అన్వేషించండి

Easter History: జీసస్‌కు సిలువ ఎందుకు వేశారు? దానిపై INRI అని ఎందుకు రాశారు? 3 రోజుల తర్వాత జరిగిన ఆ అద్భుతమే ‘ఈస్టర్’

Easter: శుక్రవారం గుడ్ ఫ్రైడే జరుపుకున్న మూడు రోజులకు ఈస్టర్ వస్తుంది. మరి, ఈ పండుగ ప్రత్యేకతలు ఏమిటీ? ఎందుకు జరుపుకుంటారు?

క్రైస్తవులు యేసు క్రీస్తు (ఏసు క్రీస్తు) సిలువపై మరణించిన రోజును గుడ్ ఫ్రైడేగా అంటే శుభ శుక్రవారంగా ప్రపంచమంతా జరుపుకుంటారు. ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావమంతమైన వ్యక్తిగా యేసు క్రీస్తును చరిత్ర గుర్తిస్తోంది. అందుకే కాలమానం కూడా క్రీస్తు పూర్వం, క్రీస్తు శకంగా విభజించబడింది. అలాంటి ప్రభావితమైన వ్యక్తిని ఎందుకు చంపారు. ఎవరు చంపారు. ఎలా చంపారు.. అనేది ఇప్పుడు చూద్దాం..

యేసు క్రీస్తు పుట్టు పూర్వోత్తరాలు...

యేసు క్రీస్తు  సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం ప్రస్తుత ఇజ్రాయేల్ దేశములోని బెత్లహెం అనే ఊరిలో  జోసెఫ్, మేరీలకు జన్మించారు. తన 30వ ఏట ఆయన యూదుల దేశమైన ఇజ్రాయేల్‌లో ఆధ్యాత్మిక బోధనలు చేశారు. ఆయన చేసిన బోధనల్లో ‘సర్మెన్ ఆఫ్ ది మౌంటేన్’ అత్యంత ప్రసిద్ధి చెందింది. క్రైస్తవుల యేసు క్రీస్తును దేవుని కుమారుడిగా  గుర్తిస్తారు. ఇలా తన ఆధ్యాత్మిక బోధనలు, అద్బుత కార్యాలు, చనిపోయిన వారిని లేపడం, రోగులను బాగు చేయడం వంటి  కార్యాలతో ఆయన  ఇజ్రాయేల్ దేశంలో ఓ  గొప్ప పేరును సంపాదించినట్లు బైబిల్‌లో మాధ్యూస్, లూక్, జాన్, మార్క్ గాస్పల్స్ లో రాశారు. ఎంతో మంది శిష్య గణంతో పాటు ప్రజల్లో అత్యంత పలుకుబడి ఉన్న వ్యక్తిగా యేసు క్రీస్తు ప్రాచుర్యం పొందారు.

యేసు క్రీస్తును ఎందుకు చంపారు?

ఆధ్యాత్మిక బోధనలతో పాటు.. ఆయన తనను దేవుడి కుమారుడిగా యేసు క్రీస్తు చెప్పడంతో అప్పటి యూదా మత పెద్దలకు కోపం తెప్పించింది. ఆ మత పెద్దల తీరును తన బోధనల ద్వారా ఖండించడం మరింత ఆగ్రహానికి గురిచేసింది. ఆ కాలంలో ఇజ్రాయెల్ దేశం రోమన్ల అధికారంలో ఉండేది. యూదా మతాచారాల జోలికి మాత్రం రోమన్లు వెళ్లే వారు కాదు. యూదులు రోమన్లకు పన్నులు కడుతూ యెరుషలేంలోని దేవాలయంలో తమ ప్రార్థనలు, పూజలు చేసేవారు. అలాంటి పరిస్థితుల్లో  యేసు క్రీస్తు బోధనలు, తాను దైవ కుమారుడిగా చెప్పుకోవడం యూదా మత పెద్దలున్న సన్ హెడ్రిన్ అనే సభకు నచ్చలేదు. దీంతో ఆయనపై దైవ దూషణ అనే నెపంతో ఆయన్ను సిలువ వేయించారు. 

అయితే ఈ కారణంతో చంపే అధికారం యూదులకు లేకపోవడంతో అప్పటి గవర్నర్ పొంటియస్ పిలాట్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఆయనపై మోపిన నేరం. తాను యూదులకు రాజు అని చెప్పుకుంటా ప్రజల్లో తిరుగుబాటు లేవదీస్తున్నారని ఆరోపించారు. ఇది రోమన్ ప్రభుత్వాన్ని కూలదోసే తిరుగుబాటుగా అభివర్ణించారు. ఆయన్ను సిలువ వేయాలని పిలాట్ ను డిమాండ్ చేశారు. అయితే ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు ఉన్న యేసు క్రీస్తును చంపడం ఇష్టం లేని పిలాట్ 39 కొరడా దెబ్బలు కొట్టి విడిచిపెట్టాలని ఆలోచించినా, యూదా మత పెద్దలు మాత్రం అందుకు అంగీకరించక సిలువ వేయమని ఒత్తిడి చేయడం తో పిలాట్ రోమన్ సైనికులకు యేసు క్రీస్తును సిలువ వేయమని ఆదేశించినట్లు చరిత్ర చెబుతోంది.

సిలువ ఎలా వేస్తారు?

సిలువ వేయడం అనే శిక్షను మొదట ఫోనిషియన్లు అమలు పరిచేవారు. ఆ తర్వాత కాల క్రమేణా పర్షియన్లు, గీసు దేశస్థులు, రోమన్లు అమలు పరిచారు. సిలువ శిక్ష అనేది ఆనాడు అత్యంత అవమానకరమైన శిక్షగా గుర్తింపు పొందింది. సిలువ శిక్ష పడిన వ్యక్తి వెంటనే చనిపోకుండా తీవ్రమైన బాధతో చనిపోయే ప్రక్రియ. కేవలం బానిసలకు, తిరుగుబాటు దారులకు అత్యంత క్రూరమైన నేరాలకు పాల్పిడిన వారికి మాత్రమే ఈ శిక్షను విధించేవారు. సిలువపై కొన్ని రోజులు లేదా గంటల పాటు ఆహారం, నీరు లేకుండా క్రుంగి, కృశించి చనిపోతారు. పక్షులు ఆ వేలాడే శరీరాన్ని తిని వేస్తాయి. ఈ శిక్ష అనేది తప్పు చేసే వారికి భయంకరమైన సందేశంగా రోమన్లు ఆనాడు వేసేవారని చరిత్ర చెబుతోంది.

యేసు క్రీస్తును ఎలా సిలువ వేశారు.

యేసు క్రీస్తును సిలువ వేయక ముందు నేరారోపణను బట్టి యూదుల సంప్రదాయం ప్రకారం 39 కొరడా దెబ్బలు కొట్టారు. మేకులతోను, పదునైన ఎముకలు ఆ కొరడాలకు ఉండేవి. అలా కొట్టి తీసిన తర్వాత దెబ్బలు తిన్న వ్యక్తి చర్మం, మాంసం ముద్దగా ఊడి వస్తుంది. అలా కొరడా దెబ్బలకే చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత ఆయన్ను చేతులతో కొట్టినట్లు, కర్రతో కొట్టినట్లు బైబిల్ లో మార్క్, జాన్, మాధ్యూస్, లూక్ గాస్పల్స్ చెబుతున్నాయి. బైబిల్ తో పాటు అప్పటి చరిత్ర పుస్తకాలను బట్టి  పదునైన ముళ్లతో కిరీటంలా తయారు చేసి దాన్ని యేసు క్రీస్తు తలపై పెట్టి కర్రతో కొట్టారు. ఆ తర్వాత యేరుషలేం వీధుల్లో ఆయన్ను కొరడాతో కొడుతూ రోమన్ సైనికులు గొల్గతా అనే కొండ పైకి తీసుకెళ్లారు. 

మార్గం మధ్యలో మూడు సార్లు యేసు క్రీస్తు సిలువను మోస్తూ కింద పడిపోయారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పండితుల అధ్యయనం ప్రకారం సిలువ బరువు 150 కేజీలు ఉంటుంది. పొడవు 15 అడుగులు, వెడల్పు 8 అడుగులు, యేసు క్రీస్తు చేతులకు కొట్టిన మేకులు మందం 3/4 ఇంచులు, పొడవు 8 ఇంచులు ఉండవచ్చని అంచనా వేశారు. అంతే కాకుండా యేసు క్రీస్తు ఎలా ఉండేవారన్న దానిపైన కొంత మేర ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పండితులు అంచనా వేసి చెప్పారు. వారి అధ్యయనం ప్రకారం యేసుక్రీస్తు ఎత్తు సుమారు 5 అడుగుల 11 ఇంచులు ఉండే వారు. బరువు సుమారు 85 కేజీలు ఉండే వారని చెప్పారు. సిలువపై యేసు క్రీస్తు దాదాపు నీరు లేకుండా 17 గంటలు బాధపడ్డారు. సిలువపై ఉండి నీరు అడిగితే రోమన్ సైనికులు బాధను మర్చిపోయే చేదు మత్తు మందు కలిపిన నీటిని ఇచ్చారు. అయితే అది తాగేందుకు యేసుక్రీస్తు నిరాకరించినట్లు బైబిల్ చెబుతోంది. ఆయన శరీరంలో మొత్తం 5480 గాయాలు అయినట్లు పండితులు గుర్తించారు. వీపు వెనుక బాగంలో 150 బలమైన గాయాలు అయ్యాయి. ముండ్ల కిరీటం వల్ల తలపై 17 గాయాలు అయినట్లు ఆక్స్ ఫర్డ్ పండితులు చెప్పారు. సిలువ పై దాదాపు తన శరీరంలోని 6.5 లీటర్ల రక్తం కోల్పోయారు. ఉదయం 9 గంటలకు సిలువ మోయడం ద్వారా ప్రారంభమైన శిక్ష మధ్యాహ్నం 3 గంటలకు ఆయన ప్రాణం కోల్పోవడం ద్వారా ముగిసింది.

యేసు క్రీస్తు సిలువ ఫోటోలో ఉండే I.N.R.I అనే బోర్డుకు అర్థం ఏంటి..

రోమన్ శిక్షల ప్రకారం సిలువవేసిన వారి నేరం ఏంటో తెలియజెప్పేలా సిలువ మీద నేరారోపణ కారణాలను చెబుతూ బోర్డు పెడతారు. యేసుక్రీస్తును ఎందుకు సిలువవేసారు అన్న విషయాన్ని వివరిస్తూ శిక్ష విధించిన రోమా గవర్నర్ పొంటియస్ పిలాట్ కూడా సిలువపై బోర్డు పెట్టారు. ఐ.ఎన్.ఐర్.ఐ అని షార్ట్ ఫాంలో మనం చూసే ఫోటోలు ఉంటుంది. కాని లాటిన్ బాషలో...
I = IESUS*
N = NAZARENUS*
R = REX*
I = IVDAEORUM అని అర్థం. అంటే  నజరేయుడైన యేసు యూదులకు రాజు అని అర్థం. నజరేతులో యేసు క్రీస్తు పుట్టిన పెరిగిన ఊరు కావడంతో ఆయన ఊరి పేరును కూడా బోర్డులో కనపడేలా.. ఆయన యూదులకు రాజు అని చెప్పుకున్న కారణంతో సిలువ శిక్ష వేసినట్లు రాయించారు. అయితే ఈ సిలువపై మూడు భాషల్లో గ్రీకు, లాటిన్, హీబ్రూ బాషల్లో ఇదే అర్థంతో రాయించారు.

యేసు క్రీస్తు మూడో రోజున తిరిగి లేచారా?

యేసు క్రీస్తు సిలువపై మరణించిన తర్వాత మూడో రోజు సజీవుడై లేచాడని క్రైస్తవుల విశ్వాసం. అయితే ఆయన వ్యతిరేకులు మాత్రం దీన్ని కొట్టి పారేస్తారు. బైబిల్ లోని నాలుగు గాస్పల్స్ యేసు క్రీస్తు తిరిగి లేచాడని చాలా మందికి కనిపించారని, ఆ తర్వాత ఆయన పరలోకం వెళ్లిపోయారని రాశారు. అదే సువార్తల్లో అప్పటి మత పెద్దలు యేసు క్రీస్తు సజీవుడుగా లేడని, ఆయన శవాన్ని శిష్యులే ఎత్తికెళ్లి కనపించకుండా చేసి, ఆయన తిరిగి లేచాడని ప్రచారం చేసినట్లుగా యేసు క్రీస్తు సమాధికి కాపలా ఉన్న సైనికులతో ప్రచారం చేయించారని రాశారు. ఇక ముస్లింలు పవిత్రంగా చదివే ఖురాన్ లో యేసు క్రీస్తు.. ఆయన సిలువపై మరణించలేదని... దేవుడు ఆయన్ను సిలువ నుంచి తప్పించారని, క్రీస్తును పోలిన మరో వ్యక్తిని సమాధి చేశారని రాశారు. సిలువ మీద నుండే ఆయన పరలోకంకు వెళ్లారని ఖురాన్ చెబుతోంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు మాత్రం యేసు క్రీస్తు  సిలువ వేసిన తర్వాత మూడో దినం తిరిగి లేచారన్న నమ్మకంతో శుక్రవారాన్ని శుభ శుక్రవారంగా జరుపుకుంటే, ఆయన తిరిగి లేచిన ఆదివారంను ఈస్టర్ గా జరుపుకుంటారు. మృత్యువుపై విజయంగా ఈస్టర్ ను జరుపుకోవడం క్రైస్తవుల ఆచారం.

