By: ABP Desam | Updated at : 05 Jul 2023 05:13 PM (IST)
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ( Image Source : England Cricket Twitter )
Ashes Series 2023: ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఆటతో పాటు ఆఫ్ ది ఫీల్డ్ లో ఆ టీమ్ ఆటగాళ్లు చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ సారథి కెవిన్ పీటర్సన్ ఘాటుగా స్పందించాడు. బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆటలో మాత్రం అంత బోల్డ్ గా లేరని, ఆట మరీ తీసికట్టుగా ఉందని వాపోయాడు. వరుసగా రెండు టెస్టులు ఓడిన ఇంగ్లాండ్ తర్వాత ఆడబోయే మూడింట్లో ఏ ఒక్కటి ఓడినా సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంది.
ఈ నేపథ్యంలో బెట్ వేకు రాసిన వ్యాసంలో పీటర్సన్ ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లను టార్గెట్ చేశాడు. ‘ఇంగ్లాండ్ ఆటగాళ్లు వాళ్లు చెప్పిన మాటలకు ఆడే ఆటకు పొంతన లేకుండా ఉంది. వాళ్లు క్రికెట్ లో తమదే గొప్ప జట్టు అని, తామే తోపు ఆటగాళ్లమని ఫీల్ అవుతున్నారు. కానీ వాళ్లు తెలుసుకోవాల్సిన వాస్తవం ఏంటంటే.. ప్రస్తుత సిరీస్ లో ఇంగ్లాండ్ మరో టెస్టు ఓడితే 2001 తర్వాత స్వదేశంలో యాషెస్ సిరీస్ కోల్పోయిన తొలి టీమ్ అవుతుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి...
ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత పేసర్ ఓలీ రాబిన్సన్.. మేం మ్యాచ్ ను తృటిలో కోల్పోయామని, తాము గెలిచినట్టే అనుకున్నామని చెప్పాడు. జేమ్స్ అండర్సన్ అయితే పిచ్ ను నిందించాడు. జాక్ క్రాలే.. లార్డ్స్ టెస్టులో మేం 150 పరుగుల తేడాతో గెలుస్తామని ప్రగల్భాలు పలికాడు. కానీ ఫలితం ఏమైంది. ఇకనైనా ఈ నాన్సెన్స్ ను పక్కనబెడితే మంచిది. ఇంగ్లాండ్ - ఆసీస్ లు హెడింగ్లీలో మూడో టెస్టు ఆడనున్నాయి. ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసి అబాసుపాలుకావొద్దు. ముందు నోటికి తాళం వేసి ఆటలో జోరు పెంచండి..’అని సూచించాడు.
పీటర్సన్ చెప్పినట్టు.. 2001 తర్వాత స్వదేశంలో ఇంగ్లాండ్ యాషెస్ సిరీస్ కోల్పోలేదు. స్టీవ్ వా సారథ్యంలోని ఆసీస్.. 2001లో ఇంగ్లాండ్ లో ఇంగ్లాండ్ ను 4-1 తేడాతో ఓడించింది. ఆ తర్వాత ఆసీస్.. 2005, 2009, 2013, 2015, 2019 లలో ఇంగ్లాండ్ లో ఆడినా సిరీస్ గెలవలేదు. ఇప్పుడు ఆసీస్ కు అవకాశం వచ్చింది. తర్వాత జరుగబోయే మూడింట్లో ఏ ఒక్క మ్యాచ్ నెగ్గినా.. రెండు మ్యాచ్ లు డ్రా అయి, ఇంగ్లాండ్ ఒకటి గెలిచినా ఆసీస్ దే యాషెస్. 22 ఏండ్ల కంగారూల కల కూడా నెరవేరినట్టు అవుతుంది.
📺 All the highlights from Day 5 at Lord's 👇
— England Cricket (@englandcricket) July 3, 2023
📍 @HomeOfCricket#EnglandCricket | #Ashes pic.twitter.com/8LgDaPYSbW
ఎడ్జబాస్టన్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ విజయం అంచులదాకా వెళ్లింది. కానీ ఆసీస్ సారథి పాట్ కమిన్స్ వీరోచిత పోరాటంతో ఆ మ్యాచ్ ను కంగారూలు ఎగురేసుకుపోయారు. ఈ మ్యాచ్ లో ఓడిన తర్వాత ఇంగ్లాండ్ సారథి బెన్ స్టోక్స్ తో సహా పలువురు ఆటగాళ్లు.. లార్డ్స్ లో తాము భారీ తేడాతో గెలుస్తామని కామెంట్స్ చేశారు. ఇటీవలే ముగిసిన లార్డ్స్ లో కూడా ఇంగ్లాండ్ గెలిచేందుకు శతవిధాలా ప్రయత్నించింది. రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ నిర్దేశించిన 371 పరుగుల లక్ష్య ఛేదనలో బెన్ స్టోక్స్ వీరోచితంగా పోరాడినా గెలుపునకు 43 పరుగుల దూరంలోనే నిలిచిచపోయింది. లార్డ్స్ టెస్టు తర్వాత కూడా స్టోక్స్.. తాము న్యూజిలాండ్, పాకిస్తాన్ లను 3-0తో ఓడించామని, ఆసీస్ పై కూడా అలాగే ఆడి సిరీస్ గెలుచుకుంటామని కామెంట్స్ చేయడం విశేషం.
యాషెస్ సిరీస్ లో మిగిలిన టెస్టులు..
- మూడో టెస్టు : జులై 6 నుంచి 10 (లీడ్స్)
- నాలుగో టెస్టు : జులై 19 నుంచి 23 (మాంచెస్టర్)
- ఐదో టెస్టు : జులై 27 నుంచి 31 (ది ఓవల్)
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
Ravichandran Ashwin: ఇదే నా చివరి ప్రపంచ కప్ - కెరీర్ గురించి రవిచంద్రన్ అశ్విన్ ఏమన్నాడంటే?
World Cup Record: పాకిస్థాన్‌తో పాటు ఈ జట్లేవీ వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడించలేకపోయాయి, ఆ జట్లు ఏవంటే?
IND Vs ENG: ఇంగ్లండ్‌పై టాస్ గెలిచిన టీమిండియా - మొదట బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్!
IND vs ENG, WC23: భారత్-ఇంగ్లాండ్ తొలి వన్డే ఎప్పుడు ఎక్కడ ఎలా చూడాలి?
Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు
బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా
ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?
MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్
/body>