అన్వేషించండి

BAN vs AFG : 156 పరుగులకే కుప్పకూలిన అఫ్గాన్‌, రాణించిన బంగ్లా బౌలర్లు

ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో ధర్మశాల వేదికగా అఫ్గానిస్థాన్‌-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లా బౌలర్ల ధాటికి అఫ్గనిస్థాన్‌ 156 పరగులకే కుప్పకూలింది.

వన్డే ప్రపంచకప్‌లో ధర్మశాల వేదికగా అఫ్గానిస్థాన్‌-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లా బౌలర్ల ధాటికి అఫ్గనిస్థాన్‌ 156 పరగులకే కుప్పకూలింది. టాస్‌ గెలిచిన బంగ్లా.. అఫ్గాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అఫ్గాన్‌ జట్టుకు ఓపెనర్లు రహ్మతుల్లా గుర్భాజ్‌, ఇబ్రహీం జర్దాన్‌ శుభారంభం ఇచ్చారు. బంగ్లా పేసర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఈ  జోడి తొలి వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. 62 బంతుల్లో 47 పరుగులు చేసి అర్ధ శతకం వైపు దూసుకుపోతున్న గుర్భాజ్‌ను ముస్తాఫిజుర్‌ అవుట్‌ చేసి అఫ్గాన్ వికెట్ల పతనాన్ని ప్రారంభించాడు.
 
తర్వాత కూడా అఫ్గాన్ బ్యాటింగ్‌ సాఫీగానే సాగింది. జర్దాన్‌తో కలిసి రహ్మత్‌ షా ఆచితూచి ఆడాడు. వీరిద్దరూ సమయోచితంగా బ్యాటింగ్‌ చేశారు. కానీ రహ్మత్‌ షాని అవుట్‌ చేసి షకీబుల్‌ హసన్‌ అఫ్గాన్‌ను దెబ్బ కొట్టాడు. 18 పరుగులు చేసిన హస్మతుల్లా షాహిదీ, 22 పరుగులు చేసిన ఇబ్రహీం జర్దాన్‌ కూడా అవుటవ్వడంతో అఫ్గాన్ 112 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.  112 పరుగుల వద్దే అఫ్గాన్ మూడు వికెట్లు కోల్పోయింది. 126 పరుగుల వద్ద ఆరు వికెట్లను కోల్పోయింది.  బంగ్లా బౌలర్ల ధాటికి అఫ్గాన్‌ బ్యాటర్లను పెవిలీయన్‌కు పంపారు. అమ్రాతుల్లా ఒమ్రాజాయ్‌ 22 పరుగులతో వికెట్ల పతనాన్ని కాసేపు నిలువరించాడు.  కానీ అతడిని ఇస్లామ్ బౌల్డ్‌ చేసి బంగ్లాకు ఉపశమనం కలిగించాడు. రషీద్ ఖాన్‌ 9 పరుగులకు, రహమాన్ 1, నవీన్‌ ఉల్‌ హక్ డకౌట్‌గా వెనుదిరిగారు. దీంతో 156 పరుగులకే అఫ్గాన్‌ కుప్పకూలింది. బంగ్లా బౌలర్లలో హసన్ మీరాజ్‌ 3, షకీబ్‌ అల్‌ హసన్ 3 వికెట్లతో రాణించారు. వీరి ధాటికి ఏ ఒక్క అఫ్గాన్‌ బ్యాటర్‌ కూడా అర్ధ శతకం సాధించలేదు. ఆరుగురు బ్యాటర్లు కనీసం రెండంకెల స్కోరు కూడా నమోదు చేయలేదు. 
 
