అన్వేషించండి
Advertisement
World Cup 2023: అదిల్ రషీద్ అరుదైన రికార్డు, మూడో స్పిన్నర్‌గా ఘనత
ODI World Cup 2023: ఇంగ్లండ్ స్పిన్నర్ అదిల్ రషీద్ అరుదైన రికార్డు సృష్టించాడు. 350 వికెట్లు పడగొట్టిన తొమ్మిదో ఇంగ్లండ్ బౌలర్‌గా, మూడో స్పిన్నర్‌గా రషీద్ అరుదైన రికార్డును లిఖించుకున్నాడు.
ఇంగ్లండ్ స్పిన్నర్ అదిల్ రషీద్ అరుదైన రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 350 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. 350 వికెట్లు పడగొట్టిన తొమ్మిదో ఇంగ్లండ్ బౌలర్‌గా.. మూడో స్పిన్నర్‌గా రషీద్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. లక్నోలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. రషీద్ పది ఓవర్లలో 3.50 ఎకానమీ రేటుతో 35 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వంటి కీలక వికెట్లు తీశాడు. 250 అంతర్జాతీయ మ్యాచ్‌లలో, రషీద్ 31.96 సగటుతో 350 వికెట్లు పడగొట్టాడు. రషీద్ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 5/27. 19 టెస్టుల్లో, రషీద్ 39.83 సగటుతో 60 వికెట్లు పడగొట్టాడు, అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 5/49. టెస్టుల్లో రెండుసార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. 132 వన్డేల్లో 32.44 సగటుతో రషీద్ 192 వికెట్లు పడగొట్టాడు, అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 5/27. వన్డేల్లోనూ రెండుసార్ల రషీద్ ఐదు వికెట్లు పడగొట్టాడు. రషీద్ ఇంగ్లండ్ తరపున 99 టీ20లు ఆడాడు, 26.26 సగటుతో 98 వికెట్లు పడగొట్టాడు, అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 4/2. ఇంగ్లండ్ సీమర్ అండర్స్‌న్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. అండర్సన్ 396 మ్యాచుల్లో 27.27 సగటుతో మొత్తం 977 వికెట్లు నేలకూల్చాడు. 34 సార్లు అయిదు వికెట్లు తీసిన అండర్సన్... ఒకే టెస్టులో 10 వికెట్లు మూడు సార్లు పడగొట్టాడు. తర్వాతి స్థానాల్లో బ్రాడ్ 847 వికెట్లతో... ఇయాన్ బోదమ్ 528 వికెట్లతో గాఫ్ 466 వికెట్లతో ఉన్నారు. రషీద్ కంటే ముందు మొయిన్ అలీ ఉన్నాడు. మొయిన్ అలీ 281 మ్యాచుల్లో 353 వికెట్లు తీశాడు.
ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. రోహిత్ శర్మ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ (101 బంతుల్లో 87; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడి జట్టు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. రోహిత్‌తో పాటు కేఎల్ రాహుల్ (58 బంతుల్లో 39; 3 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్ (47 బంతుల్లో 49; 4 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ స్వల్ప లక్ష్య ఛేదనలో తడబడింది. కేవలం 34.5 ఓవర్లలో 129 పరుగులకే బ్రిటీష్ జట్టు కుప్పకూలింది. దీంతో 100 పరుగుల భారీ తేడాతో రోహిత్ సేన ఘన విజయం సాధించింది.
ఈ గెలుపుతో మరోసారి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్న భారత్.. ప్రపంచకప్ సెమీఫైనల్‌కు కూడా దూసుకెళ్లింది. వరుసగా వికెట్లు పడుతున్నా రోహిత్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కెప్టెన్‌గా తన వందో మ్యాచ్‌లో జట్టును ముందుండి నడిపించాడు. ఆచితూడి ఆడుతూనే సమయం వచ్చినప్పుడల్లా భారీ షాట్లు ఆడేందుకు భయపడలేదు. సెంచరీ దిశగా సాగుతున్న రోహిత్‌ను అదిల్ రషీద్ అవుట్ చేశాడు. 101 బంతుల్లో 10 ఫోర్లు, మూడు భారీ సిక్సర్లతో రోహిత్ శర్మ 87 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. . భారీ షాట్ ఆడే క్రమంలో ఔటై సెంచరీని చేజార్చుకున్నాడు. అనవసర షాట్లకు యత్నించి తనతోపాటు మిగతావారిలో ఎక్కువ మంది వికెట్లను సమర్పించారని రోహిత్ మ్యాచ్ అనంతరం అన్నాడు. క్లిష్టపరిస్థితుల్లో అనుభవ ప్లేయర్లు అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించారని తెలిపాడు. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై ఇంగ్లాండ్ అద్భుత బౌలింగ్‌ను ఎదుర్కొని మరీ స్కోరు బోర్డుపై ఆ పరుగులను ఉంచగలిగామన్నాడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
మొబైల్స్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement