అన్వేషించండి

Ashes Series 2023: ఏడు వికెట్లు పడగొడితే బజ్‌బాల్ - 174 పరుగులిస్తే నవ్వులపాలు - ఆసక్తికర ముగింపు‌ తథ్యం!

యాషెస్ తొలి టెస్టులో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజేత ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు విజయం దిశగా దూసుకుపోతోంది. ఇంగ్లాండ్‌ కూడా అద్భుతాల మీద ఆశలు పెట్టుకుంది.

Ashes Series 2023: ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియాల మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో  పర్యాటక జట్టు  (ఆసీస్) విజయం దిశగా సాగుతోంది. ఇంగ్లాండ్ బజ్‌బాల్ దూకుడుకు ఆసీస్ షాకిచ్చేట్టే కనిపిస్తోంది.  రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ నిర్దేశించిన 280 పరుగుల  లక్ష్య ఛేదనలో  ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి  30 ఓవర్లలో  మూడు వికెట్లు కోల్పోయి  107 పరుగులు చేసింది. ఆట ఆఖరి రోజు అయిన  మంగళవారం కంగారూల విజయానికి 174 పరుగులు అవసరం కాగా  ఇంగ్లాండ్ గెలవాలంటే   ఏడు వికెట్లు తీయాలి. విజేత ఎవరైనా ఈ మ్యాచ్‌లో ఆసక్తికర ముగింపు మాత్రం తథ్యం.. 

నిలబడ్డ ఖవాజా.. 

280 పరుగుల లక్ష్య ఛేదనను ఆస్ట్రేలియా  మెరుగ్గానే ఆరంభించింది. తొలి  ఇన్నింగ్స్‌లో విఫలమైన డేవిడ్ వార్నర్ (57 బంతుల్లో 36,  4 ఫోర్లు) రెండో ఇన్నింగ్స్ లో ఫర్వాలేదనిపించాడు.  ఉస్మాన్ ఖవాజా (81 బంతుల్లో 34,  6 ఫోర్లు)  తో కలిసి  తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించాడు. సెంచరీ భాగస్వామ్యం దిశగా సాగుతున్న ఈ జోడీని  రాబిన్సన్  విడదీశాడు. అతడు వేసిన  18వ ఓవర్లో నాలుగో బంతిని వార్నర్.. వికెట్ కీపర్ బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చాడు.  

వార్నర్ నిష్క్రమించిన తర్వాత  ఆసీస్‌కు   వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్  రెండు భారీ స్ట్రోకులిచ్చాడు. టెస్టులలో వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ మార్నస్ లబూషేన్ (15 బంతుల్లో 13,  3 ఫోర్లు) తో పాటు స్టీవ్ స్మిత్ (13 బంతుల్లో 6, 1 ఫోర్)   ను పెవిలియన్‌కు పంపాడు.  వార్నర్, స్మిత్, లబూషేన్ నిష్క్రమించినా  తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో ఉస్మాన్ ఖవాజా  మాత్రం క్రీజులో ఉన్నాడు. 

వీళ్లు నిలబడితే.. 

ఆఖరి రోజు ఆసీస్ విజయానికి 90 ఓవర్లలో 174 పరుగులు కావాలి.  చేతిలో ఇంకా ఏడు వికెట్లున్నాయి.  ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కేరీ లు మెయిన్ బ్యాటర్స్.   ఆసీస్ సారథి పాట్ కమిన్స్ కూడా  బ్యాటింగ్ చేయగలడు.  వీరితో పాటు నైట్ వాచ్‌మెన్ గా ఉన్న స్కాట్ బొలాండ్ (13 నాటౌట్) కాసేపు ఖవాజాకు  తోడుగా ఉంటే ఈ లక్ష్యాన్ని ఛేదించడం పెద్ద కష్టమేమీ కాదు.  అదీగాక పిచ్ కూడా బ్యాటింగ్ కు అనుకూలంగానే ఉండటంతో ఆసీస్ విజయంపై ధీమాగా ఉంది. 

 

మరోవైపు ఇంగ్లాండ్ విజయం ఆ బౌలింగ్ త్రయం జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్,  ఓలీ రాబిన్సన్ తో పాటు బెన్ స్టోక్స్ మీద ఆధారపడి ఉంది.  మోయిన్ అలీ కూడా ఆఖరి రోజు కీలకంగా మారుతాడు.  వీళ్లంతా ఆసీస్ ను నిలువరిస్తేనే  ఇంగ్లాండ్ ‘బజ్ బాల్’ పరువు నిలుస్తుంది. తొలి ఇన్నింగ్స్ లో ఫస్ట్ రోజే 78 ఓవర్లకే ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసిన  ధైర్యం, తెగువ..  ఆఖరి రోజు వికెట్లు తీయడంలో కూడా చూపితేనే  ఆ జట్టుకు మంచిది. లేదంటే  బజ్ బాల్ నవ్వులపాలు కావడం ఖాయం..!

ఇంగ్లాండ్ ఆలౌట్..

మూడో రోజు  27 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో  రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్‌కు  జో  రూట్ (55 బంతుల్లో 46, 5 ఫోర్లు, 1 సిక్సర్), ఓలీ పోప్ (16 బంతుల్లో 14, 2 ఫోర్లు)  మూడో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హ్యారీ బ్రూక్ (55 బంతుల్లో 46, 5 ఫోర్లు) తో కలిసి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను నడిపించిన   రూట్‌ను స్పిన్నర్ నాథన్ లియాన్ పెవిలియన్ చేర్చాడు. కొద్దిసేపటికే బ్రూక్ కూడా లియాన్ బౌలింగ్‌లోనే లబూషేన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ (66 బంతుల్లో 43, 5  ఫోర్లు)  నెమ్మదించగా బెయిర్‌స్టో (39 బంతుల్లో 20, 2 ఫోర్లు) ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. బెయిర్‌స్టోను లియాన్ వికెట్ల ముందు బలిగొనగా.. స్టోక్స్‌ను  కమిన్స్ ఎల్బీగా వెనక్కిపంపాడు.  మోయిన్ అలీ (31 బంతుల్లో 19, 2 ఫోర్లు, 1 సిక్స్)  రాబిన్సన్ (44 బంతుల్లో27, 2 ఫోర్లు) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. జేమ్స్ అండర్సన్ (12) ను కమిన్స్ ఔట్ చేయడంతో  ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 273 పరుగుల వద్ద ముగిసింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
Rakul Preet Singh: రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Embed widget