News
News
X

IPL 2023: ధోనికి ఇదే లాస్ట్ సీజనా? - చెన్నై తర్వాతి కెప్టెన్ ఎవరు?

2023 ఐపీఎల్ ధోనికి సీజన్ అయితే తర్వాతి కెప్టెన్ ఎవరు?

FOLLOW US: 
Share:

Chennai Super Kings: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జట్టు ప్రాక్టీస్‌లోకి వచ్చాడు. ఆటగాళ్లు ఇంకా పూర్తి స్థాయిలో జట్టులోకి రానప్పటికీ మహేంద్ర సింగ్ ధోనీ, అజింక్య రహానే సహా పలువురు ఆటగాళ్లు చెన్నై చేరుకున్నారు.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చెన్నై చేరుకున్నట్లు జట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని వార్తలు వినిపిస్తున్నాయి. అతను ఐపీఎల్‌లో చివరిసారిగా చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడటం చూడవచ్చు.

జట్టు తదుపరి కెప్టెన్ ఎవరు?
ఒక వేళ ఐపీఎల్ 2023 మహేంద్ర సింగ్ ధోని చివరి సీజన్‌గా మారితే జట్టు తదుపరి కెప్టెన్ ఎవరు? అయితే మహేంద్ర సింగ్ ధోని IPL 2023లో చివరిసారిగా కనిపించడం దాదాపు ఖాయం. అదే సమయంలో మహేంద్ర సింగ్ ధోని తర్వాత బెన్ స్టోక్స్ జట్టు కెప్టెన్సీ రేసులో ముందున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా చేసే అవకాశం చాలా తక్కువగా ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్ బెన్ స్టోక్స్‌ వైపు మొగ్గు చూపవచ్చు
చెన్నై సూపర్ కింగ్స్ IPL 2022లో రవీంద్ర జడేజాను జట్టుకు కెప్టెన్‌గా చేసింది. అయితే టోర్నమెంట్ మధ్యలో ఈ ఆల్ రౌండర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించారు. ఆ తర్వాత మరోసారి మహేంద్ర సింగ్ ధోనీ జట్టుకు నాయకత్వం వహించాడు.

అయితే మహేంద్ర సింగ్ ధోని తర్వాత బెన్ స్టోక్స్ చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉండగలడని భావిస్తున్నారు. నిజానికి ఇంగ్లండ్ టెస్టు జట్టుకు బెన్ స్టోక్స్ కెప్టెన్. ఈ ఆల్ రౌండర్ తన కెప్టెన్సీతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి కెప్టెన్ రేసులో మహేంద్ర సింగ్ ధోని తర్వాత, బెన్ స్టోక్స్ ముందున్నాడని అంచనా వేస్తున్నారు. అయితే, ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ ఏ ఆటగాడిని ఎంచుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

బెన్ స్టోక్స్ ఐపీఎల్ చివరి దశలకు అందుబాటులో ఉండబోడని ఇప్పటికే కుండ బద్దలు కొట్టేసినట్లు చెప్పాడు. యాషెస్‌ సిరీస్‌కు సన్నద్ధం కావాలనే ఆలోచనను బెన్ స్టోక్స్ ఇప్పటికే వెల్లడించాడు. ఇటువంటి పరిస్థితిలో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్‌కు చేరితే ఆఖరి మ్యాచ్ ఆడతాడా? అని బెన్ స్టోక్స్‌కు ప్రశ్న ఎదురైంది. దానికి అతను కచ్చితంగా ‘నో’ అని చెప్పాడు.

ఈ ప్రశ్నకు స్టోక్స్ స్పందిస్తూ, 'నేను ఇంగ్లండ్ తరఫున ఆడతాను. ఐర్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌కి తగిన సమయం ఇచ్చేలా చూసుకుంటాను.’ అని సమాధానం ఇచ్చాడు. జూన్ 1వ తేదీ నుంచి ఐర్లాండ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనున్న ఇంగ్లండ్ జట్టు, ఈ టెస్టు మ్యాచ్‌ను యాషెస్‌కు సన్నాహకంగా చూస్తున్నారు. జూన్‌లోనే ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మధ్య యాషెస్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది. గత యాషెస్‌లో ఇంగ్లండ్‌ను ఆస్ట్రేలియా ఘోరంగా ఓడించింది. కాబట్టి ఈసారి ఎట్టి ఇంగ్లండ్ యాషెస్‌ను చేజిక్కించుకోవాలని కోరుకుంటుంది.

Published at : 02 Mar 2023 11:41 PM (IST) Tags: Ben Stokes Mahendra Singh Dhoni IPL 2023 Chennai Super Kings

సంబంధిత కథనాలు

ఈసారి సఫారీ సవారి సాగలేదు- కరేబియన్ కుర్రాళ్లదే టీ20 సిరీస్

ఈసారి సఫారీ సవారి సాగలేదు- కరేబియన్ కుర్రాళ్లదే టీ20 సిరీస్

Pragyan Ojha on Rohit Sharma: కిట్‌ కొనేందుకు పాల ప్యాకెట్లు అమ్మిన రోహిత్‌ శర్మ! అడిగితే ఎమోషనల్‌!

Pragyan Ojha on Rohit Sharma: కిట్‌ కొనేందుకు పాల ప్యాకెట్లు అమ్మిన రోహిత్‌ శర్మ! అడిగితే ఎమోషనల్‌!

Ganguly on Rishabh Pant: అలాంటి ఆటగాళ్లు ఈజీగా దొరకరు బాబూ - గంగూలీ!

Ganguly on Rishabh Pant: అలాంటి ఆటగాళ్లు ఈజీగా దొరకరు బాబూ - గంగూలీ!

Highest Runs Record: మూడు చారిత్రాత్మక రికార్డుల్లో దక్షిణాఫ్రికా - ఏ జట్టుకైనా సాధ్యం అవుతుందా?

Highest Runs Record: మూడు చారిత్రాత్మక రికార్డుల్లో దక్షిణాఫ్రికా - ఏ జట్టుకైనా సాధ్యం అవుతుందా?

Quinton de Kock: క్వింటన్ డికాక్ స్పెషల్ రికార్డు - ఎవ్వరికీ సాధ్యం కానిది!

Quinton de Kock: క్వింటన్ డికాక్ స్పెషల్ రికార్డు - ఎవ్వరికీ సాధ్యం కానిది!

టాప్ స్టోరీస్

KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్

KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!

పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!

నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్

నా ఇంటికి రా రాహుల్ భయ్యా-  రేవంత్ ఎమోషనల్ ట్విట్