అన్వేషించండి

Paris Olympics: అమిత్‌ పంగాల్‌కు ఒలింపిక్‌ బెర్తు, క్వాలిఫికేషన్ టోర్నమెంట్‌లో సత్తా చాటిన బాక్సర్

Boxing World Qualifiers: వరల్డ్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్‌లో సత్తా చాటిన అమిత్‌ పంగాల్‌... పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తును సొంతం చేసుకున్నాడు. ఈ బాక్సర్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ రజత పతక విజేత అని తెలిసిందే.

Boxer Amit Panghal Clinches Paris Olympics Spot: పారిస్‌ ఒలింపిక్స్‌(Paris Olympics)కు భారత్‌కు చెందిన మరో బాక్సర్‌ అర్హత సాధించాడు. వరల్డ్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్‌లో సత్తా చాటిన అమిత్‌ పంగాల్‌(Amit Panghal)... పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తును సొంతం చేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ రజత పతక విజేత కూడా అయిన అమిత్‌ పంగాల్‌... వరల్డ్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్‌ (Boxing World Qualifiers) లో క్వార్టర్‌ ఫైనల్‌లో విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్‌ ఫైనల్‌లో చైనాకా చెందిన చువాంగ్ లియుపై 5-0 తేడాతో పంగాల్ విజయం సాధించాడు. తొలుత  1-4తో వెనుకబడిన పంగాల్‌ రెండో రౌండ్‌లో సానుకూలంగా ఆడి విజయాన్ని సాధించాడు. 

ఈ విజయంతో పంగాల్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఇప్పటికే నిశాంత్ దేవ్ (71 కేజీలు), నిఖత్ జరీన్ (50 కేజీలు), ప్రీతి పవార్ (54 కేజీలు), లోవ్లినా బోర్గోహైన్ (75 కేజీలు) ఒలింపిక్స్‌ బెర్తులు ఖాయం చేసుకోగా... తాజాగా అమిత్‌ కూడా ఈ జాబితాలో చేరాడు. 2022లో కామన్వెల్త్ గేమ్స్‌లో పంగాల్‌ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ప్రతిష్టాత్మక స్ట్రాండ్జా మెమోరియల్ టోర్నమెంట్‌లోనూ అమిత్‌ పంగాల్‌ విజేతగా నిలిచాడు. ఇప్పటికే భారత స్టార్‌ రెజ్లర్‌, రెండుసార్లు ఒలింపియన్‌ వినేశ్‌ ఫొగాట్‌ వరుసగా మూడోసారి ఒలింపిక్‌ బెర్తును ఖాయం చేసుకుంది.
 
ఆసియా ఒలింపిక్స్‌ అర్హత పోటీల్లో 50 కిలోల విభాగంలో ఫైనల్‌ చేరుకోవడం ద్వారా వినేశ్‌ పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తును ఖరారు చేసుకుంది. ఇప్పటికే 53 కిలోల విభాగంలో అంతిమ్ పంగల్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన రెండో భారత మహిళ రెజ్లర్‌గా వినేశ్‌ ఫొగాట్‌ నిలిచింది. 2016 రియో గేమ్స్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ పాల్గొన్న వినేశ్‌.. వరుసగా మూడోసారి ఒలింపిక్ బెర్తు సాధించింది. భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా కొనసాగిన ఉద్యమంలో వినేశ్‌ కీలక పాత్ర పోషించింది.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
Lakshmi Manchu: చ‌ర‌ణ్‌, రానా, అల్లు అర్జున్, ప్ర‌భాస్.. 140 మందితో వాట్సాప్ గ్రూప్ దాంట్లో ఏం మాట్లాడుకుంటామంటే? - మంచుల‌క్ష్మీ
చ‌ర‌ణ్‌, రానా, అల్లు అర్జున్, ప్ర‌భాస్.. 140 మందితో వాట్సాప్ గ్రూప్ దాంట్లో ఏం మాట్లాడుకుంటామంటే? - మంచుల‌క్ష్మీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Surya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABPJasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
Lakshmi Manchu: చ‌ర‌ణ్‌, రానా, అల్లు అర్జున్, ప్ర‌భాస్.. 140 మందితో వాట్సాప్ గ్రూప్ దాంట్లో ఏం మాట్లాడుకుంటామంటే? - మంచుల‌క్ష్మీ
చ‌ర‌ణ్‌, రానా, అల్లు అర్జున్, ప్ర‌భాస్.. 140 మందితో వాట్సాప్ గ్రూప్ దాంట్లో ఏం మాట్లాడుకుంటామంటే? - మంచుల‌క్ష్మీ
Telangana News : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
Zika Virus: పుణెలో జికా వైరస్ కలకలం - ఆరుగురికి పాజిటివ్ నిర్ధారణ, రోగుల్లో ఇద్దరు గర్భిణులు
పుణెలో జికా వైరస్ కలకలం - ఆరుగురికి పాజిటివ్ నిర్ధారణ, రోగుల్లో ఇద్దరు గర్భిణులు
Virat Kohli: అనుష్క!  నువ్వు లేకుండా సాధ్యమా! T20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత కొహ్లీ భావోధ్వేగం
అనుష్క! నువ్వు లేకుండా సాధ్యమా! T20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత కొహ్లీ భావోధ్వేగం
Air Europa Flight : అది ఎయిర్‌ బస్సా, ఎర్ర బస్సా- విమానంలో కుదుపులకు లగేజీ బాక్స్‌లో పడ్డ ప్రయాణికుడు
అది ఎయిర్‌ బస్సా, ఎర్ర బస్సా- విమానంలో కుదుపులకు లగేజీ బాక్స్‌లో పడ్డ ప్రయాణికుడు
Embed widget