అన్వేషించండి

Ashes 2023: కరుణించవా వరుణదేవ -మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌ను ముంచుతున్న వాన

ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. మరో ఐదు వికెట్ల దూరంలో విజయం ఊరిస్తుండగా నిన్నట్నుంచి ఇంగ్లీష్ టీమ్‌కు వాన చిరాకు తెప్పిస్తోంది.

Ashes 2023: రెండు టెస్టులు ఓడినా తర్వాత  మూడో టెస్టు గెలిచి నాలుగోదానిని కూడా కైవసం చేసుకునేందుకు ఐదు వికెట్ల దూరంలో నిలిచిన ఇంగ్లాండ్  ఆశలపై వరుణుడు నీళ్లు  చల్లాడు. మాంచెస్టర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భాగంగా ఆట ఐదో రోజు తొలి సెషన్ మొత్తం వరుణుడి కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. వాన  కాసేపు తగ్గిందని సంతోషించేలోపే మళ్లీ  కురుస్తూ  ‘బజ్‌బాల్’కు  విసుగు తెప్పిస్తోంది.  ప్రస్తుత పరిస్థితుల్లో  మ్యాచ్ మొదలవడం  అయితే  అతిశయోక్తే.. అదే జరిగితే మాత్రం  ఇంగ్లాండ్ యాషెస్ సిరీస్‌ను నిలుపుకోవడం కష్టమే అవనుంది. 

ఆట నాలుగో రోజు ఉదయం సెషన్ వర్షార్పణం కాగా  రెండో సెషన్‌లో 30 ఓవర్ల ఆటే సాధ్యమైంది.  మూడో సెషన్ కూడా వర్షం కారణంగా రద్దైంది. ఇదే సీన్  నేడు కూడా రిపీట్ అవనుందని ఉదయం నుంచే వాతావరణ శాఖ రిపోర్టులు వెలువరిస్తున్నది. అనుకున్నట్టుగానే మాంచెస్టర్ నగరంలో  వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.  కొద్దిసేపు  తెరిపి ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ  కురుస్తున్నాడు. నేడు రాత్రివరకూ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఇంగ్లాండ్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. 

 

ఇంగ్లాండ్‌కు నిరాశే.. 

ఒకవేళ  నేడు ఆట మొత్తం వర్షం కారణంగా రద్దైతే మాత్రం అది  ఇంగ్లాండ్‌కు ఇబ్బందికరమే.  ఇప్పటికే యాషెస్‌లో ఆసీస్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ టెస్టు గెలిచి సిరీస్‌ను 2-2 తో సమం చేయాలని ఇంగ్లాండ్  భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఆసీస్‌ను ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 317 పరుగులకే నిలువరించింది. బ్యాటింగ్‌లో 592 పరుగులు చేసి ఆసీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో  కూడా దెబ్బకొట్టింది. మూడో రోజే నాలుగు కీలక వికెట్లు తీసినా  నాలుగో రోజు మార్నస్ లబూషేన్  పోరాటం పుణ్యమా అని  ఆసీస్ అపజయం నుంచి బయటపడింది.  లబూషేన్ నిష్క్రమించినా ప్రస్తుతం మిచెల్ మార్ష్, కామెరూన్ గ్రీన్  క్రీజులో ఉన్నారు. ఇప్పటికీ ఈ టెస్టులో ఆసీస్.. 61 పరుగులు వెనకే ఉంది. నేటి ఆట  సవ్యంగా సాగితే  మిగిలిన ఐదు వికెట్లు తీసి.. తమ ముందు ఏమైనా లక్ష్యాన్ని ఉంచితే ఐదు పది ఓవర్లలో వాటిని ఊదిపారేయాలన్నది ఇంగ్లాండ్ ప్లాన్. కానీ  ‘గాడ్ స్క్రీన్ ప్లే’  దీనికి భిన్నంగా ఉంది.   ఐదో రోజు  ఉదయం నుంచే వర్షం  కురుస్తుండటంతో ఇంగ్లాండ్ అభిమానులతో పాటు ఆటగాళ్లు కూడా.. ‘కరుణించవా వరుణ దేవ’ అంటూ ఆకాశం వైపు చూస్తున్నారు. 

 

నేటి ఆట రద్దు అయితే అది ఇంగ్లాండ్‌కే నష్టం.  వర్షం కారణంగా మ్యాచ్ డ్రా అయితే అప్పుడు చివరి టెస్టు గెలిచినా ఓడినా ఇంగ్లాండ్  యాషెస్‌ను నిలుపుకోలేదు.  ఒకవేళ అది కూడా  డ్రా అవడమో, ఆస్ట్రేలియానో గెలిస్తే మాత్రం ‘బజ్‌బాల్’కు ఊహించని దెబ్బే..!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Embed widget