News
News
X

Aiden Markram: దక్షిణాఫ్రికా టీ20 కెప్టెన్‌గా మార్‌క్రమ్‌ - వయా సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌, హైదరాబాద్‌!

Aiden Markram: దక్షిణాఫ్రికా క్రికెట్‌ సంఘం జట్టులో సంస్కరణలు చేపట్టింది. టీ20 క్రికెట్‌ జట్టుకు అయిడెన్‌ మార్‌క్రమ్‌ (28) ను కెప్టెన్‌గా నియమించింది.

FOLLOW US: 
Share:

Aiden Markram as South Africa T20 Captain: 

దక్షిణాఫ్రికా క్రికెట్‌ సంఘం జట్టులో సంస్కరణలు చేపట్టింది. టీ20 క్రికెట్‌ జట్టుకు అయిడెన్‌ మార్‌క్రమ్‌ (28) ను కెప్టెన్‌గా నియమించింది. వెస్టిండీస్‌తో త్వరలో జరగబోయే సిరీస్‌ నుంచి అతడు బాధ్యతలు చేపడతాడు. ఈ మధ్యే అతడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) సారథిగా ఎంపికైన సంగతి తెలిసిందే.

ఫాఫ్‌ డుప్లెసిస్‌, క్వింటన్‌ డికాక్‌ తర్వాత తెంబా బవుమా దక్షిణాఫ్రికా క్రికెట్‌ టీమ్‌ను నడిపించాడు. అతడి సారథ్యంలో జట్టు అంచనాల మేరకు రాణించలేదు. ఈ నేపథ్యంలో వివిధ విభాగాల క్రికెట్లో నాయకుడిగా రాణించిన అయిడెన్‌ మార్‌క్రమ్‌ (Aiden Markram)ను ఎంచుకుంది. 2014లో సఫారీలకు అతడు ఐసీసీ అండర్‌ 19 ప్రపంచకప్‌ను అందించాడు. ఈ మధ్యే ఎస్‌ఏ20లో సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌ కేప్‌ కెప్టెన్‌గా ట్రోఫీని ముద్దాడాడు.

గాయం కారణంగా 2018లో డుప్లెసిస్‌ అందుబాటులో లేనప్పుడు టీమ్‌ఇండియాతో ఐదు వన్డేలకు మార్‌క్రమ్‌ కెప్టెన్సీ చేశాడు. 2023 నుంచి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను నడిపించనున్నాడు.

'దక్షిణాఫ్రికా టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన అయిడెన్‌ మార్‌క్రమ్‌కు అభినందనలు. నాయకత్వం వహించడంలో అతడికి ఎంతో అనుభవం ఉంది. చాలా స్థాయిల్లో జట్లను విజయవంతంగా నడిపించాడు. మిగతా ఆటగాళ్లలో ప్రేరణ కలిగించగలడు. అతడిలో నాయకత్వ లక్షణాలన్నీ ఉన్నాయి. అతడు దక్షిణాఫ్రికా క్రికెట్‌ను తర్వాతి స్థాయికి తీసుకెళ్తాడన్న విషయంలో మాకెలాంటి సందేహాల్లేవు. అదే సమయంలో మేము తెంబా బవుమాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రెండేళ్లుగా అతడు ఎంతో శ్రమించాడు. అతడిప్పుడు సరికొత్త పాత్ర పోషించాల్సి ఉంది' అని దక్షిణాఫ్రికా క్రికెట్‌ డైరెక్టర్‌ ఇనాక్‌ ఎన్‌కేవీ అన్నారు.

కోచింగ్‌ విభాగంలోనూ కొన్ని మార్పులు చేశారు. మాజీ క్రికెటర్‌ జేపీ డుమినిని పూర్తి స్థాయి పరిమిత ఓవర్ల క్రికెట్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా నియమించారు. అతడికి 280 మ్యాచుల్లో ఆడిన అనుభవం ఉంది. ఈ మధ్యే ఎస్‌ఏ20 లీగులో పార్ల్‌ రాయల్స్‌, పార్ల్‌ రాక్స్‌ ప్రావిన్షియల్‌ జట్లకు కోచ్‌గా పనిచేశాడు. మాజీ ఆల్‌రౌండర్ రోరీ క్లెయిన్‌వెల్డ్ బౌలింగ్‌ కోచ్‌గా ఎంపిక చేసింది.

Aiden Markram SRH Captain:  ఐపీఎల్ 2023 సీజన్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తన కెప్టెన్ ను ప్రకటించింది. ఈ సీజన్ లో దక్షిణాఫ్రికా ఆటగాడు అయిడెన్ మార్ క్రమ్ ఎస్ ఆర్ హెచ్ జట్టును నడిపించనున్నాడు. మార్ క్రమ్ ను కెప్టెన్ గా నియమిస్తూ సన్ రైజర్స్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. 

గతేడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ఈ ప్రొటీస్ ఆటగాడిని సన్ రైజర్స్ రూ. 2.60 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఆ సీజన్ లో మార్ క్రమ్ ఓ మోస్తరుగా రాణించాడు. 47.63 సగటులో 381 పరుగులు చేశాడు. గత నెలలో దక్షిణాఫ్రికా లీగ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ జట్టును నడిపించిన మార్ క్రమ్ జట్టుకు టైటిల్ ను అందించాడు. అలాగే 2014లో దక్షిణాఫ్రికా అండర్- 19 జట్టుకు కెప్టెన్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది.  ఐపీఎల్ మినీ వేలంలో భారత ఆటగాడు మయాంక్ అగర్వాల్ ను కూడా ఎస్ ఆర్ హెచ్ కొనుగోలు చేసింది. అలాగే సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా జట్టులో ఉన్నాడు. వీరిని కాదని అయిడెన్ మార్ క్రమ్ ను కెప్టెన్ గా నియమించడం విశేషం. 

దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ షెడ్యూల్

March 16: 1st ODI at Buffalo Park, East London

March 18: 2nd ODI at Buffalo Park, East London

March 21: 3rd ODI at JB Marks Oval, Potchefstroom

March 25: 1st T20I at SuperSport Park, Centurion

March 26: 2nd T20I at SuperSport Park, Centurion

March 28: 3rd T20I at the Wanderers, Johannesburg

Published at : 07 Mar 2023 05:25 PM (IST) Tags: SRH SunRisers Hyderabad Aiden Markram South Africa

సంబంధిత కథనాలు

IND vs AUS 3rd ODI: మూడో వన్డేలో టాస్‌ ఓడిన టీమ్‌ఇండియా - తొలి బ్యాటింగ్‌ ఎవరిదంటే?

IND vs AUS 3rd ODI: మూడో వన్డేలో టాస్‌ ఓడిన టీమ్‌ఇండియా - తొలి బ్యాటింగ్‌ ఎవరిదంటే?

UPW-W vs DC-W, Match Highlights: క్యాప్సీ కేక! యూపీపై గెలుపుతో WPL ఫైనల్‌కు దిల్లీ క్యాపిటల్స్‌!

UPW-W vs DC-W, Match Highlights: క్యాప్సీ కేక! యూపీపై గెలుపుతో WPL ఫైనల్‌కు దిల్లీ క్యాపిటల్స్‌!

UPW-W vs DC-W, 1 Innings Highlight: దిల్లీ ఫైనల్‌ టార్గెట్‌ 139 - యూపీని దెబ్బకొట్టిన క్యాప్సీ, రాధా!

UPW-W vs DC-W, 1 Innings Highlight: దిల్లీ ఫైనల్‌ టార్గెట్‌ 139 - యూపీని దెబ్బకొట్టిన క్యాప్సీ, రాధా!

UPW vs DCW: ఆఖరి లీగు మ్యాచులో టాస్‌ డీసీదే - యూపీపై గెలిస్తే ఫైనల్‌కే!

UPW vs DCW: ఆఖరి లీగు మ్యాచులో టాస్‌ డీసీదే - యూపీపై గెలిస్తే ఫైనల్‌కే!

RCB-W vs MI-W, Match Highlight: ముంబయి కేర్‌టేకర్‌ 'కెర్‌' - ఆర్సీబీపై 4 వికెట్ల తేడాతో మళ్లీ టేబుల్‌ టాపర్‌!

RCB-W vs MI-W, Match Highlight: ముంబయి కేర్‌టేకర్‌ 'కెర్‌' - ఆర్సీబీపై 4 వికెట్ల తేడాతో మళ్లీ టేబుల్‌ టాపర్‌!

టాప్ స్టోరీస్

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్

Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్

Amaravati News : ఆర్ - 5 జోన్ ఏర్పాటుపై అమరావతి రైతుల ఆగ్రహం - అసలు వివాదం ఏంటి ? కోర్టు ఏం చెప్పింది?

Amaravati News : ఆర్ - 5 జోన్ ఏర్పాటుపై అమరావతి రైతుల ఆగ్రహం - అసలు వివాదం ఏంటి ? కోర్టు ఏం చెప్పింది?

నరేష్ నిత్య పెళ్లి కొడుకు - రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలకు అంతా గొల్లున నవ్వేశారు!

నరేష్ నిత్య పెళ్లి కొడుకు - రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలకు అంతా గొల్లున నవ్వేశారు!