Zodiac Signs: ఈ ఐదు రాశులవారికి పెళ్లికన్నా సహజీవనమే ఇష్టమట, మీరున్నారా ఇందులో

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. ఈ రాశివారంతా ఇలాగే ఉంటారని కాదు...

FOLLOW US: 

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారు, రాసిపెట్టి ఉంటే తప్పదు అంటారు పెద్దలు. అయితే ప్రేమ, పెళ్లి ఇలాంటి విషయాలు కూడా మీ రాశులపై ఆధారపడి ఉంటుందంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. కొందరు ఎంచక్కా ప్రేమ వివాహం చేసుకుంటే, మరికొందరు పెద్దలు నిర్ణయించిన పెళ్లి చేసుకుంటారు..అయితే ఇంకొందరు మాత్రం పెళ్లి కన్నా సహజీవనంపైనే మక్కువ చూపిస్తారట. అలా అని వీళ్లు పూర్తిగా పెళ్లికి వ్యతిరేకం కాదు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే అన్నీ అనుకున్నట్టే అవుతాయా ఏంటని సర్ది చెప్పుకుని పెళ్లిచేసుకుంటారట. వాస్తవానికి వీళ్ల మనసు మాత్రం సల్పకాలిక సంబంధాలపైనే ఉంటుందంటారు జ్యోతిష్యశాస్త్ర పండితులు. ముఖ్యంగా ఈ ఐదు రాశులవారు ఈ కోవకు చెందుతారాని చెబుతారు. 

మేషం
దీర్ఘకాలకి సంబంధాలంటే మేష రాశివారికి చెడ్డ చిరాకట. తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో సంసార జీవితాన్ని భారంగా భావిస్తారట. భావోద్వేగాలు, సంబంధాల కన్నా ఏకాంతంగా ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. అదే సమయంలో స్వల్పకాలిక సంబంధాలపై ఆసక్తి చూపిస్తారో వారినే ప్రేమిస్తారన్నమాట. అంటే ఒకరిపై ప్రేమ శాశ్వతం కాదన్నది వీళ్ల ఫీలింగ్. ఆరెంజ్ లో రామ్ చరణ్ టైప్ అన్నమాట...

Also Read: 2022-2023లో ఈ రాశివారు ఆ ఒక్కటీ తప్ప అన్ని విషయాల్లోనూ మహారాజులే
మిథునం
ఈ రాశి వారు వ్యక్తిత్వం ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని తమ మనసు చెప్పినట్టే చేస్తారు కానీ ఎదుటి వారి ప్రభావం వీరిపై పెద్దగా ఉండదు. పక్కోళ్లు చెప్పారు కదా అని ఫాలోఅవరు..అంతెందుకు మెదడు చెప్పింది కూడా వినరు కేవలం మనసు చెప్పిన విషయాలనే పరిగణలోకి తీసుకుంటారు. వీరి అభిరుచులు, అలవాట్లు మారుతూ ఉంటాయ్. ఏ విషయంలో మనోహరంగా ఉంటారన్నది గ్యారంటీ ఉండదు. అందుకే సంక్లిష్టతలు లేని రొమాన్స్ తో నిండిన జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడతారు.

సింహం
అడవికి రాజు సింహంలా...వీరు కూడా తమ లైఫ్ కి తామే రారాజు. తమపై ఎవ్వరి ఆధిపత్యాన్ని అస్సలు సహించరు.తనను నమ్మిన భాగస్వామిపై మంచి ప్రేమ కురిపిస్తారు. కానీ ఈ రాశివారికి కూడా స్వల్పకాలిక సబంధాలు, సరదా కోసం రొమాన్స్ అంటే ఇష్టం. అందుకే పెళ్లికన్నా సహజీనవంపైనే ఎక్కువ ఆసక్తి ఉంటుంది.

ధనస్సు
ధనస్సు రాశివారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటుంటారు. వీరికి బంధం అంటే బంధిఖానాలా ఫీలవుతారు. అంటే ఒకరి చెప్పుచేతల్లో ఉండటం, వారికి నచ్చనట్టు నడుచుకోవాలనే ఫీలింగ్ అస్సలు నచ్చదు. తప్పని సరి పరిస్థితుల్లో భరిస్తారు కానీ రెక్కలు కట్టుకుని ఆ బంధాల నుంచి ఎగిరి స్వేచ్ఛగా ఉండాలనే తాపత్రయం ఉంటుంది. వీరు సంబంధాలు, నిబద్ధత అనే విషయాలు పెద్దగా పట్టించుకోరు. 

Also Read: శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది, మీరున్నారా అందులో
కుంభం
కుంభ రాశివారి వ్యక్తిత్వం ప్రత్యేకంగా ఉంటుంది. వీరికి కూడా కుటుంబ బంధాల్లో చిక్కుకుపోవడం ఇష్టం ఉండదు కానీ బాధ్యతల నుంచి పారిపోరు. తమ బాధ్యతను నెరవేరుస్తూనే తమ ఇష్టాయిష్టాలకు కూడా ప్రాధాన్యతను ఇచ్చుకుంటారు. రొటీన్ రొమాన్స్ అంటే వీళ్లగి పెద్దగా నచ్చదట. ప్రేమ, సంబంధాల విషయంలో వీరి అభిరుచులు వేరే ఉంటాయంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. 

కొన్ని పుస్తకాలు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పిన వివరాల ఆధారంగా రాసిన కథనం ఇది. దీన్ని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. మీ జన్మ నక్షత్రంలో గ్రహస్థితి ఆధారంగా కూడా మీ వ్యక్తిత్వంలో చాలా మార్పులుంటాయి....

Also Read:  2022-2023లో ఈ రాశివారి సక్సెస్ చూసి కొందరు సహించలేరు, ఆ రేంజ్ లో దూసుకెళతారు

Published at : 10 May 2022 06:47 PM (IST) Tags: Horoscope Today Pisces Horoscope Today 2022 Taurus Gemini Virgo Aries Aries Cancer Leo Libra live in relation Zodiac Signs Scorpio Sagittarius Capricorn Aquarius

సంబంధిత కథనాలు

Heavy Rush at Tirumala: తిరుమలకు వెళ్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు, కిలోమీటర్లు మేర క్యూలైన్లలో గోవిందా గోవిందా !

Heavy Rush at Tirumala: తిరుమలకు వెళ్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు, కిలోమీటర్లు మేర క్యూలైన్లలో గోవిందా గోవిందా !

Horoscope Today 29th May 2022: ఈ రోజు ఈ రాశివారు మాజీ ప్రియురాలు/ ప్రియుడిని కలుస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 29th May 2022:  ఈ రోజు ఈ రాశివారు మాజీ ప్రియురాలు/ ప్రియుడిని కలుస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Today Panchang 29 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం, శ్రీ సూర్య స్త్రోత్రం

Today Panchang 29 May 2022:  తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం, శ్రీ సూర్య స్త్రోత్రం

Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!

Tirumala News : తిరుమలకు పోటెత్తిన  భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!

Horoscope Today 28th May 2022: ఈ రాశులవారు తమ పనిని పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 28th May 2022:  ఈ రాశులవారు తమ పనిని  పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

టాప్ స్టోరీస్

IPL 2022, GT vs RR Final: బట్లర్‌ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్‌ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్‌ ఉన్నాడోచ్‌!

IPL 2022, GT vs RR Final: బట్లర్‌ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్‌ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్‌ ఉన్నాడోచ్‌!

TDPకి సరికొత్త నిర్వచనం చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి, నారా లోకేష్, మహానాడుపై సెటైర్లు

TDPకి సరికొత్త నిర్వచనం చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి, నారా లోకేష్, మహానాడుపై సెటైర్లు

Singeetham Srinivasarao: సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం!

Singeetham Srinivasarao: సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం!

IPL 2022, GT vs RR Final: లక్షా పదివేల మంది ఎదుట ట్రోఫీ ఎత్తేది ఎవరు? RRపై 2-0తో GTదే పైచేయి!

IPL 2022, GT vs RR Final: లక్షా పదివేల మంది ఎదుట ట్రోఫీ ఎత్తేది ఎవరు? RRపై 2-0తో GTదే పైచేయి!