AUS vs BANG, Match Highlights: బంగ్లాపై రెచ్చిపోయిన ఆస్ట్రేలియా.. 6.2 ఓవర్లలోనే ఫసక్
ICC T20 WC 2021, AUS vs BANG: టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది.
టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. బంగ్లాదేశ్‌ను 73 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం కేవలం ఓవర్లలోనే వికెట్ నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా.. తన సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఐదు వికెట్లు తీసిన జంపాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
బంగ్లాను ఆటాడుకున్న జంపా
మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ను ఆస్ట్రేలియా బౌలర్లు ఒక ఆటాడుకున్నారు. మొదటి ఓవర్ నుంచి క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూనే ఉన్నారు. దీంతో 6.1 ఓవర్లలో 33 పరుగులకే బంగ్లాదేశ్ ఐదు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత నాలుగు ఓవర్ల పాటు కెప్టెన్ మహ్మదుల్లా, షమీమ్ హుస్సేన్ మరో వికెట్ పడకుండా ఆపారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 29 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధిక భాగస్వామ్యం.
ఇన్నింగ్స్ 11వ ఓవర్లో షమీమ్ అవుటయ్యాక.. మళ్లీ బంగ్లాదేశ్ వికెట్లు టపటపా పడ్డాయి. 11 పరుగుల వ్యవధిలోనే చివరి ఐదు వికెట్లు కోల్పోయిన బంగ్లా 15 ఓవర్లలో 73 పరుగులకే ఆలౌట్ అయింది. ఐదు వికెట్లు తీసిన ఆడం జంపా బంగ్లాదేశ్ పతనాన్ని శాసించాడు. బంగ్లాదేశ్ చివరి ఆరు వికెట్లలో ఐదు వికెట్లను జంపానే తీశాడు. స్టార్క్‌కు రెండు, హాజిల్‌వుడ్‌కు రెండు, మ్యాక్స్‌వెల్‌కు ఒక వికెట్ దక్కాయి. ఆస్ట్రేలియా బౌలర్లలో ఎవరి ఎకానమీ ఆరు పరుగులను దాటలేదు. అందరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.
6.2 ఓవర్లలోనే ఫినిష్
74 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మొదటి బంతి నుంచి దూకుడుగా ఆడింది. సెమీస్ అవకాశాలు మెరుగవ్వాలంటే నెట్ రన్‌రేట్‌ను మెరుగుపరుచుకోవాల్సి ఉండటంతో.. ఓపెనర్లు ఫించ్, వార్నర్ వేగంగా ఆడారు. అయితే ఈ ప్రయత్నంలోనే ఓపెనర్లు ఇద్దరూ అవుటయ్యారు.
ఆ తర్వాత మిషెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ మ్యాచ్‌ను ముగించారు. వార్నర్‌ను ఇస్లాం, ఆరోన్ ఫించ్‌ను టస్కిన్ అహ్మద్ అవుట్ చేశారు. ఈ విజయంలో ఆస్ట్రేలియా నెట్ రన్‌రేట్ -0.7 నుంచి +1.031కు చేరుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా రెండో స్థానానికి చేరుకుంది. దీంతో వారి సెమీస్ అవకాశాలు కూడా మెరుగయ్యాయి.
Also Read: Khel Ratna Award 2021: ఈసారి 12 మందికి ఖేల్‌రత్న.. ఒలింపియన్లకు గౌరవం.. జాబితాలో మిథాలీ, ఛెత్రీ