అన్వేషించండి

Asia cup 2022: పాపం పాక్‌! మూడు జట్లకు ఉమ్మడి శత్రువు - ఒకటి మనం, మిగతా ఇద్దరు ఎవరంటే?

IND vs PAK: అంతర్జాతీయ క్రికెట్లో కొన్ని దేశాల మధ్య రైవల్రీ ఆకట్టుకుంటుంది. ఆసియా కప్‌ 2022లోనూ ఇలాంటి మ్యాచులకు కొదవేమీ లేదు. కాకపోతే ఇక్కడ మూడు జట్లకు ఒకే ఉమ్మడి శత్రువు! అదే పాక్‌!!

Asia Cup 2022, IND vs PAK: అంతర్జాతీయ క్రికెట్లో కొన్ని దేశాల మధ్య రైవల్రీ ఆకట్టుకుంటుంది. అభిమానులకు అంతులేని థ్రిల్‌ను పంచుతుంది. ఆ జట్లు మైదానంలో ఎప్పుడెప్పుడు తలపడతాయా అని ఎదురు చూసేలా చేస్తుంది. భారత్‌ x పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా x ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ x ఆస్ట్రేలియా మ్యాచులే ఇందుకు నిదర్శనం. ఆసియా కప్‌ 2022లోనూ ఇలాంటి మ్యాచులకు కొదవేమీ లేదు. కాకపోతే ఇక్కడ మూడు జట్లకు ఒకే ఉమ్మడి శత్రువు! అదే పాక్‌!!

భారత్‌ x పాకిస్థాన్‌

ప్రపంచ క్రికెట్లో భారత్‌, పాకిస్థాన్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! అసలిలాంటి మ్యాచుల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తుంటారు. ఏదైనా టోర్నీలో దాయాదుల తలపడుతున్నాయని తెలిస్తే అభిమానులు టికెట్ల కోసం ఎగబడతారు. ఐదు నిమిషాల్లోనే అన్నీ కొనేస్తారు. రాజకీయ ప్రముఖులు, సినీ తారలు, వ్యాపార వేత్తలు సైతం లక్షల్లో డబ్బు చెల్లించి టికెట్లు సొంతం చేసుకుంటారు. స్వాత్రంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈ రెండు దేశాలు కశ్మీర్‌ విషయంలో గొడవ పడుతున్న సంగతి తెలిసిందే. దానికితోడు పాక్‌ ఉగ్రవాదులకు రక్షణ కల్పించడం, తీవ్రవాద దాడులను ప్రోత్సహించడంతో దాయది దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీసులు నిలిచిపోయాయి. అందుకే వీళ్లెప్పుడు తలపడ్డా భావోద్వేగాలు కట్టలు తెంచుకుంటాయి. అభిమానులు ఉద్వేగానికి గురవుతుంటారు.

బంగ్లాదేశ్ x పాకిస్థాన్‌

పాకిస్థాన్‌కు రెండో ప్రధాన శత్రువు బంగ్లాదేశ్‌. మన నుంచి పాక్‌ విడిపోతే దాన్నుంచి బంగ్లా విడిపోయింది. అదో పెద్ద హిస్టరీ! బ్రిటిషర్లు మన దేశం వదిలి వెళ్లేటప్పుడు లాజిక్ లేకుండా పాకిస్థాన్‌ను విడదీశారు. భారత్‌కు తూర్పు, పడమర వైపు పాక్‌ను ఏర్పాటు చేశారు. అంటే ఇప్పటి బంగ్లాదేశ్ మొదట్లో పాక్‌లో భాగంగా ఉండేది. దానిని తూర్పు పాకిస్థాన్‌ అనేవారు. పశ్చిమ పాక్‌లో ఊర్దూ మాట్లాడితే తూర్పు పాక్‌లో బెంగాలీ మాట్లాడతారు. అంతేకాకుండా వీటి మధ్య సాంస్కృతిక వైరుధ్యాలు ఎక్కువ. ఆహారం, వస్త్రధారణలో తేడాలుంటాయి. నిధులు, అభివృద్ధి పరంగా తూర్పు పాకిస్థాన్‌ను నిర్లక్ష్యం చేశారు. చివరికి వివాదం ముదిరి యుద్ధంగా మారితే, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బంగ్లాకు సాయం చేసి స్వాత్రంత్ర్యం ఇప్పించారు. దాంతో బంగ్లాదేశ్‌ ఏర్పడింది. అందుకే వీరి మధ్య మ్యాచులు జరిగితే ఆసక్తికరంగా ఉంటుంది. బంగ్లా పులులు రెచ్చిపోయి ఆడతాయి.

అఫ్గాన్‌ x పాకిస్థాన్‌

పాక్, అఫ్గానిస్థాన్‌ మధ్యా ఎన్నో విభేదాలు ఉన్నాయి. అఫ్గాన్‌లో ఎక్కువగా పఠాన్లు ఉంటారు. అక్కడ ఐదారు భాషాల్లో మాట్లాడతారు. పస్తూ, దరి భాషాలను అధికారికంగా ప్రకటించారు. ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు గొడవలు ఉన్నాయి. కైబర్‌ ఫక్తూంక్వా, పాకిస్థానీ బలూచిస్థాన్‌ ప్రాంతాల కోసం ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పైగా అఫ్గాన్‌లో టెర్రరిజానికి పాకిస్థాన్‌ మద్దతు అందిస్తుండటం వారికి ఆగ్రహం తెప్పిస్తోంది. కొన్నేళ్లుగా తమ దేశం వెనకబడానికి కారణం పాక్‌ అని వారి భావన. స్వాత్రంత్ర్యం వచ్చాక ఐక్యరాజ్య సమితితో పాక్‌ చేరికను వ్యతిరేకిస్తూ ఓటేసిన ఏకైక దేశం అఫ్గాన్‌. ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్లో అదరగొడుతున్న ఈ దేశం, పాక్‌తో పోరు అనగానే రెచ్చిపోతుంది. ముప్పుతిప్పలు పెడుతుంది.

ఇదండీ మూడు దేశాలకు ఒక ఉమ్మడి శత్రువు కథ! అందుకే ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ కేవలం భారత్‌పై దృష్టి సారిస్తే సరిపోదు. అఫ్గాన్‌, బంగ్లాదేశ్‌తోనూ  కఠినంగానే పోరాడాలి. లేదంటే వారు చుక్కలు చూపించడం ఖాయం!! గతేడాది ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఇదే దుబాయ్‌ వేదికగా పాక్‌ను దాదాపుగా ఓడించినంత పనిచేసింది అఫ్గాన్‌.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Viduthalai 2 Twitter Review - విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Viduthalai 2 Twitter Review - విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Smriti Mandhana 2 World Records: రికార్డుల రాణి స్మృతి మంధాన .. ఒకేరోజు రెండు ప్రపంచ రికార్డులు బద్దలు.. గతవారం కూడా ఒక వరల్డ్ రికార్డు నమోదు
రికార్డుల రాణి స్మృతి మంధాన .. ఒకేరోజు రెండు ప్రపంచ రికార్డులు బద్దలు.. గతవారం కూడా ఒక వరల్డ్ రికార్డు నమోదు
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Embed widget