అన్వేషించండి

AUS vs PAK : రక్తం కారుతున్నా మైదానంలోనే

Steave Smith: ఆటలో చివరి బంతి వరకు పోరాడడం ఆస్ట్రేలియాకు వెన్నతో పెట్టిన విద్య. ఓటమిని ఆస్ట్రేలియన్లు అంత తేలిగ్గా ఒప్పుకోరు. దానికి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనే ఘటనే నిదర్శనం.

భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తొలి రెండు మ్యాచుల్లో పరాజయం పాలై పాయింట్ల పట్టికలో చిట్టచివరన నిలిచింది. కానీ తర్వాతి రెండు మ్యాచుల్లో ఘన విజయం సాధించి ఇప్పుడు నాలుగో స్థానంలో కొనసాగుతోంది. టీమిండియా, దక్షిణాఫ్రికాతో ఘోర పరాజయం తర్వాత శ్రీలంక, పాకిస్థాన్‌ జట్లతో ఘన విజయం సాధించి మళ్లీ సెమీస్‌ రేసులోకి వచ్చింది. ఆటలో చివరి బంతి వరకు పోరాడడం ఆస్ట్రేలియాకు వెన్నతో పెట్టిన విద్య. ఓటమిని ఆస్ట్రేలియన్లు అంత తేలిగ్గా ఒప్పుకోరు. దానికి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనే ఘటనే నిదర్శనం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కంగారులు... వార్నర్‌, మార్ష్‌ విధ్వంసంతో 367 పరుగులను సాధించారు. అనంతరం పాక్‌కు కూడా  అదిరే ఆరంభం లభించింది. పాక్‌ విజయం దిశగా సాగుతున్న వేళ జరిగిన ఓ ఆసక్తికర ఘటన... ఆసిస్‌ ఆటగాళ్లు గ్రౌండ్‌లో ఎంత చిత్తశుద్ధితో ఉంటారో తెలుపుతోంది. 

ప్రపంచకప్ వంటి పెద్ద టోర్నమెంట్‌లో ఫీల్డింగ్ చాలా ముఖ్యం. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌  సులువైన మూడు క్యాచ్‌లను జారవిడిచి తగిన మూల్యం చెల్లించుకుంది. కానీ ఆస్ట్రేలియా పాక్‌కు అంత తేలిగ్గా పరుగులు ఇవ్వలేదు. మైదానంలో చురుగ్గా కదిలి పరుగులు చేసేందుకు పాక్‌ బ్యాటర్లు కష్టపడేలా చేసింది. కంగారు బ్యాటర్‌ స్టీవ్ స్మిత్ పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు డైవ్‌ చేస్తూ ఓ బంతిని ఆపేశాడు. ఈ ప్రయత్నంలో స్మిత్‌ మోకాలికి గాయమై రక్తం కారింది. అది ప్యాంట్‌కు అంటుకుని బయటకు స్పష్టంగా కనిపించింది కూడా. కానీ స్టీవ్ స్మిత్ మైదానాన్ని వీడడానికి ఇష్టపడలేదు. మోకాలికి రక్తం కారుతున్నా అలాగే ఫీల్డింగ్‌ చేశాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ 14వ ఓవర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు బంతిని ఆపేందుకు స్టీవ్ స్మిత్ డైవ్ చేశాడు. ఆ డైవ్ చేసే సమయంలో స్మిత్‌ మోకాలికి రక్తగాయమైంది. ఆయినా స్మిత్‌ ఆ నొప్పితో ఫీల్డింగ్‌ చేశాడు. 

ఇక ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 62 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసి ఈ మెగా టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ హై స్కోరింగ్‌ మ్యాచ్‌లు రెండు జట్లు 672 పరుగులు నమోదు చేశాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ బౌలింగ్ తీసుకున్నాడు. డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్షల్‌ విధ్వంసంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. 368 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ ఆరంభంలో లక్ష్యం దిశగా పయనించింది. కానీ ఆసిస్‌ బౌలర్లు సమష్టిగా రాణించడంతో పాక్ 305 పరుగులకే పరిమితమైంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయంతో ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. పాకిస్థాన్‌ అయిదో స్థానానికి పడిపోయింది.

డేవిడ్‌ వార్నర్‌ 140 బంతులుఎదుర్కొని 168 పరుగులు చేశాడు. 108 బంతులు ఎదుర్కొన్న మిచెల్‌ మార్ష్‌ 10 భారీ సిక్సులు, 9 ఫోర్లతో 121 పరుగులు చేశాడు. హరీస్‌ రౌఫ్‌ వేసిన తొమ్మిదో ఓవర్లో 24 పరుగులు పిండుకున్నారు. ఆ ఓవర్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సుతో 24 పరుగులు వచ్చాయి. అప్పటినుంచి ఆసిస్‌ బ్యాటింగ్‌ జెట్‌ స్పీడ్‌తో సాగింది. క్రీజులో కాస్త కుదురుకున్నాక విధ్వంసాన్ని మొదలుపెట్టిన ఈ ఇద్దరు ఆస్ట్రేలియాకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. 33 ఓవర్లపాటు వికెట్‌ పడకుండా బ్యాటింగ్‌ చేసి తొలి వికెట్‌కు 259 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Arrest Chiranjeevi Reaction: అల్లు అర్జున్ అరెస్టుతో షూటింగ్స్ రద్దు చేసుకున్న చిరంజీవి- కాసేపట్లో స్టేషన్‌కు రాక 
Allu Arjun Arrest Chiranjeevi Reaction: అల్లు అర్జున్ అరెస్టుతో షూటింగ్స్ రద్దు చేసుకున్న చిరంజీవి- కాసేపట్లో స్టేషన్‌కు రాక 
Allu Arjun Arrest Time: భార్యకు ముద్దిచ్చి - నాన్నకు  ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
భార్యకు ముద్దిచ్చి - నాన్నకు ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
Allu Arjun Arrest : అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
CM Chandrababu: వెల్దీ హెల్దీ హ్యాపీ ఏపీయే లక్ష్యం - 'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
వెల్దీ హెల్దీ హ్యాపీ ఏపీయే లక్ష్యం - 'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నువ్వు అన్న ఏంట్రా.. ముసలోడివి! తాగి మనోజ్ రచ్చ!కత్తులు, గన్స్‌తో ఇంట్లోకి దొంగలు, కిలోలకొద్దీ బంగారం దోపిడీవిజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Arrest Chiranjeevi Reaction: అల్లు అర్జున్ అరెస్టుతో షూటింగ్స్ రద్దు చేసుకున్న చిరంజీవి- కాసేపట్లో స్టేషన్‌కు రాక 
Allu Arjun Arrest Chiranjeevi Reaction: అల్లు అర్జున్ అరెస్టుతో షూటింగ్స్ రద్దు చేసుకున్న చిరంజీవి- కాసేపట్లో స్టేషన్‌కు రాక 
Allu Arjun Arrest Time: భార్యకు ముద్దిచ్చి - నాన్నకు  ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
భార్యకు ముద్దిచ్చి - నాన్నకు ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
Allu Arjun Arrest : అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
CM Chandrababu: వెల్దీ హెల్దీ హ్యాపీ ఏపీయే లక్ష్యం - 'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
వెల్దీ హెల్దీ హ్యాపీ ఏపీయే లక్ష్యం - 'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
Miss You Movie Review - మిస్ యు రివ్యూ - సిద్ధార్థ్ సినిమాకు ఆడియన్స్ వస్తారా? వచ్చేలా ఉందా? పుష్ప 2 ఎఫెక్ట్ ఉంటుందా?
మిస్ యు రివ్యూ - సిద్ధార్థ్ సినిమాకు ఆడియన్స్ వస్తారా? వచ్చేలా ఉందా? పుష్ప 2 ఎఫెక్ట్ ఉంటుందా?
Bhoodan Land Scam In Rangareddy: భూదాన్ లాండ్ స్కామ్‌లో భారీ ట్విస్ట్‌- మాజీ ఎమ్మెల్యే, రియల్‌ఎస్టేట్ సంస్థ ఎండీకి నోటీసులు
భూదాన్ లాండ్ స్కామ్‌లో భారీ ట్విస్ట్‌- మాజీ ఎమ్మెల్యే, రియల్‌ఎస్టేట్ సంస్థ ఎండీకి నోటీసులు
YSRCP MP Avinash Reddy Arrest: పులివెందుల నీటి సంఘాల ఎన్నికల్లో ఘర్షణ- వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు
YSRCP MP Avinash Reddy Arrest: పులివెందుల నీటి సంఘాల ఎన్నికల్లో ఘర్షణ- వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Embed widget