ఇది నిజంగా శుభ్ ఆరంభమేనా- టీమిండియాలో గిల్ ఎరా స్టార్ట్ అయినట్టేనా!
ఇది శుభ్ మన్ గిల్ మ్యాచ్ బై మ్యాచ్ ఇన్నింగ్స్ జాబితా. స్కోర్లు గమనిస్తే 30లు, 40లు, అర్ధ సెంచరీలు ఇవే ఎక్కువ. ప్రతి మ్యాచ్ లోనూ సెంచరీ కొట్టలేడు.
2012 నాటి సంగతి ఒకటి చెప్పుకుందాం. బంగ్లాదేశ్ తో వన్డేలో సెంచరీ సాధించడం ద్వారా వంద శతకాలు సాధించిన తొలి క్రికెటర్ గా సచిన్ రికార్డు సృష్టించాడు. సచిన్ ఘనతకు సత్కారంగా... ముకేశ్ అంబానీ ఓ స్పెషల్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. అప్పటికే సచిన్ రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్నాడు. తన తర్వాత టీమిండియా బాధ్యతలు మోసేది ఎవరా ఎవరా అని 100 కోట్ల మంది ఎదురుచూస్తున్నారు. ఈ ఫంక్షన్ లో సచిన్ ఓ మాట అన్నాడు. తన రికార్డులు బ్రేక్ చేసే టాలెంట్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకే ఉందన్నాడు. ఒక ఇండియన్ తన రికార్డులు బ్రేక్ చేస్తే తనకు చాలా ఆనందమన్నాడు. అక్కడ్నుంచి 9 ఏళ్లు తిరిగేసరికి.... ఆ మాటలే నిజమయ్యాయి.
రోహిత్ ఒకట్రెండు సచిన్ రికార్డులను కొట్టాడు. కానీ కోహ్లీ....? వన్డేల్లో సచిన్ రికార్డులు కొల్లగొట్టడమే పనిగా పెట్టుకున్నాడా అన్నంతగా ఓ సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు, లిఖిస్తూనే ఉన్నాడు, ఇంకా లిఖిస్తాడు కూడా. కానీ మళ్లీ ఇండియన్ క్రికెట్ లో అలాంటి స్టేజ్ కు వచ్చేశాం. కోహ్లీ తర్వాత ఎవరూ అని చాలా మంది చర్చించుకున్నారు. సునీల్ గావస్కర్ నుంచి మొదలైన లెగసీ సచిన్, కోహ్లీ తర్వాత ముందుకు నడిపించేది ఎవరూ అని అనుమానం చాలా మందికి వచ్చింది. ఇప్పుడు వాళ్లంతా చెబుతున్నా మాట ఒకటే... వారసుడు వచ్చేశాడు. అవును ఈ పంజాబ్ కుర్రాడు శుభ్ మన్ గిల్ ఆ వారసుడు. నిన్న డబుల్ సెంచరీ చూసే ఎవరూ ఈ మాట చెప్పట్లేదు. గిల్ కు ఉన్న స్పెషల్ క్వాలిటీ, కేపబుల్ చూసి అంతా అంటున్నా మాట. సుదీర్ఘ కెరీర్ ఉండాలంటే మాత్రం ఆయనలో ఇంకా మెరుగుపర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి.
అప్పట్లో సచిన్ వారసులుగా రోహిత్, కోహ్లీని ఎలా అనుకున్నారో.... ఓ నాలుగేళ్ల క్రితం..... తర్వాతి తరం స్టార్లంటూ పృథ్వీ షా, శుభ్ మన్ గిల్ ను కూడా అలానే అనుకున్నారు. కానీ ఫిట్ నెస్, సెలక్షన్ ఇష్యూస్ వీటన్నింటినీ వల్ల ఇప్పుడు పృథ్వీ షా రేసులో లేడు. కానీ గిల్ మాత్రం అలా కాదు. డెబ్యూ చేసిన దగ్గర నుంచి 3 ఫార్మాట్లలో వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకున్నాడు. సుమారు ఏడాదిన్నరగా టీమిండియా జట్టులో రెగ్యులర్ సభ్యుడు అయిపోయాడు. అంతటి ఇంపాక్ట్ చూపించాడు.
ఇంత చిన్న వయసులోనే. నిన్న ఉప్పల్ లో డబుల్ సెంచరీ ద్వారా తన ఆట వేరే లెవల్ కు చేరిందని చెప్పకనే చెప్పాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ కొట్టడమే అరుదు అంటే... దాన్ని అత్యంత చిన్న వయసులోనే సాధించి రికార్డు నెలకొల్పాడు. అంతే కాదు... వన్డేల్లో వేగంగా వెయ్యి పరుగులు సాధించిన ఇండియన్ గా, ఓవరాల్ గా సంయుక్త రెండో ఫాస్టెస్ట్ ప్లేయర్ గా నిలిచాడు. ఇప్పటిదాకా ఆడింది 19 మ్యాచెస్, 19 ఇన్నింగ్సే. కానీ అతని నంబర్స్ చూడండి. 1102 పరుగులు. 68.88 సగటు. 109 స్ట్రైక్ రేట్. ఈ రేంజ్ కన్సిస్టెన్సీ ఎంతకాలం అనేది చెప్పలేం. కానీ ప్రజెంట్ అయితే ఓ పర్పుల్ ప్యాచ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. అది అలా కొనసాగుతూ ఉండాలనే కోరుకుందాం.
రికార్డులు కొల్లగొట్టడం... టీనేజీ నుంచే గిల్ కు అలవాటు. అండర్-16 అంతర జిల్లాల టోర్నీలో ఓసారి ఓపెనర్ గా 351 కొట్టాడు. పంజాబ్ అండర్-16 డెబ్యూలోనే డబుల్ సెంచరీ బాదేశాడు. బీసీసీఐ ఇచ్చే బెస్ట్ జూనియర్ క్రికెటర్ అవార్డును వరుసగా రెండేళ్లు అందుకున్నాడు.ఇక 2018 అండర్-19 వరల్డ్ కప్ అయితే ఎప్పటికీ గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్. ఆ టోర్నీలో నంబర్ 3లో బ్యాటింగ్ కు దిగి, 104.50 యావరేజ్ తో 418 రన్స్ కొట్టాడు.ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్. జట్టు వైస్ కెప్టెన్ కూడా. అలా సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఐపీఎల్, డొమెస్టిక్ క్రికెట్ లో కూడా సత్తా చాటుతుండటం వల్ల 19 ఏళ్లకే డెబ్యూ చేసేశాడు.
సరే... బాగా పెర్ఫార్మ్ చేసినప్పుడు భజన చేయడం, చేయనప్పుడు కిందకు పడేయడం మన ఇండియన్స్ కు అలవాటే కదా అని అనుకుంటున్నారా..? ఏంటీ అసలు గిల్ కు మైనస్సులే లేవా..? అసలు ఇబ్బందిపడడా..? తన బ్యాటింగ్ టెక్నిక్ విషయానికి వస్తే ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ మైనస్ ను ఏ జట్టు బౌలరూ బయటకు తీయలేకపోయాడు. ఫుట్ వర్క్, బాటమ్ హ్యాండ్ షాట్స్, బ్యాక్ ఫుట్ పంచెస్ & పుల్స్, ఫ్రంట్ ఫుట్ కవర్ డ్రైవ్స్... ఇలా అన్ని షాట్లు ఆడగలడు. కంటికి ఇంపు కలిగించేలా కూడా ఆడగలడు. కానీ ఓ మైనస్ ఉంది. చెప్పానుగా... అది టెక్నిక్ పరంగా కాదు. మరేంటా అనుకుంటున్నారా... కన్వర్షన్ రేట్.
నిన్న డబుల్ సెంచరీ సాధించాక గిల్ ఎక్స్ ప్రెషన్ చూశారుగా.... సింహనాదం అనే చెప్పుకోవాలి. ఈ ఇన్నింగ్స్ కు ముందు తన మీద ఉన్న ప్రెషర్ అలాంటిది మరి. అదేంటీ బానే ఆడుతున్నాడు. శ్రీలంక మీద సెంచరీ కూడా కొట్టాడు. ప్రెషర్ ఏంటీ అనుకుంటున్నారా..? సాధారణంగా ఏ జట్టైనా సరే ఓపెనర్ నుంచి ఏం ఆశిస్తుంది..? మంచి ఆరంభాన్ని ఇవ్వాలి. కుదురుకున్నాక వీలైనన్ని ఎక్కువ ఓవర్లు క్రీజులో నిలదొక్కుకోవాలి అని. నిన్నటి మ్యాచ్ ముందు వరకు చూసుకుంటే... గిల్ కు దాదాపుగా ప్రతి మ్యాచ్ లోనూ మంచి స్టార్ట్ దక్కేది. ఈ లిస్ట్ చూడండి.
ఇది శుభ్ మన్ గిల్ మ్యాచ్ బై మ్యాచ్ ఇన్నింగ్స్ జాబితా. స్కోర్లు గమనిస్తే 30లు, 40లు, అర్ధ సెంచరీలు ఇవే ఎక్కువ. ప్రతి మ్యాచ్ లోనూ సెంచరీ కొట్టలేడు. అది మనకూ తెలుసు. కానీ మంచి టచ్ లో ఉండి, కండిషన్స్ అన్నీ ఫేవరబుల్ గా ఉన్నా సరే గిల్....తన ఆరంభాలను భారీ స్కోర్లుగా మల్చలేకపోతున్నాడనేది ప్రధాన విమర్శ. నిన్నటి మ్యాచ్ కు ముందు ఆడిన 18 ఇన్నింగ్స్ లో కనీసం 8 సార్లు తన ఆరంభాన్ని భారీ ఇన్నింగ్స్ గా మార్చే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అందులో మొదట బ్యాటింగ్ చేసినవి ఉన్నాయి, ఛేజింగ్ చేసినవి కూడా ఉన్నాయి. ఒక్కోసారి ఛేజింగ్ లో చిన్న లక్ష్యాలు ఉన్నప్పుడు... సెంచరీ కొట్టలేడు కానీ చివరి దాకా నాటౌట్ గా ఉండి మ్యాచ్ గెలిపించగల సిచ్యుయేషన్స్ ఏర్పడ్డాయి. కానీ అదే 40లు, హాఫ్ సెంచరీలు కొట్టేసి మ్యాచ్ ముగిసిపోతుందనగా ఔట్ అయిపోయేవాడు.
అఫ్ కోర్స్ ఈ చిన్న వీక్ నెస్ గురించి మనం మరీ అంత హార్ష్ గా ఉండలేం. ఎందుకంటే ఇంకా కుర్రాడు. పట్టుమని పాతిక ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. మెల్లగా అన్ని మెళకువలూ నేర్చుకుంటాడేమో. చూశాంగా. ఆ కన్వర్షన్ రేట్ ప్రెషర్ అధిగమించినట్టే ఉన్నాడు. అందుకే నిన్న ఈ భారీ డబుల్ సెంచరీ తర్వాత ఈ రేంజ్ లో అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. దీని వెనుక ఇంకో కారణం కూడా ఉండి ఉండొచ్చు. శ్రీలంకతో సిరీస్ స్టార్టింగ్ ముందు ఇషాన్ బంగ్లాదేశ్ పై డబుల్ కొట్టాడు. కానీ అతణ్ని కాదని గిల్ ఫాంపైనే రోహిత్, టీమ్ మేనేజ్మెంట్ నమ్మకముంచారు. శ్రీలంకతో ఆఖరి వన్డేలో సెంచరీ, ఇప్పుడు డబుల్ సెంచరీతో ఆ నమ్మకాన్ని వీలైనంత ఎత్తులో నిలబెట్టాడు గిల్. పది నెలల్లో వస్తున్న వరల్డ్ కప్ ముందు ఇదంతా టీమిండియాకు శుభసూచకమే. రోహిత్, గిల్ ఓపెనింగ్ పార్టనర్ షిప్ ఇప్పటిదాకా అయితే మంచి ఫలితాలను ఇస్తోంది.
వన్డేల్లో చెప్పుకున్న ఈ చిన్న బలహీనతే టెస్టుల్లోనూ గిల్ కు ఉంది. మంచి స్టార్ట్స్ ను భారీ స్కోర్లుగా మల్చలేకపోవడం. దానికి నిదర్శనమే ఈ లిస్ట్. ఎన్ని 30లు, 40లు ఉన్నాయో చూడండి. సో టెస్టుల్లో కూడా దాన్ని మెరుగుపర్చుకునే దిశగా గిల్ దృష్టి కచ్చితంగా ఉంటుంది.
సో ఫార్ ఈ నాలుగేళ్ల ఇంటర్నేషనల్ కెరీర్ చూస్తే గిల్ కు టాలెంట్ ఏమీ తక్కువ లేదు. కచ్చితంగా సచిన్, కోహ్లీ లెగసీ కంటిన్యూ చేసే సత్తా ఉంది. వయసుతోపాటు మెచ్యూరిటీ పెంచుకుంటూ ఇదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే....రోహిత్, కోహ్లీ తరం నుంచి గిల్ తరంలోకి ట్రాన్సిషన్ స్మూత్ గా సాగిపోతోంది.