అన్వేషించండి

Asia Cup 2025 Pak vs Oman Result Update: ఒమ‌న్ ను చిత్తు చేసిన పాక్.. రాణించిన హ‌రీస్, అయూబ్, .. ఈనెల 14న ఇండియాతో కీల‌క మ్యాచ్

అన్ని రంగాల్లా స‌త్తా చాటిన పాక్ .. ఈ టోర్నీలో శుభారంభం చేసింది. భారీ స్కోరు చేసిన పాక్. ఆ త‌ర్వాత ప్ర‌త్య‌ర్థిని నిలువ‌రించి, భారీ విజ‌యాన్ని త‌న సొంత చేసుకుంది. త‌ర్వాత మ్యాచ్ లో ఇండియాతో ఆడ‌నుంది. 

Asia Cup 2025 Latest Updates :  ఆసియాక‌ప్ లో పాకిస్తాన్ బోణీ కొట్టింది. శుక్ర‌వారం దుబాయ్ లో జ‌రిగిన ఆసియాక‌ప్ లీగ్ మ్యాచ్ లో ఒమ‌న్ పై 93 ప‌రుగుల‌తో భారీ విజ‌యాన్ని సాధించింది. అంత‌కుముందు టాస్ గెలిచి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన పాక్ .. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల‌కు 160 ప‌రుగులు చేసింది. వ‌న్ డౌన్ మ్యాట‌ర్ మ‌మ్మ‌ద్ హ‌రీస్ సూప‌ర్ ఫిఫ్టీ (43 బంతుల్లో 66, 7 ఫోర్లు, 3 సిక్స‌ర్లు)తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. బౌల‌ర్ల‌లో అమీర్ క‌లీమ్ కు మూడు వికెట్లు ద‌క్కాయి. అనంత‌రం టార్గేట్ ఛేజింగ్ లో ఏద‌శ‌లోనూ ఒమ‌న్ విజ‌యం వైపు కు వెళ్ల‌లేదు. బౌల‌ర్ల‌లో ధాటికి 16.4 ఓవ‌ర్ల‌లో 67 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. వ‌న్ డౌన్ బ్యాట‌ర్ హమ్మ‌ద్ మీర్జా (27) టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. పాక్ బౌల‌ర్ల‌లో స‌యిమ్ అయూబ్, సుఫియ‌న్ ముఖీమ్, ఫ‌హీం అష్ర‌ఫ్ కు రెండేసి వికెట్లు ద‌క్కాయి. ఈ విజ‌యంతో పాక్ ఈ టోర్నీలో బోణీ కొట్టింది. త‌ర్వాత మ్యాచ్ లో ఇండియాతో ఆదివారం (ఈనెల 14న‌) దుబాయ్ లో పాక్ ఆడుతుండ‌గా, యూఏఈతో సోమ‌వారం (ఈనెల 15న‌) ఒమ‌న్ త‌ల‌ప‌డుతుంది. 

అయూబ్ డ‌కౌట్..
పాక్ మాజీ ఆట‌గాళ్లు పేర్కొన్న విధంగా అయూబ్ ధాటిగా ఆడ‌లేదు. భార‌త్ తో మ్యాచ్ లో స్టార్ పేస‌ర్ జ‌స్ ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో ఆరు బంతుల‌కు ఆరు సిక్స‌ర్లు కొట్టే అవ‌కాశం ఆయూబ్ కు ఉంద‌ని మాజీ క్రికెట‌ర్ వ్యాఖ్యానించ‌గా, ఒమ‌న్ పై మాత్రం తొలి బంతికే త‌ను డ‌కౌట‌య్యాడు. దీంతో ఆ మాజీ క్రికెట‌ర్ పై ట్రోలింగ్ న‌డుస్తోంది. కూన బౌల‌ర్ల‌నే ఎదుర్కొని అయూబ్.. భార‌త బౌల‌ర్ల ముందు తేలిపోతాడ‌ని విమ‌ర్శిస్తున్నారు. ఇక అయూబ్ ఔటైనా.. ఓపెన‌ర్ షాహిబ్ జాదా ఫ‌ర్హాన్ (29) తో క‌లిసి హ‌రీస్ కీల‌క భాగ‌స్వ‌మ్యాన్ని నెల‌కొల్పాడు. వీరిద్ద‌రూ కుదురుగా ఆడటంతో పాక్ ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. ఆ త‌ర్వాత ఫ‌ర్హాన్ ఔటైనా, ఫ‌ఖార్ జ‌మాన్ (23) మిన‌హా మిగ‌తా వారంతా తేలిపోయారు. ఆఖ‌రికి ఫిఫ్టీ చేసుకున్నాక హ‌రీస్ కూడా ఔట‌వ‌డంతో ఓ మోస్త‌రు స్కోరు కే పాక్ ప‌రిమిత‌మైంది. 

ట‌ప‌ట‌పా..
కాస్త పెద్ద టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఒమ‌న్ ఏ ద‌శ‌లోనూ ల‌క్ష్యం వైపు అడుగులు వేయ‌లేదు. ఆరంభంలోనే కెప్టెన్ క‌మ్ ఓపెన‌ర్ జ‌తింద‌ర్ సింగ్ (1) వికెట్ ను కోల్పోయిన ఒమ‌న్.. ఆ త‌ర్వాత వ‌రుస విరామాల్లో వికెట్ల‌ను కోల్పోయింది. హ‌మ్మ‌ద్ తోపాటు ఓపెన‌ర్ అమీర్ క‌లీమ్ (13), ష‌కీల్ అహ్మ‌ద్ (10) మాత్ర‌మే రెండంకెల స్కోరు చేయ‌గా, మిగ‌తా బ్యాట‌ర్లు ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. దీంతో ఒమ‌న్ కు భారీ ప‌రాజ‌యం ఖాయ‌మైంది. మిగ‌తా బౌల‌ర్లలో షాహిన్ షా ఆఫ్రిదీ, అబ్రార్ అహ్మ‌ద్, మ‌హ్మ‌ద్ నవాజ్ కు త‌లో వికెట్ ద‌క్కింది. హ‌రీస్ కే ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ద‌క్కింది. ఇక గాయంతో ఫిట్ నెస్ స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నాడ‌ని భావిస్తున్న కెప్టెన్ స‌ల్మాన్ అలీ ఆఘా ఈ మ్యాచ్ లో ఆడాడు. అయితే త‌ను ఎదుర్కొన్న తొలి బంతికే డ‌కౌట్ అయ్యాడు. 

టాప్ హెడ్ లైన్స్

IND vs BAN Tour: బంగ్లాదేశ్ టూర్ కి గవర్నమెంట్ పర్మిషన్ కోసం బిసిసిఐ వెయిటింగ్.. రెండు బోర్డుల మధ్య కుదిరిన రాజీ, సిరీస్ నిర్వహణపై ట్విస్ట్!
బంగ్లాదేశ్ టూర్ కి గవర్నమెంట్ పర్మిషన్ కోసం బిసిసిఐ వెయిటింగ్.. రెండు బోర్డుల మధ్య కుదిరిన రాజీ, సిరీస్ నిర్వహణపై ట్విస్ట్!
IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
Gambhir Coach Tenure: గంభీర్ హెడ్ కోచ్ పదవికి బిగ్ ప్రొటెక్షన్.. సాకింగ్ రూమర్స్ పై బిసిసిఐ క్లారిటీ!
గంభీర్ హెడ్ కోచ్ పదవికి బిగ్ ప్రొటెక్షన్.. సాకింగ్ రూమర్స్ పై బిసిసిఐ క్లారిటీ!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
Embed widget