2017 ఐసీసీ ఫుల్‌ మెంబర్‌షిప్‌ సాధించిన అఫ్గానిస్థాన్‌.. వన్డే ప్రపంచకప్‌ వంటి మెగా ఈవెంట్‌లో తమదైన ముద్ర వేయాలని తహతహలాడుతోంది. ఇప్పటి వరకు వరల్డ్‌కప్‌ చరిత్రలో 15 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు కేవలం ఒకే ఒక్క విజయం సాధించింది. అయితే తమదైన రోజులో ఎంతటి జట్టునైనా ఇబ్బంది పెట్టగల సత్తా ఆ జట్టుకు ఉంది. ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన 2019 వరల్డ్‌కప్‌లో టీమ్‌ఇండియా, పాకిస్థాన్‌ను అఫ్గాన్‌ భయపెట్టింది. స్టార్లతో నిండి ఉన్న జట్లపై చక్కటి పోరాటం కనబర్చింది. ఇప్పుడు ఆ స్థాయి దాటి మరో ముందడుగు వేయాలని చూస్తోంది.
 
రషీద్‌ ఖాన్‌, ముజీబ్‌ ఉర్‌ రహమాన్‌, మహమ్మద్‌ నమీ, హష్మతుల్లా షాహిదిపై అఫ్గాన్‌ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. బ్యాటింగ్‌లో రహ్మానుల్లా గుర్బాజ్‌, ఇబ్రహీం జద్రాన్‌, హష్మతుల్లా, నబీ వంటి నైపుణ్యం ఉన్న ప్లేయర్లు అందుబాటులో ఉన్నా.. నిలకడలేమి వారికి ప్రధాన ఇబ్బందిగా మారింది. ఈ ఫార్మాట్‌లో ఆడిన గత ఐదు మ్యాచ్‌ల్లోనూ అఫ్గాన్‌కు పరాజయాలు ఎదురుకాగా.. బంగ్లాదేశ్‌ గత 5 మ్యాచ్‌ల్లో నాలుగింట ఓడింది.
 
ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రపంచకప్‌లో శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. అయితే ఈ చిన్న జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగుతోంది. అయితే అఫ్గాన్‌ స్పిన్‌ను బంగ్లా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారన్న దానిపై విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
IPS officer Sanjay: ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!

వీడియోలు

India vs South Africa 3rd T20 Records | మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు
Hardik Pandya Records in 3rd T20 | చరిత్ర సృష్టించిన హార్దిక్
Shubman Gill in Ind vs SA 3rd T20 | మళ్లీ విఫలమైన శుభ్మన్ గిల్
Suryakumar Yadav about His Batting | తన ఫార్మ్ పై వరుస క్లారిటీ ఇచ్చిన సూర్య
భారతదేశంలోనే అత్యంత విచిత్రమైన ఆచారాలు పాటించే ఉడిపి శ్రీకృష్ణ మందిరం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
IPS officer Sanjay: ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
UP bride: పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
Nuclear ash over the Himalayas: హిమాలయాలపై అమెరికా పెట్టిన అణుకుంపటి -ఎవరికీ తెలియని సంచలన విషయాలు ఇవిగో
హిమాలయాలపై అమెరికా పెట్టిన అణుకుంపటి -ఎవరికీ తెలియని సంచలన విషయాలు ఇవిగో
Cheapest Cars in India: దేశంలో అత్యంత చవకైన కార్లు ఇవే! 34 KM మైలేజ్‌తోపాటు ADAS ఫీచర్ ఉన్న వాహనాల ధర ఎంత?
దేశంలో అత్యంత చవకైన కార్లు ఇవే! 34 KM మైలేజ్‌తోపాటు ADAS ఫీచర్ ఉన్న వాహనాల ధర ఎంత?
Lucky Draw Sarpanchs in Telangana: రెండో విడత ఫలితాల్లో చిత్ర విచిత్రాలు.. సమానంగా ఓట్లు, లక్కీ డ్రా సర్పంచ్ లు..!
రెండో విడత ఫలితాల్లో చిత్ర విచిత్రాలు.. సమానంగా ఓట్లు, లక్కీ డ్రా సర్పంచ్ లు..!
Embed widget