Archery World Cup 2024: ఆర్చరీ వరల్డ్‌కప్‌లో భారత్ సంచలనం, ఏకంగా 7 పతకాలు
Archery World Cup 2024: ఆర్చరీ ప్రపంచ కప్‌లో టీమ్‌ఇండియా హవా కొనసాగుతోంది. ఇప్పటికే హ్యాట్రిక్ గోల్డ్ పొందిన భారత జట్టు ఇప్పుడు మరో స్వర్ణాన్ని గెలిచి అదరగొట్టేసింది.
Archery World Cup 2024 India create History with 7 Medals: ఆర్చరీ వరల్డ్ కప్ 2024లో భారత్ మళ్లీ అద్భుతం చేసింది. షాంఘైలో జరుగుతున్న ప్రపంచకప్ స్టేజ్ 1లో భారత పురుషుల ఆర్చరీ జట్టు బంగారు పతాకాన్ని సాధించింది. ఇప్పటికే కాంపౌండ్ విభాగంలో మూడు, వ్యక్తిగత విభాగంలో ఒక స్వర్ణాన్ని గెలిచిన టీమ్‌ఇండియా మరో బంగారు పతకాన్ని ఖాతాలో వేసుకుంది.ఒలింపిక్ ఛాంపియన్ దక్షిణ కొరియాను ఓడించి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్‌తో కూడిన భారత జట్టు ఒలింపిక్ ఛాంపియన్ దక్షిణ కొరియాపై విజయం సాధించింది. రికర్వ్ విభాగంలో భారత్ 5-1 తేడాతో (57-57, 57-55, 55-53) దక్షిణ కొరియాను ఓడించింది. దీంతో భారత్ ఐదో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది.
భారత్‌కు పతకాల పంట
ప్రస్తుతం ఆర్చరీ వరల్డ్ కప్‌లో టీమ్‌ఇండియా ఏడు పతకాలను దక్కించుకుంది. ఇందులో ఐదు స్వర్ణాలు కాగా.. మరొకటి రజతం, ఇంకొకటి కాంస్యం. ఇక మహిళల వ్యక్తిగత రికర్వ్ సెమీఫైనల్లో దీపిక.. దక్షిణ కొరియాకు చెందిన ప్రత్యర్థిని ఢీకొట్టనుంది. ఇక మహిళల సింగిల్స్ సహా మహిళలు పురుషులు, మిక్స్ డ్ డబుల్స్ ఈవెంట్లలో బంగారు పతకాలతో మెరిసింది. షాంఘైలో జరుగుతున్న ఈ టోర్నీ మహిళల సింగిల్స్ లోతెలుగమ్మాయి జ్యోతి సురేఖ వెన్నం పసిడిని ఒడిసిపట్టింది. మెక్సికోకు చెందిన ఆండ్రియా బెకెర్రాతో జరిగిన మహిళల వ్యక్తిగత ఈవెంట్ లో జ్యోతిసురేఖహోరాహోరీ పోరాడి పసిడిని సాధించింది.