Jonny Bairstow Dismissal: వాడుకున్నోళ్లకు వాడుకున్నంత - బెయిర్ స్టో రనౌట్ పై ఒక్కో మీమ్ ఒక్కో డైమండ్ అంతే!
ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో రనౌట్ వివాదంతో క్రికెట్ లో ‘క్రీడా స్ఫూర్తి’ గురించి ఆసక్తికర చర్చ సాగుతున్నా అతడు ఔట్ అయిన తీరుపై నెట్టింట మీమ్స్ థౌజెండ్ వాలాల్లా పేలుతున్నాయి
Jonny Bairstow Dismissal: లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో రనౌట్ వివాదంతో ట్విటర్ లో చర్చ వాడీవేడిగా సాగుతోంది. నిత్యం ఇతర జట్లను స్లెడ్జ్ చేస్తూ.. తొండీల ఆటలు ఆడే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా తమ వరకు వచ్చేసరికి మాత్రం ‘క్రీడా స్ఫూర్తి’అని గగ్గోలు పెడుతున్నాయి. అయితే ఇదే క్రమంలో సామాజిక మాధ్యమాలలో బెయిర్ స్టో ఔట్ అయిన తీరుపై మీమ్స్ మాత్రం థౌజెండ్ వాలాలా పేలుతున్నాయి.
ఏదైనా ఒక రంగంలోని సెలబ్రిటీకి సంబంధించి ఏదైనా ఘటన జరిగితే ఇటీవల కాలంలో పోలీసు డిపార్ట్మెంట్ వాటిపై ఆసక్తికర ట్వీట్స్ తో జనాలను ఆకర్షిస్తున్నది. ఐపీఎల్ లో కొద్దిపాటి తేడాతో రనౌట్స్ అయినప్పుడు లక్నో, ముంబై పోలీసుల తమ అధికారిక ట్విటర్ ఖాతాలో ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసి జనాలలో అవగాహన పెంచిన విషయం తెలిసిందే. తాజాగా బెయిర్ స్టో వివాదాస్పద రనౌట్ ను ఆస్ట్రేలియా లోని విక్టోరియా పోలీసులు వినూత్న రీతిలో వాడుకున్నారు.
We'd like to thank Jonny Bairstow for reminding everyone about the dangers of stepping over the crease before you're given the green light.
— Victoria Police (@VictoriaPolice) July 3, 2023
Check out our road safety tips ➡ https://t.co/1fSI5XpMMe then tag a grumpy Englishman (we'll go first @metpoliceuk) pic.twitter.com/tvyh511pLN
బెయిర్ స్టో రనౌట్ అయిన ఫోటోను షేర్ చేస్తూ.. ‘మేం జానీ బెయిర్ స్టో కు థ్యాంక్స్ చెబుతున్నాం. గ్రీన్ లైన్ పడటానికంటే ముందే గీత దాటితే ఏమవుద్దోననే విషయాన్ని అతడు క్లీయర్ గా చెప్పాడు. రోడ్డు భద్రతను ఇలా పాటించండి..’ అంటూ వాటి లింక్ ను షేర్ చేసింది. ఈ ట్వీట్ నెట్టింట పోస్టు చేసిన కొద్దిసేపటికే నెట్టింట వైరల్ అయింది.
Bairstow with third umpire after the match
— Dennis🕸 (@DenissForReal) July 2, 2023
pic.twitter.com/1173FJA3b8
ఇదే టెస్టులో బెయిర్ స్టో.. మొదటిరోజు ‘జస్ట్ స్టాప్ ఆయిల్’ కార్యకర్తను ఎత్తిపడేసిన వీడియోను షేర్ చేస్తూ.. ఔట్ అయిన తర్వాత బెయిర్ స్టో థర్డ్ అంపైర్ దగ్గరకు వెళ్లి అక్కడ అంపైర్ ను అమాంతం ఎత్తిపడేసినట్టుగా కూడా ఓ వీడియో వైరల్ అయింది. ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూమ్ లో కూడా ఇదేవిధంగా ఆసీస్ ప్లేయర్లను ఇదే విధంగా తుక్కుతక్కుకింద బాదినట్టుగా వీడియో వైరల్ అవుతున్నది. ఈ వీడియోలు నెటిజన్లకు నవ్వులు పూయిస్తున్నాయి.
Carey to Bairstow #Ashes pic.twitter.com/mnK4vu9aHc
— Saahil Sharma (@faahil) July 2, 2023
At least Johnny Bairstow is a Walker pic.twitter.com/n7fHax3JXt
— David King's HP Laptop (Alpha Male) 👨💻👁⃤ (@WillyJFranco) July 2, 2023
Join Us on Telegram: https://t.me/abpdesamofficial