ధోనీని గుర్తు చేస్తున్న పంత్- ఆడేసుకుంటున్న నెటిజన్లు
Fans Recall MS Dhoni: శ్రీలంక- భారత్ మ్యాచ్‌లో పంత్ రనౌట్ మిస్ చేశాక.. ధోనీతో పంత్ ను పోల్చి నెటిజన్లు విమర్శిస్తున్నారు. అలానే మహీని గుర్తు చేస్తూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
Fans Recall MS Dhoni: అదేదో సినిమాలో త్రివిక్రమ్ రాసిన డైలాగ్ ఒకటుంటుంది. తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది అని. అలాగే మనుషులు కూడా. పలానా దానిపై వారు చూపించిన ప్రభావం.. వారు లేనప్పుడే తెలుస్తుంది. ఇప్పుడీ ఉపోద్ఘాతం అంతా ఎందుకనుకుంటున్నారా. అక్కడికే వస్తున్నాం.
రిషభ్ పంత్ అదేనండీ మన భారత జట్టు వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్. తను జట్టులోకి వచ్చినప్పుడే మహేంద్రసింగ్ ధోనితో పోలికలు మొదలైపోయాయి. ముఖ్యంగా కీపింగ్ లో ధోనితో పంత్ ను పోల్చి చూసేవాళ్లు ఎందరో ఉన్నారు. ధోని ఉన్నప్పుడు తన మెరుపు కీపింగ్ తో భారత్ కు ఎన్నో విజయాల్ని అందించాడు. కనురెప్ప పాటులో స్టంప్స్ ఎగరేయడం, మెరుపు వేగంతో రనౌట్ చేయడం ఇవన్నీ మనం చూశాం. అయితే ఇప్పుడు పంత్ ను చూస్తుంటే ధోని విలువ ఇంకా బాగా తెలుస్తుంది అంటూ ఎంఎస్డీ ఫ్యాన్స్ అంటున్నారు. ఇంతకీ ఇప్పుడు మహీ ఫ్యాన్స్ బాధేంటీ అనేగా మీ డౌటు.
2016 టీ20 ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ తో మ్యాచ్ గుర్తుందిగా. లాస్ట్ బాల్ కు బంగ్లా 2 రన్స్ కొట్టాలి. అయితే ధోనీ సూపర్ మైండ్ తో భారత్ విజయం సాధించింది. ఒక చేతి గ్లవ్ తీసి బాల్ చేతిలోకి రాగానే నాన్ స్ట్రయికర్ బ్యాట్స్ మెన్ కన్నా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి స్టంప్స్ ను గిరాటేశాడు. ధోనీ కీపింగ్ స్కిల్స్ కు అదొక మంచి ఉదాహరణగా మిగిలిపోయింది. సేమ్ అలాంటి పరిస్థితే నిన్న శ్రీలంకతో మ్యాచ్ ఆడుతుండగా వచ్చింది. లంక విజయానికి లాస్ట్ 2 బంతుల్లో 2 రన్స్ కావాలి. ఓవర్ లో ఐదో బంతిని అర్హదీప్ అద్భుతంగా బౌలింగ్ చేయగా.. బంతి పంత్ చేతిలో పడింది. మన పంత్ గ్లవ్ తీసి రెడీగా ఉన్నాడు కానీ.. పరిగెట్టుకుంటూ వెళ్లకుండా త్రో వేశాడు. అది వికెట్లకు తగల్లేదు. అర్హదీప్ ఆ బంతిని అందుకున్నా.. అతను వికెట్లను కొట్టలేకపోయాడు. దీంతో లంకకు బైస్ రూపంలో 2 పరుగులు వచ్చి విజయం సాధించింది.
ఈ ఒక్క కారణం వలనే మ్యాచ్ ఓడిపోయాం అనడంలేదు కానీ.. పంత్ ఆ త్రో విసరకుండా ఉన్నా.. లేదా పరిగెత్తుకుంటూ వెళ్లి రనౌట్ చేసినా ఫలితం మరోలా ఉండేదేమో. ఈ సిచ్యుయేషన్ లో మా ధోనీ ఉండుంటే కచ్చితంగా రనౌట్ చేసి ఉండేవాడని మహీ ఫ్యాన్స్ అంటున్నారు. కానీ అలా అనుకోవడం, ఆ ఫలితం ఆశించడం అత్యాశే అవుతుంది. ఎంత గొప్ప ఆటగాడైనా జీవితాంతం ఆడుతూ ఉండలేడుగా. అయితే నిన్న పంత్ ను చూసిన వాళ్లు ధోనీని గుర్తుతెచ్చుకోకుండా మాత్రం ఉండలేరు. అది మాత్రం నిజం.
🐐 @MSDhoni pic.twitter.com/sgomVs6jN3
— Dhoni Army TN™🦁 (@DhoniArmyTN) September 6, 2022
today i missed mahi more than my ex. 🥹😥 #INDvSL #Dhoni 🫶🏻 pic.twitter.com/I2QAJ3X7Ci
— k (@0x0kg) September 6, 2022
Miss You Thala @MSDhoni 🥺❤ pic.twitter.com/vzJbIbSPvk
— Dhoni Army KA™🦁 (@DhoniArmyKA) September 7, 2022
Missing Him 🥺
— Sahil Kumar (@sahilrollins84) September 7, 2022
.
.
.
.@msdhoni #MSDhoni #MSDhoni𓃵 #Dhoni #dhonifans
#mahi #TeamIndia #Cricket pic.twitter.com/KkfAzLmk5K