అన్వేషించండి

Ashes 2023: ఇంగ్లాండ్‌ను ముంచిన వాన - మరో టెస్టు మిగిలున్నా యాషెస్ ఆసీస్‌దే

మాంచెస్టర్ టెస్టులో గెలిచి యాషెస్ సిరీస్‌ను సమం చేయాలన్న ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు.

Ashes 2023: యాషెస్ సిరీస్‌ - 2023ను ఆస్ట్రేలియా నిలబెట్టుకుంది. మాంచెస్టర్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో  ఆదివారం ముగిసిన నాలుగో టెస్టు వర్షం కారణంగా రద్దు కావడంతో ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్‌ను దక్కించుకుంది. ఆట ఐదో రోజు మొత్తం వర్షార్పణం కావడంతో ఇంగ్లాండ్‌ విజయావకాశాలపై నీళ్లు కుమ్మరించినట్టైంది.  మాంచెస్టర్ టెస్టులో విజయానికి ఐదు వికెట్ల దూరంలో నిలిచిన ఇంగ్లాండ్‌కు వరుసగా రెండు రోజుల పాటు చికాకు పెట్టిన వర్షం.. తీవ్ర నిరాశను మిగిల్చింది.  

మాంచెస్టర్ టెస్టులో  ఆది నుంచీ ఇంగ్లాండ్ ఆధిక్యం చూపించింది. తొలుత ఆస్ట్రేలియాను 317 పరుగులకే ఆలౌట్ చేసింది. తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 592 పరుగులు సాధించి ప్రత్యర్థికి కఠిన సవాల్ విసిరింది. ఆస్ట్రేలియాపై 275 పరుగుల ఆధిక్యాన్ని సాధించడమే గాక  ఆటలో మూడో రోజే  ఆసీస్‌ను 114-4తో నిలువరించింది.  ఇక నాలుగో రోజు 30 ఓవర్లు మాత్రమే ఆట సాధ్యమైంది.  ఆసీస్ బ్యాటర్  మార్నస్ లబూషేన్ సెంచరీతో ఆసీస్ పోరాటానికి దిగినా ఆ జట్టు ఇంకా 61 పరుగులు వెనుకబడే ఉంది. మ్యాచ్ జరిగిఉంటే  ఏమయ్యేదో గానీ  పరిస్థితులు మాత్రం ఇంగ్లాండ్ గెలుపునకే ఎక్కువ  అవకాశాలున్నాయి. కానీ ఆట చివరిరోజు ఒక్క బంతి కూడా  పడకుండానే  వర్షం కారణంగా మ్యాచ్ పేలవమైన డ్రా గా ముగిసింది. 

యాషెస్ ఆసీస్‌కే.. 

నాలుగు టెస్టులు ముగిసిన ఈ సిరీస్‌లో తొలి రెండు టెస్టులు గెలిచిన ఆస్ట్రేలియాకే యాషెస్ దక్కనుంది. ఈ సిరీస్ ‌లో కంగారూలు 2-1 ఆధిక్యంలో ఉన్నారు. చివరి టెస్టు జులై 27 నుంచి  కెన్నింగ్టన్ ఓవల్ (లండన్)‌లో జరుగనుంది.  ఈ మ్యాచ్‌లో గెలిచినా  ఓడినా  ఆస్ట్రేలియాకు పోయేదేమీ లేదు.  ఇంగ్లాండ్  గెలిచి సిరీస్‌ను సమం చేసినా  యాషెస్ ట్రోఫీని ఆస్ట్రేలియానే నిలబెట్టుకోనుంది.  ఎందుకంటే  గత యాషెస్ (2021-22 సీజన్)లో  ఆస్ట్రేలియా స్వదేశంలో ఇంగ్లాండ్‌ను 4‌-0తో ఓడించిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం  ఒక సిరీస్ సమమైతే గత విజేతకే యాషెస్ సొంతమవుతుంది.  2017-18 లో కూడా ఆస్ట్రేలియా ఇలాగే యాషెస్‌ను నిలబెట్టుకుంది.

 

కాగా  ఓవల్‌లో ఆస్ట్రేలియా గనక ఇంగ్లాండ్‌ను ఓడిస్తే అది  చరిత్రే కానుంది. 2001 తర్వాత  స్వదేశంలో ఇంగ్లాండ్.. యాషెస్ సిరీస్‌ను కోల్పోలేదు.  ఓవల్‌లో గెలిస్తే మాత్రం 22 ఏండ్ల తర్వాత  పాట్ కమిన్స్ సేన చరిత్ర సృష్టించడం ఖాయం.. ఇంగ్లాండ్  చివరిసారి 2015-16లో యాషెస్‌ను గెలుచుకుంది.  ఆ ఏడాది  స్వదేశంలో జరిగిన  సిరీస్‌లో ఇంగ్లాండ్ 3-2తో యాషెస్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత  8 ఏండ్లు గడుస్తున్నా యాషెస్  ట్రోఫీ ఇంగ్లాండ్‌కు అందని ద్రాక్షే అవుతోంది.

 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Game Changer Teaser Release: హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Game Changer Teaser Release: హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Thandel: సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Embed widget