అన్వేషించండి
Advertisement
David Warner: వన్డేలకూ వార్నర్ భాయ్ గుడ్ బై,ముగిసిన డేవిడ్ భాయ్ శకం
David Warner : ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఇప్పటికే టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డేవిడ్ ఇప్పుడు వన్డేలకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించేశాడు.
ఆస్ట్రేలియా(Australia) స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner) కొత్త సంవత్సరం తొలి రోజున..తన అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఇప్పటికే టెస్ట్ క్రికెట్(Test Cricket)కు వీడ్కోలు పలికిన డేవిడ్ భాయ్ ఇప్పుడు వన్డే(ODI cricket)లకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించేశాడు. భారత్(Bharat)పై వన్డే ప్రపంచకప్(ODI World Cup2023 ) గెలిచిన ఈ మధుర క్షణాలే తన వన్డే కెరీర్‌కు ముగింపు పలకడానికి సరైన సమయంగా భావిస్తున్నట్లు వార్నర్ తెలిపాడు. తన నిర్ణయం వల్ల కొత్త వారికి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. 2025లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)లో ఆస్ట్రేలియాకు ఓపెనర్ అవసరమైతే మాత్రం తాను పునరాగమనం చేస్తానని వార్నర్ చెప్పడం ఆసక్తి కలిగిస్తోంది. బిగ్‌బాష్ లీగ్‌లో మాత్రం తాను కొనసాగుతానని డేవిడ్ భాయ్ స్పష్టం చేశాడు. టెస్టు, వన్డే క్రికెట్ నుంచి తప్పుకోవడం వల్ల ఫ్రాంఛైజీ లీగ్‌లలో ఆడేందుకు ఎక్కువ సమయం లభిస్తుందని పేర్కొన్నాడు. తన క్రికెట్ కెరీర్‌ను తీర్చిదిద్దడంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ కీలక పాత్ర పోషించినట్లు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.
భారత్ వేదికగా జరిగిన 2023 వన్డే ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకోవడంలో వార్నర్ కీలక పాత్ర పోషించాడు. రెండు శతకాలు, రెండు అర్ధశతకాలతో సహా మొత్తం 528 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా డేవిడ్ భాయ్ నిలిచాడు. మొత్తం తన వన్డే కెరీర్‌లో 161 మ్యాచ్‌లు ఆడిన వార్నర్... 45.3 సగటుతో... 97.26 స్ట్రైక్ రేట్‌తో 6 వేల 932 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 179. తన వన్డే కెరీర్‌లో వార్నర్ 733 ఫోర్లు, 130 సిక్సులు కొట్టాడు. తన వన్డే కెరీర్‌లో 22 శతకాలు చేసిన వార్నర్... 33 హాఫ్ సెంచరీలు చేశాడు.
చివరి టెస్ట్‌కు సిద్ధమైన వార్నర్
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. స్వదేశంలో పాకిస్థాన్‌తో చివరి టెస్ట్ సిరీస్ ఆడుతున్న.. జనవరి మూడు నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌తో సుదీర్ఘ ఫార్మట్‌కు వీడ్కోలు పలకనున్నాడు. తన సొంత మైదానంలో మంచి ప్రదర్శన చేసి టెస్టు కెరీర్‌కు ముగింపు పలకాలని వార్నర్ భావిస్తున్నాడు. చివరి టెస్ట్ ఆడనున్న వేళ వార్నర్ (David Warner)పై ఆసీస్ ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ప్రశంసల వర్షం కురిపించాడు. మూడు ఫార్మాట్లలో ఆసీస్‌కు ప్రాతినిథ్యం వహించిన అత్యుత్తమ ఆటగాళ్లలో వార్నర్ ఒకడని మెక్‌డొనాల్డ్ కొనియాడాడు. వార్నర్ అద్బుతమైన ఆటగాడన్న మెక్‌డొనాల్డ్... జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడని కొనియాడాడు. అటువంటి ఆటగాడు ఇప్పుడు టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోబోతుండడం ఆస్ట్రేలియా క్రికెట్‌కు కోలుకోలేని దెబ్బని వార్నర్ అన్నాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు వార్నర్ ఎంపిక చేసినప్పుడు ఎన్నో విమర్శలు వచ్చాయన్న ఆసిస్ కోచ్....వాటన్నింటికీ డేవిడ్ భాయ్ తొలి టెస్ట్‌తోనే సమాధానం చెప్పాడని అన్నాడు. ఏదైమైనా వార్నర్ స్థానాన్ని భర్తీ చేయడం తమకు చాలా కష్టమని అంగీకరించాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్‌గా వార్నర్ కొనసాగుతున్నాడని గుర్తు చేశాడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
విశాఖపట్నం
హైదరాబాద్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion