(Source: ECI/ABP News/ABP Majha)
T20 World Cup Winners: ఆస్ట్రేలియా అన్‌స్టాపబుల్ - ఆరో టీ20 వరల్డ్ కప్ కైవసం - దక్షిణాఫ్రికాకు తప్పని ఓటమి!
మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా 19 పరుగులతో విజయం సాధించింది.
ICC T20 World Cup 2023 Final SA vs AUS: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియన్ మహిళల జట్టు ఆతిథ్య దక్షిణాఫ్రికా మహిళల జట్టును 19 పరుగుల తేడాతో ఓడించి ఆరో సారి టీ20 ట్రోఫీని గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది ఇందులో బెత్ మూనీ 74 పరుగులతో ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడింది.
157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టుకు నెమ్మదైన ఆరంభం లభించింది. తొలి 6 ఓవర్లలో జట్టు కేవలం 22 పరుగులు మాత్రమే జోడించగలిగింది. తాజ్మీన్ బ్రిట్స్ రూపంలో జట్టు ఒక ముఖ్యమైన వికెట్ కూడా కోల్పోయింది. దీని తర్వాత లారా వోల్వార్డ్ట్, ఒక ఎండ్‌లో దూకుడుగా ఆడి వేగంగా పరుగులు చేసే ప్రక్రియను ప్రారంభించింది. అయితే లారా 61 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకోవడంతో, దక్షిణాఫ్రికా విజయపు ఆశలు కూడా ముగిసిపోయాయి. దీంతో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 137 పరుగుల స్కోరును మాత్రమే చేరుకోగలిగింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మహిళల జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టులో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అలిస్సా హీలీ, బెత్ మూనీలు తొలి వికెట్‌కు 36 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హీలీ వ్యక్తిగత స్కోరు 18 వద్ద మారిజానే క్యాప్‌కి వికెట్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకుంది. దీని తర్వాత మైదానంలోకి వచ్చిన యాష్లే గార్డనర్ దూకుడుగా ఆడి 21 బంతుల్లో 29 పరుగులు సాధించింది.
మరొక ఎండ్ నుంచి బెత్ మూనీ జట్టును హ్యాండిల్ చేయడంతో పాటు స్కోర్‌ను పెంచడానికి తన వంతు కృషి చేసింది. ఈ మ్యాచ్‌లో బెత్ మూనీ 53 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 74 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేయగలిగింది. సౌతాఫ్రికా బౌలింగ్‌లో షబ్నిమ్ ఇస్మాయిల్, మరిజానే కాప్ తలో రెండు వికెట్లు తీశారు.
దక్షిణాఫ్రికా మహిళల జట్టు ఓపెనింగ్ జోడీపై ఫైనల్ మ్యాచ్ ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. తొలి ఆరు ఓవర్లలో పరుగుల వేగం చాలా తక్కువగా కనిపించింది. తొలి 10 ఓవర్లకు దక్షిణాఫ్రికా మహిళల జట్టు 2 వికెట్ల నష్టానికి 52 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక్కడ నుండి లారా వోల్వార్డ్ పరుగులు చేసే ప్రక్రియను ప్రారంభించింది. దీంతో దక్షిణాఫ్రికా విజయం వైపు దూసుకుపోయింది.
ఈ మ్యాచ్‌లో ఆఫ్రికా జట్టు గెలవగలదని అందరూ భావిస్తున్న తరుణంలో అదే సమయంలో వోల్వార్డ్‌ను ఆస్ట్రేలియన్ బౌలర్ మేగాన్ షుట్ వ్యక్తిగత స్కోరు అవుట్ చేసి మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది. దీంతో దక్షిణాఫ్రికా మహిళల జట్టు ఆరు వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మేగాన్ షుట్, జెస్ జొనాసెన్, ఆష్లే గార్డనర్, డార్సీ బ్రౌన్ తలో వికెట్ దక్కించుకున్నారు.
View this post on Instagram