అన్వేషించండి

Rafael Nadal Records: ఈ రికార్డులు కొట్టడం మిషన్ ఇంపాజిబుల్.. నాదల్ అలా సెట్ చేశాడు మరి!

రఫెల్ నాదల్ తన టెన్నిస్ కెరీర్ ఎన్నో అసాధ్యమైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. వీటిలో కొన్ని రికార్డులు ఇవే..

స్పెయిన్ దిగ్గజ టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్ ప్రపంచ రెండో ర్యాంకర్ మెద్వెదేవ్‌పై 6-2, 7-6, 6-4, 6-4, 7-6తో విజయం సాధించి ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను గెలుచుకున్నాడు. ఇది నాదల్ కెరీర్‌లో 21వ గ్రాండ్ స్లామ్. దీంతో చెరో 20 గ్రాండ్ స్లామ్‌లు సాధించిన రోజర్ ఫెదెరర్, నోవాక్ జొకోవిచ్‌లను వెనక్కి నెట్టి అత్యధిక గ్రాండ్ స్లామ్‌లు గెలిచిన పురుష టెన్నిస్ ఆటగాడిగా రఫెల్ నాదల్ నిలిచాడు. ఇది మాత్రమే కాకుండా నాదల్ కొన్ని ప్రత్యేకమైన రికార్డులు కూడా సాధించాడు.

ఇప్పటి వరకు అత్యధిక ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు సాధించిన ఆటగాడు రఫెల్ నాదలే. ఏకంగా 13 ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లను అతను సాధించడం విశేషం. 2005 నుంచి 2008 వరకు, 2010 నుంచి 2014 వరకు, 2017 నుంచి 2020 వరకు ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లను అతను గెలుచుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో తనను ఓడించిన ఆటగాళ్లు రాబిన్ సోదర్లింగ్, నోవాక్ జొకొవిచ్  మాత్రమే.

13 ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లతో పాటు, రెండు వింబుల్డన్ గ్రాండ్ స్లామ్‌లు (2008, 2010), నాలుగు యూఎస్ ఓపెన్ టైటిళ్లు (2010, 2013, 2017, 2019), రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిళ్లు (2009, 2022) కూడా అతను సాధించాడు. 2005 నుంచి తను కేవలం మూడు సంవత్సరాల్లో మాత్రమే గ్రాండ్ స్లామ్ సాధించలేదు. 2015, 2016, 2021 సంవత్సరాల్లో తప్ప మిగతా అన్ని సంవత్సరాల్లో కనీసం ఒక్క సంవత్సరం అయినా నాదల్ గ్రాండ్ స్లామ్ కొట్టాడు.

నాదల్ కేవలం 24 సంవత్సరాల వయసులోనే కెరీర్ గ్రాండ్ స్లామ్ సాధించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్.. నాలుగు గ్రాండ్ స్లామ్‌లూ గెలిస్తే కెరీర్ స్లామ్ సాధించినట్లు. ఈ ఫీట్ సాధించిన అత్యంత చిన్న వయస్కుడు నాదలే.

కెరీర్ గోల్డెన్ స్లామ్ సాధించిన రెండో పురుష ఆటగాడు నాదలే. నాదల్‌కు ముందు ఆండ్రీ అగస్సీ ఈ ఫీట్ సాధించగా.. నాదల్ తర్వాత ఎవ్వరూ దాన్ని సాధించలేకపోయారు. నాలుగు గ్రాండ్ స్లామ్‌లతో పాటు ఒలంపిక్స్‌లో బంగారు పతకం కూడా గెలిస్తే దాన్ని గోల్డెన్ స్లామ్‌గా పరిగణిస్తారు. 2008 ఒలంపిక్స్‌లో నాదల్ బంగారు పతకం సాధించాడు.

ఏటీపీ ర్యాంకింగ్స్‌లో టీనేజ్‌లోనే రెండో ర్యాంకు సాధించిన ఘనత నాదల్ సొంతం. క్లేకోర్టుపై వరుసగా 81 విజయాలను నాదల్ సాధించాడు. ఓపెన్ ఎరాలో ఏ కోర్టు మీద అయినా ఇదే అత్యధికం కావడం విశేషం. పురుషుల సింగిల్స్‌తో పాటు, డబుల్స్ విభాగంలో కూడా నాదల్ ఒలంపిక్ స్వర్ణం సాధించాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
Allu Arjun Wax Statue: తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా? 
తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా? 
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
Allu Arjun Wax Statue: తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా? 
తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా? 
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Actress Aayushi Patel: లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చవు, ఇండస్ట్రీకి డబ్బుల కోసం రాలేదు - క్లారిటీగా చెప్పేసిన ఆయుషి పటేల్
లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చవు, ఇండస్ట్రీకి డబ్బుల కోసం రాలేదు - క్లారిటీగా చెప్పేసిన ఆయుషి పటేల్
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Embed widget