News
News
X

Ind vs Pak T20: ఓడిన పాక్‌, గెలిచిన టీమ్‌ఇండియాకు ఐసీసీ షాక్‌!

Ind vs Pak T20: ఆసియా కప్‌ 2022లో ఫేవరెట్లుగా బరిలోకి దిగిన భారత్‌, పాక్‌ జట్లకు ఐసీసీ షాకిచ్చింది! రెండు జట్లు చెరో రెండు ఓవర్లు ఆలస్యంగా వేయడంతో మ్యాచు ఫీజులో 40 శాతం చొప్పున కోత విధించారు.

FOLLOW US: 

India, Pakistan fined for slow over rate: ఆసియా కప్‌ 2022లో ఫేవరెట్లుగా బరిలోకి దిగిన భారత్‌, పాక్‌ జట్లకు ఐసీసీ షాకిచ్చింది! మొదటి మ్యాచులో గెలిచిన టీమ్‌ఇండియా, ఓటమి చవిచూసిన పాక్‌కూ మ్యాచు ఫీజులో కోత విధించింది. రెండు జట్లు చెరో రెండు ఓవర్లు ఆలస్యంగా వేయడంతో మ్యాచు ఫీజులో 40 శాతం చొప్పున కోత విధించారు. ఫీల్డ్‌ అంపైర్లు మసూదర్‌ రెహ్మాన్‌, రుచిర పిలియాగురుగె, మూడో అంపైర్‌ రవీంద్ర విమలసిరి, నాలుగో అంపైర్‌ గాజి సోహెల్‌ రెండు జట్లపై అభియోగాలు నమోదు చేశారు.

ఐసీసీ ఆటగాళ్లు, సహాయ సిబ్బంది నియమావళిలోని ఆర్టికల్‌ 2.22 ప్రకారం ఎమిరేట్స్‌ ఐసీసీ ఎలైట్‌ ప్యానెల్‌ మ్యాచ్‌ రిఫరీ జెఫ్ క్రో టీమ్‌ఇండియా, పాకిస్థాన్‌కు జరిమానా విధించారు. నిర్దేశిత సమయంలో బౌలింగ్‌ను ముగించలేదని వెల్లడించారు. కెప్టెన్లు రోహిత్ శర్మ, బాబర్‌ ఆజామ్‌ తప్పును అంగీకరించడంతో తుదుపరి విచారణేమీ జరగలేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక ఓవర్‌ ఆలస్యంగా వస్తే మ్యాచులో ఫీజులో 20 శాతం, 2 ఓవర్లైతే 40 శాతం కోత వేస్తారు. వరుస మ్యాచుల్లో ఇలాగే జరిగితే కెప్టెన్లపై మ్యాచు నిషేధం ఉంటుంది.

భారత్ x పాక్ మ్యాచ్ రీక్యాప్!

చిరకాల ప్రత్యర్థిపై టీమిండియా పంజా విసిరింది. ఆసియా కప్‌ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. థ్రిల్లింగ్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 147 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం టీమిండియా 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసియా కప్‌లో భారత్ తన తదుపరి మ్యాచ్‌లో హాంగ్ కాంగ్‌తో తలపడనుంది. ఆగస్టు 31వ తేదీన ఈ మ్యాచ్ జరగనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ 4వ తేదీన జరిగే సూపర్-4 మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ మళ్లీ తలపడనున్నాయి.

గెలిపించిన జడేజా, పాండ్యా

148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (0: 1 బంతి) తాను ఎదుర్కొన్న మొదటి బంతికే అవుటయ్యాడు. అయితే విరాట్ కోహ్లీ (35: 34 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), రోహిత్ శర్మ (12: 18 బంతుల్లో, ఒక సిక్సర్) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. రెండో వికెట్‌కు 7.4 ఓవర్లలో 49 పరుగులు జోడించారు. క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడ్డ రోహిత్ శర్మను అవుట్ చేసి మహ్మద్ నవాజ్ పాకిస్తాన్‌కు కీలక వికెట్ అందించాడు. అనంతరం విరాట్ కోహ్లీ కూడా నవాజ్ బౌలింగ్‌లోనే రోహిత్ తరహాలోనే అవుటయ్యాడు. దీంతో భారత్ 53 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

అనంతరం సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా మరో వికెట్ పడకుండా కాసేపు ఆడారు. నాలుగో వికెట్‌కు 36 పరుగులు జోడించిన అనంతరం సూర్యకుమార్ యాదవ్ (18: 18 బంతుల్లో, ఒక ఫోర్) అవుటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 89 పరుగులకు చేరుకుంది. మరో వైపు సాధించిన రన్‌రేట్ కూడా 10 పరుగులకు చేరుకోవడంతో ఒత్తిడి బాగా పెరిగింది. ఈ దశలో రవీంద్ర జడేజా (35: 29 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (33: 17 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) స్కోరును ముందుకు నడిపించారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 52 పరుగులు జోడించారు. అయితే చివరి ఓవర్లో ఏడు పరుగులు చేయాల్సిన దశలో రవీంద్ర జడేజా అవుట్ కావడంతో తిరిగి ఉత్కంఠ నెలకొంది. అయితే పాండ్యా ఎటువంటి పొరపాటు లేకుండా మ్యాచ్‌ను ముగించాడు.

Published at : 31 Aug 2022 04:21 PM (IST) Tags: Rohit Sharma Hardik Pandya India vs Pakistan virat kohli Babar Azam Asia Cup 2022 Asia Cup Asia Cup 2022 Live team india

సంబంధిత కథనాలు

వైరల్‌ అవుతున్న కోహ్లీ నిర్ణయం- అందుకే కింగ్ అయ్యాడంటున్న ఫ్యాన్స్‌

వైరల్‌ అవుతున్న కోహ్లీ నిర్ణయం- అందుకే కింగ్ అయ్యాడంటున్న ఫ్యాన్స్‌

మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్ సరిపోలేదు - మ్యాచ్, సిరీస్ రెండూ మనవే!

మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్ సరిపోలేదు - మ్యాచ్, సిరీస్ రెండూ మనవే!

IND Vs SA 2nd T20 Highlights: దక్షిణాఫ్రికాని కమ్మేసిన స్కై, కింగ్ - టీమిండియా భారీ స్కోరు!

IND Vs SA 2nd T20 Highlights: దక్షిణాఫ్రికాని కమ్మేసిన స్కై, కింగ్ - టీమిండియా భారీ స్కోరు!

IND Vs SA 2nd T20 Toss: ఈసారి టాస్ దక్షిణాఫ్రికాది - బౌలింగ్‌కు మొగ్గు చూపిన ప్రొటీస్!

IND Vs SA 2nd T20 Toss: ఈసారి టాస్ దక్షిణాఫ్రికాది - బౌలింగ్‌కు మొగ్గు చూపిన ప్రొటీస్!

IND vs SA 2nd T20 Live Streaming: ఇండియా, దక్షిణాఫ్రికా మ్యాచ్ లైవ్ ఎలా చూడవచ్చంటే?

IND vs SA 2nd T20 Live Streaming: ఇండియా, దక్షిణాఫ్రికా మ్యాచ్ లైవ్ ఎలా చూడవచ్చంటే?

టాప్ స్టోరీస్

KCR Plan : కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టేది తెలంగాణలో మూడో సారి గెలవడానికే. - అంచనాలకు అందని కేసీఆర్ వ్యూహం ఇదే !

KCR Plan : కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టేది తెలంగాణలో మూడో సారి గెలవడానికే.  -  అంచనాలకు అందని కేసీఆర్ వ్యూహం ఇదే !

Kishan Reddy: కొత్త పార్టీ ఏర్పాటు అందుకే, ప్రధాని అయినట్లు పగటి కలలు - కిషన్ రెడ్డి ఎద్దేవా

Kishan Reddy: కొత్త పార్టీ ఏర్పాటు అందుకే, ప్రధాని అయినట్లు పగటి కలలు - కిషన్ రెడ్డి ఎద్దేవా

Chinta Mohan: శశిథరూర్ దళిత వ్యతిరేకి, మల్లిఖార్జున ఖర్గేనే విజయం సాధిస్తారు: కాంగ్రెస్ మాజీ ఎంపీ

Chinta Mohan: శశిథరూర్ దళిత వ్యతిరేకి, మల్లిఖార్జున ఖర్గేనే విజయం సాధిస్తారు: కాంగ్రెస్ మాజీ ఎంపీ

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి