Ind vs Eng, 5th Test: గుడ్ న్యూస్.. యథాతథంగా 5వ టెస్ట్ మ్యాచ్, అందరికీ కొవిడ్ నెగటివ్
కరోనా మహమ్మారి వల్ల అసలు ఐదో టెస్టు మ్యాచ్ జరుగుతుందా లేదా అనే ఆందోళన మధ్య ఓ క్లారిటీ వచ్చింది. కరోనా పరీక్షల్లో అందరికీ కరోనా నెగటివ్‌గా నిర్ధారణ అయింది.
యూకేలోని మాంచెస్టర్‌లో భారత్-ఇంగ్లాండ్ 5వ టెస్ట్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి వల్ల అసలు ఐదో టెస్టు మ్యాచ్ జరుగుతుందా లేదా అనే ఆందోళన మధ్య ఓ క్లారిటీ వచ్చింది. మాంచెస్టర్‌లో జరిగే 5వ టెస్టు సందర్భంగా ఆటగాళ్లకు, వారి సిబ్బందికి తాజాగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అయితే, ఈ పరీక్షల్లో అందరికీ కరోనా నెగటివ్‌గా నిర్ధారణ అయింది.
గత వారం టీమిండియా చీఫ్ కోచ్ రవి శాస్త్రి సహా ఇద్దరు సహాయక సిబ్బందికి కరోనా వైరస్ సోకినట్లుగా గుర్తించిన సంగతి తెలిసిందే. రవి శాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ ఆర్ శ్రీధర్‌లకు కరోనా పాజిటివ్ అని తేలింది. అయినాసరే లండన్‌లోని ఓవల్‌లో జరిగిన నాలుగో టెస్టు కోసం భారత ఆటగాళ్లు మైదానంలోకి అడుగు పెట్టారు.
తాజాగా భారత క్రికెట్ జట్టు సహాయక సిబ్బందిలో ఫిజియోథెరపిస్టు యోగేష్ పర్మార్‌కు కరోనా సోకినట్టు తేలిన సంగతి తెలిసిందే. బుధవారం నిర్వహించిన కరోనా టెస్టుల్లో ఈ విషయం బయటపడింది. మొదటి టెస్టులో భారత ఆటగాళ్లు అందరూ కరోనా టెస్ట్ చేయించుకోగా నెగటివ్ రిపోర్టులు వచ్చాయి. మరో రౌండ్ కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించగా అందులో ఒకరికి పాజిటివ్ రావడం ఆందోళన కలిగించింది. అప్పటికే సోమవారం టీమిండియా 5వ టెస్టు మ్యాచ్ కోసం మాంచెస్టర్‌కు చేరుకుంది. మంగళవారం, బుధవారం ట్రైనింగ్ సెషన్ జరిగినప్పటికీ ఫైనల్ సెషన్ మాత్రం రద్దు అయింది. దీంతో 5వ టెస్టు జరుగుతుందా అనే అనుమానాలు వెల్లువెత్తాయి.
తాజాగా భారత జట్టు మొత్తానికి నిర్వహించిన ఆర్టీపీసీఆర్ కరోనా పరీక్షల్లో నెగటివ్‌గా తేలడంతో 5వ మ్యాచ్ జరిగేందుకు మార్గం సుగమం అయింది.
COVID-19: The Indian players have all received negative PCR results after physio Yogesh Parmar tested positive: BCCI source#ENGvIND
— ANI (@ANI) September 9, 2021