అన్వేషించండి
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
T20 World Cup 2024 : సూపర్ పోరుకు టీమిండియా సిద్ధం, అఫ్గాన్‌తో పోరు అంత తేలికేం కాదు
Afghanistan Vs India: టీ20 ప్రపంచకప్ 2024లో టీం ఇండియా కీలక సమరానికి సిద్ధమైంది. గురువారం సూపర్-8 మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ను ఢీకొట్టనుంది.
IND vs AFG Preview And Prediction: టీ 20 ప్రపంచకప్(T20 World Cup 2024 )లో టీమిండియ(IND) సూపర్ ఎయిట్ సమరానికి సిద్ధమైంది. పసికూన ముద్ర చెరిపేసుకుని... అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతాలు సృష్టిస్తున్న అఫ్గానిస్థాన్(AFG)తో రోహిత్ సేన తలపడనుంది. ఈ సూపర్ ఎయిట్ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ దిశగా తొలి అడుగు బలంగా వేయాలని టీమిండియా చూస్తుండగా... భారత్‌కు షాక్ ఇవ్వాలని అఫ్గాన్ కూడా ప్రణాళికలు రచిస్తోంది. విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ నుంచి బయటపడి మళ్లీ బ్యాట్ ఝుళిపించాలని టీమిండియా కోరుకుంటోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే నాకౌట్ సమరం దిశగా తొలి అడుగు పడనుంది. అయితే వెస్టిండీస్‌లోని పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తున్న వేళ ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లు ఉన్న అఫ్గాన్ జట్టున భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరంగా మారింది.
బ్యాటర్లు జోరందుకంటేనే..?
బార్బడోస్(Barbados)లోని బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్‌టన్ ఓవల్‌లో జరగనున్న ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ ఆర్డర్‌పైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. రోహిత్‌తో కలిసి టీమిండియా ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తున్న విరాట్ కోహ్లీ అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నాడు. ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచుల్లోనూ కోహ్లీ బ్యాటు నుంచి పట్టుమని పది పరుగులు కూడా రాలేదు. ఈ ప్రపంచకప్‌లో వెస్టిండీస్ పిచ్‌లపై తొలి మ్యాచ్ ఆడుతున్న విరాట్... ఫామ్‌ను అందుకుంటే టీమిండియాకు తిరుగుండదు. రోహిత్ కూడా పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతుండడం భారత జట్టు మేనేజ్‌మెంట్‌ను ఆందోళన పరుస్తోంది. కానీ వన్‌డౌన్‌లో రిషభ్ పంత్, తర్వాత వచ్చే సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే రాణిస్తుండడంతో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ బలంగానే కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లోనూ టీమిండియా నలుగురు ఆల్‌రౌండర్లతోనే బరిలోకి దిగుతుందా అన్నది చూడాలి. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలకు తుది జట్టులో స్థానం దక్కుతుందో దక్కదో చూడాలి. అయితే వెస్టిండీస్ పిచ్‌లు ఇప్పటివరకూ పూర్తిగా స్పిన్నర్లకే ఉపయుక్తంగా ఉంటున్నాయి. ఇప్పుడు అఫ్గాన్ జట్టులో ప్రపంచస్థాయి స్పిన్నర్లు ఉన్నారు. స్టార్ స్పిన్నర్ రషీద్‌ఖాన్, నబీ, ముజీబ్ ఈ ప్రపంచకప్‌లో మంచి ఫామ్‌లో ఉన్నారు. ఈ బౌలర్లను భారత బ్యాటర్లు సమర్థంగా ఎదుర్కొంటే సూపర్ ఎయిట్‌లో భారత్‌కు తొలి విజయం లభించినట్లే. అయితే భారత బౌలర్లు మాత్రం బాగానే రాణిస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రపంచకప్‌లో బుమ్రా తన మార్క్ బౌలింగ్‌తో బ్యాటర్లను కట్టిపడేస్తున్నాడు. మరోసారి బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్ దళం పంజా విసిరితే అఫ్గాన్ బ్యాటర్లకు తిప్పలు తప్పకపోవచ్చు.
కుల్దీప్‌కు చోటు..?
అఫ్గాన్‌తో మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్‌మీట్‌లో టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) కీలక వ్యాఖ్యలు చేశారు. అఫ్గాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లకు చోటు దక్కే అవకాశం ఉందని పరోక్ష సంకేతాలు ఇచ్చాడు. భారత్ ఇప్పటివరకూ అన్ని మ్యాచులు అమెరికాలోనే ఆడిందని అక్కడ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ద్రవిడ్ చెప్పాడు. ద్రవిడ్ పరోక్ష సూచనలతో మహ్మద్ సిరాజ్ స్థానంలో కుల్‌దీప్‌కు జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్‌కు లోతైన బ్యాటింగ్ ఆర్డర్ కూడా అవసరమైన నేపథ్యంలో టీమిండియా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
సినిమా
రాజమండ్రి
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement