ట్రేలియా జట్టుకు ఉపశమనం కలిగిస్తోంది. చేతి గాయం నుంచి కోలుకున్న హెడ్‌ నెదర్లాండ్స్‌ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ హెడ్‌ జట్టులోకి వస్తే లబుషేన్‌పై వేటు పడొచ్చు. ప్రపంచకప్‌ అరంభంలో వరుసగా రెండు పరాజయాలతో వెనకపడ్డ  కంగారులు... శ్రీలంక, పాకిస్తాన్‌లపై ఘన విజయాలు సాధించి మళ్లీ బరిలో నిలిచారు. కానీ ఇప్పటికే అద్భుత పోరాటంతో క్రికెట్‌ అభిమానులను ఆకట్టుకుంటున్న డచ్‌ జట్టును తేలిగ్గా తీసుకుంటే కంగారులు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు. ధర్మశాలలో ఫామ్‌లో ఉన్న దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ ఓడించిన విషయం కంగారులు మర్చిపోరు. ఈ ప్రపంచకప్‌లో ప్రొటీస్‌ ఓడిపోయిన ఒకే ఒక్క మ్యాచ్‌... నెదర్లాండ్స్‌ చేతుల్లోనే కావడం విశేషం. 
 
కంగారులకు మిడిల్‌ ఆర్డర్‌ కంగారు
ఆస్ట్రేలియా జట్టులో టాపార్డర్‌ బ్యాటర్లు మెరుగ్గా రాణిస్తున్నారు. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్‌ విధ్వంస బ్యాటింగ్‌తో ప్రత్యర్థిని చిత్తు చేస్తున్నారు. పాకిస్థాన్‌పై వీరిద్దరూ 259 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నిర్మించారు. మార్ష్ ఓపెనర్‌గా ఏడు ఇన్నింగ్స్‌లలో 108.3 స్ట్రైక్ రేట్‌తో 351 పరుగులు చేసి భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఓపెనర్లు మెరుగ్గా రాణిస్తున్నా మిడిల్‌ ఆర్డర్‌ వైఫల్యం కంగారు జట్టును ఆందోళన పరుస్తోంది. బౌలర్లు కూడా సమష్టిగా రాణిస్తున్నారు.  స్టీవ్ స్మిత్, మార్నస్‌ లబుషేన్‌, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినీస్‌ ఇప్పటివరకూ ఒక్క మంచి ఇన్నింగ్స్‌ కూడా ఆడలేదు. వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ శ్రీలంకపై కీలక అర్ధశతకం సాధించి పర్వాలేదనిపించాడు. వీళ్లు మళ్లీ గాడిన పడితే ఈప్రపంచకప్‌లో కంగారులు మళ్లీ ప్రమాదకరంగా మారుతారు. స్పిన్నర్ ఆడమ్ జంపా, పేసర్లు జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్‌ స్థిరంగా రాణిస్తున్నారు. 
 
చరిత్ర సృష్టిస్తారా..?
నెదర్లాండ్స్‌ ఇప్పటివరకూ వన్డేల్లో ఆస్ట్రేలియాను ఎన్నడూ ఓడించలేదు. 2003, 2007లోఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిపోయారు. కానీ డచ్‌ జట్టు ఇప్పటికే దక్షిణాఫ్రికాపై సంచలన విజయం సాధించి.. శ్రీలంకపై కొద్దిలో ఓడిపోయారు. ఇది వారి సత్తాను ప్రపంచానికి చాటింది. నెదర్లాండ్స్‌ జట్టులో స్థిరమైన ఆల్‌రౌండర్లు ఉన్నారు. ఓపెనర్ మాక్స్ ఓడౌడ్, విక్రమ్‌జిత్ ఇప్పటివరకూ శుభారంభం అందించలేదు. ఈ మ్యాచ్‌లో రాణించాలని ఈ ఓపెనింగ్ జోడీ భావిస్తోంది. బాస్ డి లీడే, ఆర్యన్ దత్, వాన్ మీకెరెన్‌లు బంతితో రాణిస్తున్నారు. 
 
ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్‌), స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, అష్టన్ అగర్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్.
 
నెదర్లాండ్స్ జట్టు: స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్‌), కోలిన్ అకెర్మాన్, వెస్లీ బరేసి, బాస్ డి లీడే, ఆర్యన్ దత్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, ర్యాన్ క్లైన్, తేజా నిడమనూరు, మాక్స్ ఓ'డౌడ్, సాకిబ్ జుల్ఫికర్, షరీజ్ అహ్మద్, లోగాన్ వాన్ బెక్ రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, పాల్ వాన్ మీకెరెన్ విక్రమ్‌జిత్ సింగ్.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Viral News: ఆర్టీసీ బస్‌లో రేవంత్ రెడ్డి రాహుల్- ఉచిత ప్రయాణంపై మహిళలతో మాటామంతి
ఆర్టీసీ బస్‌లో రేవంత్ రెడ్డి రాహుల్- ఉచిత ప్రయాణంపై మహిళలతో మాటామంతి
Andhra Pradesh News: ఏపీలోనే హాటెస్ట్ నియోజకవర్గంలో కుమారీ అంటీ ఎన్నికల ప్రచారం- ఫైర్‌ బ్రాండ్‌పైనే విమర్శలు!
ఏపీలోనే హాటెస్ట్ నియోజకవర్గంలో కుమారీ అంటీ ఎన్నికల ప్రచారం- ఫైర్‌ బ్రాండ్‌పైనే విమర్శలు!
KTR Road Show: కేటీఅర్‌పై టమాటాలు, ఆలుగడ్డలతో దాడి, బీఆర్ఎస్ రోడ్‌ షోలో ఉద్రిక్తత!
కేటీఅర్‌పై టమాటాలు, ఆలుగడ్డలతో దాడి, బీఆర్ఎస్ రోడ్‌ షోలో ఉద్రిక్తత!
Weather Latest Update: నేడు ఉరుములు, మెరుపులతో వర్షాలు, ఈదురు గాలులు కూడా : ఐఎండీ
నేడు ఉరుములు, మెరుపులతో వర్షాలు, ఈదురు గాలులు కూడా : ఐఎండీ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Virat Kohli 30 Sixes in IPL 2024 | ఐపీఎల్ 2024లో 30 సిక్సర్లు కొట్టిన విరాట్ కోహ్లీ | ABP DesamRCB Excellent Performance in IPL 2024 Second Half | ఐపీఎల్ సెకండాఫ్‌లో అదరగొడుతున్న ఆర్సీబీ | ABP DesamVirat Kohli 600 Runs in IPL 2024 | నాలుగు సీజన్లలో 600 దాటిన కోహ్లీ | ABP DesamVirat Kohli Reaction to Rilee Rossouw | రిలీ రౌసో యాక్షన్‌కు విరాట్ రియాక్షన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral News: ఆర్టీసీ బస్‌లో రేవంత్ రెడ్డి రాహుల్- ఉచిత ప్రయాణంపై మహిళలతో మాటామంతి
ఆర్టీసీ బస్‌లో రేవంత్ రెడ్డి రాహుల్- ఉచిత ప్రయాణంపై మహిళలతో మాటామంతి
Andhra Pradesh News: ఏపీలోనే హాటెస్ట్ నియోజకవర్గంలో కుమారీ అంటీ ఎన్నికల ప్రచారం- ఫైర్‌ బ్రాండ్‌పైనే విమర్శలు!
ఏపీలోనే హాటెస్ట్ నియోజకవర్గంలో కుమారీ అంటీ ఎన్నికల ప్రచారం- ఫైర్‌ బ్రాండ్‌పైనే విమర్శలు!
KTR Road Show: కేటీఅర్‌పై టమాటాలు, ఆలుగడ్డలతో దాడి, బీఆర్ఎస్ రోడ్‌ షోలో ఉద్రిక్తత!
కేటీఅర్‌పై టమాటాలు, ఆలుగడ్డలతో దాడి, బీఆర్ఎస్ రోడ్‌ షోలో ఉద్రిక్తత!
Weather Latest Update: నేడు ఉరుములు, మెరుపులతో వర్షాలు, ఈదురు గాలులు కూడా : ఐఎండీ
నేడు ఉరుములు, మెరుపులతో వర్షాలు, ఈదురు గాలులు కూడా : ఐఎండీ
Chiranjeevi: పద్మ విభూషణ్‌ అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవి - వీడియో వైరల్‌
పద్మ విభూషణ్‌ అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవి - వీడియో వైరల్‌
Janasena: ఇంగ్లాండ్ వాస్‌డేల్ పర్వతంపై జనసేన జెండా, పవన్ కల్యాణ్ కోసం యువకుడి సాహసం
ఇంగ్లాండ్ వాస్‌డేల్ పర్వతంపై జనసేన జెండా, పవన్ కల్యాణ్ కోసం యువకుడి సాహసం
Aavesham movie OTT: సడెన్‌గా ఓటీటీకి వచ్చేసిన ఫహాద్‌ ఫాజిల్‌ 'ఆవేశం'- స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!
సడెన్‌గా ఓటీటీకి వచ్చేసిన ఫహాద్‌ ఫాజిల్‌ 'ఆవేశం'- స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!
Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ రోజు తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ఆలయాలివే!
అక్షయ తృతీయ రోజు తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ఆలయాలివే!
Embed widget