Also Read: గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే సండే ఈస్టర్ - శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఎమ్మెల్సీలుగా సి. రామచంద్రయ్య, హరి ప్రసాద్ ఏకగ్రీవం
ఎమ్మెల్సీలుగా సి. రామచంద్రయ్య, హరి ప్రసాద్ ఏకగ్రీవం
UK Elections 2024: యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తులు ఓటమి - భారత సంతతి అభ్యర్థుల పరిస్థితి ఏంటంటే?
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తులు ఓటమి - భారత సంతతి అభ్యర్థుల పరిస్థితి ఏంటంటే?
Electric Cars Sale Declined: భారీగా పడిపోయిన ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ - కారణం ఏంటి?
భారీగా పడిపోయిన ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ - కారణం ఏంటి?
Anasuya Bharadwaj: అనసూయకు లవ్ లెటర్ రాసేశాడు, ఎవరో తెలుసా? - ఆ ముద్దులు వద్దంటోన్న శేఖర్ మాస్టర్
అనసూయకు లవ్ లెటర్ రాసేశాడు, ఎవరో తెలుసా? - ఆ ముద్దులు వద్దంటోన్న శేఖర్ మాస్టర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Virat Kohli Emotional Speech About Jasprit Bumrah | బుమ్రా ఈ దేశపు ఆస్తి అంటున్న కోహ్లీ | ABP DesamVirat Kohli Emotional About Rohit Sharma |15 ఏళ్లలో రోహిత్ శర్మను అలా చూడలేదంటున్న విరాట్ కోహ్లీJagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఎమ్మెల్సీలుగా సి. రామచంద్రయ్య, హరి ప్రసాద్ ఏకగ్రీవం
ఎమ్మెల్సీలుగా సి. రామచంద్రయ్య, హరి ప్రసాద్ ఏకగ్రీవం
UK Elections 2024: యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తులు ఓటమి - భారత సంతతి అభ్యర్థుల పరిస్థితి ఏంటంటే?
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తులు ఓటమి - భారత సంతతి అభ్యర్థుల పరిస్థితి ఏంటంటే?
Electric Cars Sale Declined: భారీగా పడిపోయిన ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ - కారణం ఏంటి?
భారీగా పడిపోయిన ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ - కారణం ఏంటి?
Anasuya Bharadwaj: అనసూయకు లవ్ లెటర్ రాసేశాడు, ఎవరో తెలుసా? - ఆ ముద్దులు వద్దంటోన్న శేఖర్ మాస్టర్
అనసూయకు లవ్ లెటర్ రాసేశాడు, ఎవరో తెలుసా? - ఆ ముద్దులు వద్దంటోన్న శేఖర్ మాస్టర్
Viral News: నిద్రపోతుండగా కాటు వేసిన పాము, కసి తీరా కొరికి చంపిన బాధితుడు
నిద్రపోతుండగా కాటు వేసిన పాము, కసి తీరా కొరికి చంపిన బాధితుడు
Telangana Politics: తెలంగాణ శాసన మండలికి రద్దు ముప్పు, చంద్రబాబును రేవంత్ సాయం కోరాలన్న బీఆర్ఎస్
తెలంగాణ శాసన మండలికి రద్దు ముప్పు, చంద్రబాబును రేవంత్ సాయం కోరాలన్న బీఆర్ఎస్
Motorola Razr 50 Ultra: ఫ్లిప్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - ధర ఎంతో తెలుసా?
ఫ్లిప్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - ధర ఎంతో తెలుసా?
Raj Tarun Comments: లావణ్యకు మరో వ్యక్తితో ఎఫైర్‌ ఉంది - ఆమె చెప్పేవన్ని అబద్ధాలు, ప్రియురాలిపై రాజ్ తరుణ్ సంచలన ఆరోపణలు
లావణ్యకు మరో వ్యక్తితో ఎఫైర్‌ ఉంది - ఆమె చెప్పేవన్ని అబద్ధాలు, ప్రియురాలిపై రాజ్ తరుణ్ సంచలన ఆరోపణలు
Embed widget