అన్వేషించండి

Ashes Series 2023: గ్రీన్ వద్దు మర్ఫీ ముద్దు - ఐదో టెస్టుకు ముందు ఆసీస్‌కు మాజీ ఆటగాడి సూచన

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య ఈనెల 27 నుంచి కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా చివరి టెస్టు జరుగనుంది.

Ashes Series 2023: ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య మాంచెస్టర్ వేదికగా  డ్రా గా ముగిసిన నాలుగో టెస్టు తర్వాత ఇప్పుడు అందరిచూపులూ  ‘కెన్నింగ్టన్ ఓవల్’మీదే పడ్డాయి.   ఓవల్ వేదికగా ఈనెల 27 నుంచి ఇక్కడ ఇంగ్లాండ్ - ఆసీస్‌లు యాషెస్ - 2023లో భాగంగా ఆఖరిదైన ఐదో టెస్టు ఆడనున్నాయి. ఈ టెస్టులో అయినా ఆసీస్.. మాంచెస్టర్‌తో చేసిన తప్పులను రిపీట్ చేయొద్దని, ఇద్దరు ఆల్ రౌండర్ల ప్రయోగాన్ని వీడి టీమ్‌లో ఒక స్పిన్నర్‌ను చేర్చుకుంటే మంచిదన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.  తాజాగా ఆసీస్ దిగ్గజం టామ్ మూడీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.  

ఓవల్ టెస్టుకు ముందు  మూడీ మాట్లాడుతూ... ‘మాంచెస్టర్ టెస్టులో  ఆసీస్.. యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీని ఆడించి ఉంటే బాగుండేది.  ఓవల్ టెస్టులో అయినా అతడిని ఆడించాలి.  బౌలింగ్ అటాక్‌లో కూడా బ్యాలెన్సింగ్ ఉండాలి.   మర్ఫీ  అద్భుతమైన టాలెంట్ కలిగిన యువ స్పిన్నర్. అతడు నాథన్ లియాన్ కాకపోవచ్చు. కానీ లియాన్ కూడా షేన్ వార్న్ కాదు కదా.  మర్ఫీ తన  సొంత  బాటను వేసుకోవాలి.  ఆ మేరకు అతడు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాడు.  ఆ విషయంలో విజయం కూడా సాధించాడు..’అని కొనియాడాడు.  

22 ఏండ్ల మర్ఫీ.. ఈ ఏడాది బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగిన  టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేశాడు.  ఈ సిరీస్‌లో  అతడు భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. సీనియర్  స్పిన్నర్ లియాన్ కంటే  మర్ఫీ మెరుగ్గా రాణించాడు.  కాగా మాంచెస్టర్ టెస్టులో  ఆసీస్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు ఆల్ రౌండర్లతో బరిలోకి దిగింది.  మిచెల్ స్టార్క్,  జోష్ హెజిల్‌వుడ్,  పాట్ కమిన్స్ తో పాటు మీడియం పేసర్లుగా కామెరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్‌లు ఆడారు. ఈ ఐదుగురు మాంచెస్టర్ టెస్టులో ధారాళంగా పరుగులిచ్చారు. తుది జట్టులో ఒక స్పిన్నర్ లేకుండా బరిలోకి దిగడం దశాబ్దకాలం తర్వాత ఇదే ప్రథమం. 

కాగా ఐదో టెస్టు జరుగబోయే ఓవల్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశాలున్నాయి. కొద్దిరోజుల క్రితమే  ఆసీస్.. ఇక్కడ భారత్‌తో వరల్డ్  టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ ఆడింది.  ఈ మ్యాచ్‌లో కూడా  ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ భారత బ్యాటర్ల పనిపట్టాడు. లియన్ గాయంతో తప్పుకోవడంతో టీమ్‌లోకి వచ్చిన మర్ఫీని ఓవల్ లో ఆడించాలని మూడీ అంటున్నాడు. ఒకవేళ ఆస్ట్రేలియా అతడిని  ఓవల్‌లో ఆడించకుంటే అది ఆశ్చర్యమే అని చెప్పాడు. 

‘మర్ఫీని ఓవల్‌లో ఆడించకుంటే అది చాలా ఆశ్చర్యకరమే అవుతుంది.  మాంచెస్టర్ టెస్టులో   ప్రధాన స్పిన్నర్ లేక ఆసీస్.. ట్రావిస్ హెడ్‌తో ఏడు ఓవర్లు వేయించింది. కానీ అతడు సక్సెస్ కాలేకపోయాడు. ఈసారి బౌలింగ్‌లో బ్యాలెన్స్ ఉండాలి.  టీమ్ బెటర్ కాంబినేషన్ దృష్ట్యా  పాట్ కమిన్స్ (ఆసీస్ సారథి)   కామెరూన్ గ్రీన్‌ను పక్కనబెట్టి మర్ఫీని ఆడించాలి. గ్రీన్‌ను పక్కనబెట్టమంటున్నానంటే అతడు నాణ్యమైన ఆటగాడు కాదని నా అర్థం. టీమ్ కాంబినేషన్ కోసం ఎవరో ఒకరు వాళ్ల ప్లేస్‌ను త్యాగం చేయాలి.  ప్రస్తుత పరిస్థితుల్లో మార్ష్‌ను పక్కనబెట్టడం కంటే గ్రీన్‌ను  ఆడించకుంటేనే బెటర్’అని  తెలిపాడు. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డికి మే 6 వరకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
లిక్కర్ స్కాం కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డికి మే 6 వరకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
Pak National Arrest: హైదరాబాద్‌లో పాకిస్తాన్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అసలేం జరిగిందంటే
హైదరాబాద్‌లో పాకిస్తాన్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అసలేం జరిగిందంటే
Missing Woman Safe: అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన వివాహిత, 2 రోజులు టెన్షన్ టెన్షన్.. పోలీసుల ఎంట్రీతో కథ సుఖాంతం
అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన వివాహిత, 2 రోజులు టెన్షన్ టెన్షన్.. పోలీసుల ఎంట్రీతో కథ సుఖాంతం
Sharwa38 Movie: మరోసారి హిట్ కాంబో రిపీట్ - శర్వానంద్ జోడీగా అనుపమ పరమేశ్వరన్.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది!
మరోసారి హిట్ కాంబో రిపీట్ - శర్వానంద్ జోడీగా అనుపమ పరమేశ్వరన్.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Thala Ajith in CSK vs SRH IPL 2025 | నిన్న చెన్నై అభిమానులకు ఒకే టికెట్ పై రెండు షోలుCSK Comparison With RCB Wins | IPL 2025 లో గతేడాది RCB మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయిన CSKKavya Maraan Expression vs CSK IPL 2025 | హావభావాలతో మ్యాచ్ టెన్షన్ మొత్తం చూపించిన కావ్యామారన్CSK Failures in IPL 2025 | MS Dhoni కెప్టెన్ అయినా రాతను మార్చుకోలేకపోయిన CSK

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డికి మే 6 వరకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
లిక్కర్ స్కాం కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డికి మే 6 వరకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
Pak National Arrest: హైదరాబాద్‌లో పాకిస్తాన్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అసలేం జరిగిందంటే
హైదరాబాద్‌లో పాకిస్తాన్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అసలేం జరిగిందంటే
Missing Woman Safe: అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన వివాహిత, 2 రోజులు టెన్షన్ టెన్షన్.. పోలీసుల ఎంట్రీతో కథ సుఖాంతం
అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన వివాహిత, 2 రోజులు టెన్షన్ టెన్షన్.. పోలీసుల ఎంట్రీతో కథ సుఖాంతం
Sharwa38 Movie: మరోసారి హిట్ కాంబో రిపీట్ - శర్వానంద్ జోడీగా అనుపమ పరమేశ్వరన్.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది!
మరోసారి హిట్ కాంబో రిపీట్ - శర్వానంద్ జోడీగా అనుపమ పరమేశ్వరన్.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది!
Shruti Haasan: కమల్ దంపతుల విడాకులు - శ్రుతిహాసన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే!
కమల్ దంపతుల విడాకులు - శ్రుతిహాసన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే!
Funds To Andhra Pradesh: ఏపీకి రూ.1,121 కోట్ల నిధులు విడుదల చేసిన కేంద్రం, త్వరలో ఆ ఖాతాల్లోకి నగదు జమ
ఏపీకి రూ.1,121 కోట్ల నిధులు విడుదల చేసిన కేంద్రం, త్వరలో ఆ ఖాతాల్లోకి నగదు జమ
Tirupati Crime News: తిరుపతిలో ఏనుగుల బీభత్సం, పొలంలో రైతును తొక్కి చంపిన గజరాజులు
తిరుపతిలో ఏనుగుల బీభత్సం, పొలంలో రైతును తొక్కి చంపిన గజరాజులు
Pahalgam Attack Effect: ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాకిస్తాన్ పౌరులకు రాష్ట్ర డీజీపీ డెడ్‌లైన్, వారికి 29 వరకు ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాకిస్తాన్ పౌరులకు రాష్ట్ర డీజీపీ డెడ్‌లైన్, వారికి 29 వరకు ఛాన్స్
Embed widget