అన్వేషించండి

IND vs PAK: మ్యాచ్ ఫలితాన్ని మార్చిన ఒక్క క్యాచ్, ఆ ప్లేయర్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ ఫైర్

పాకిస్థాన్ తో జరిగిన సూపర్- 4 మ్యాచ్ లో భారత పేసర్ అర్హదీప్ సింగ్ సులభమైన క్యాచ్ వదిలేసి.. కెప్టెన్ రోహిత్ కోపానికి గురయ్యాడు. రవి బిష్ణోయ్ బౌలింగ్ లో ఆసిఫ్ అలీ ఇచ్చిన అతి సులభమైన క్యాచ్ వదిలేశాడు.

క్యాచ్ స్ విన్స్ మ్యాచ్ స్ అని ఊరికే అనరు. ఒక క్యాచ్ వదిలేస్తే మ్యాచ్ వదిలేసినట్లే.  అలాంటిది ముఖ్యమైన సమయంలో ముఖ్యమైన క్యాచ్ వదిలేస్తే మ్యాచ్ చేజారకుండా ఉంటుందా. అందుకు ఆదివారం జరిగిన భారత్- పాకిస్థాన్ మ్యాచే పెద్ద ఉదాహరణ. 

పాకిస్థాన్ తో జరిగిన సూపర్- 4 మ్యాచ్ లో భారత పేసర్ అర్హదీప్ సింగ్ ఒక సులభమైన క్యాచ్ వదిలేసి.. అభిమానుల ఆగ్రహానికే కాదు కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహానికి గురయ్యాడు. రవి బిష్ణోయ్ బౌలింగ్ లో ఆసిఫ్ అలీ ఇచ్చిన అతి సులభమైన క్యాచ్ వదిలేశాడు. లైఫ్ రావడంతో పాక్ బ్యాటర్ అలీ తర్వాతి ఓవర్లో సిక్స్, ఫోర్ బాదాడు. ఆ తర్వాత పాక్ మ్యాచ్ గెలిచింది. అదే అర్హదీప్ ఆ క్యాచ్ పట్టుంటే ఫలితం వేరేగా ఉండేదేమో!

అసలేం జరిగిందంటే.. 
పాకిస్థాన్ తో సూపర్- 4 మ్యాచులో భారత్ 181 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్, కేఎల్ రాహుల్ మంచి ఆరంభం ఇచ్చారు. విరాట్ కోహ్లీ సూపర్ హాఫ్ సెంచరీతో 20 ఓవర్లలో 181 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన పాక్.. ఓపెనర్ బాబర్ అజామ్, వన్ డౌన్ బ్యాటర్ ఫకార్ జమాన్ వికెట్లు తర్వగానే కోల్పోయింది. అయితే మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ నవాజ్ లు అదిరే బ్యాటింగ్ తో పాక్ ను విజయం వైపు నడిపించారు.  అయితే 5 ఓవర్లలో 47 పరుగులు కావలసిన స్థితిలో భారత బౌలర్లు పుంజుకుని రిజ్వాన్, నవాజ్ లను ఔట్ చేసి భారత్ ను పోటీలోకి తెచ్చారు. 

సులభమైన క్యాచ్ జారవిడిచాడు.. 
ఆ స్థితిలో భారత్ గెలిచేలా కనిపించింది. బిష్ణోయ్ వేసిన ఓవర్లో ఆసిఫ్ అలీ ఓ భారీ షాట్ ఆడాడు. అది గాల్లోకి లేచింది. చాలా తేలికగా పట్టేలా కనిపించిన ఆ క్యాచ్ ను అర్హదీప్ జారవిడిచాడు. అంతే కెప్టెన్ రోహిత్ తన సహనాన్ని కోల్పోయాడు. భారత పేసర్ పై కోపంగా కనిపించాడు. మిగతా ఆటగాళ్లు ఆశ్చర్యపోయారు. జీవనదానం పొందిన ఆసిఫ్,, భువనేశ్వర్ వేసిన 19వ ఓవర్లో సిక్స్, ఫోర్ దంచాడు. ఆ ఓవర్లో ఏకంగా 19 పరుగులు వచ్చాయి. దీంతో మ్యాచ్ పాక్ వైపు మళ్లింది. చివరి ఓవర్లో అలీ ఔటైనా మిగతా బ్యాట్స్ మెన్ పని పూర్తిచేశారు. మరో బంతి మిగిలుండగానే పాక్ విజయాన్ని అందుకుంది.
 Also Read: IND Vs PAK Asia Cup 2022: పగ తీర్చుకున్న పాకిస్తాన్ - సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియాపై విక్టరీ!

అలీ ఇచ్చిన ఆ క్యాచ్ ను అర్హదీప్ పట్టుంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేదేమో. ఆ ఉత్కంఠభరిత, ఒత్తిడి సమయంలో పడ్డ ఆ వికెట్ పాక్ కు ఓటమిని, భారత్ కు విజయాన్ని కట్టబెట్టేదేమో. కానీ అలా జరగలేదు. మొత్తానికి అవకాశాలు వృథా చేసుకున్న టీమిండియా పాక్ కు తలవంచింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget