అన్వేషించండి

అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలా? దానం చెయ్యాలా?

అక్షయ తృతీయ రోజున ప్రతి నిమిషం శుభ ముహూర్తమే. ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా దాని ఫలం అక్షయంగా ఉంటుందని నమ్మకం.

దేశవ్యాప్తంగా హిందువులు, జైనులు జరుపుకునే పండుగ అక్షయ తృతీయ. ఈ ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ 22 న జరుపుకుంటున్నారు. ఉగాది, విజయదశమి తర్వాత ముహూర్త ప్రస్తావన లేకుండా కొత్తపనులు ప్రారంభించుకోవడానికి ఈరోజు కూడా మంచిది. సంవత్సరంలో ఈ ఉగాది, విజయదశమి, అక్షయ తృతీయ ఎలాంటి దుష్ప్రభావాలు లేని రోజులుగా నమ్ముతారు. ఏ పనులైనా ఈ పవిత్రమైన రోజుల్లో మొదలుపెట్టకోవచ్చు. వైశాఖ మాసంలోని శుక్ల పక్ష తృతీయను అక్షయ తృతీయగ జరుపుకుంటారు.

ఏం చేసినా అక్షయమే

అక్షయ తృతీయ రోజున బంగారం, వెండిని కొంటారు. ఇది శుభప్రదమని ఇంటికి లక్ష్మిని ఆహ్వానించడం అని కూడా నమ్ముతారు. లక్ష్మి దేవి ప్రతీకలుగా భావించి కొందరు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, యంత్రాలు కూడా కొనుగోలు చేస్తారు. ఈరోజు ఏ పనిచేస్తే ఆపని ఆ ఏడాదంతా చేస్తుంటారని ఒక నమ్మకం. అందువల్ల చాలామంది వ్యక్తులు ఆస్తి కొంటుంటారు. మరి కొంత మంది స్టాక్స్ లో కూడా పెట్టబడి పెడతారు.

అక్షయ తృతీయ నాడు చేసే వేడుకల గురించి రకరకాల పురాణాల్లో ప్రస్తావన ఉంది. పాండవులు అరణ్య వాసంలో ఉన్నపుడు శ్రీకృష్ణుడు వారిని సందర్శించేందకు వెళ్లాడని ఆ సమయంలో ఆయనకు ఆతిథ్యం ఇవ్వలేక ద్రౌపది ఇబ్బంది పడిందని అప్పుడు ఆయన ఆమెను ఓదార్చి వరంగా అక్షయపాత్ర అందించాడని, అందులో ఏది వేసినా అది తరిగిపోని దివ్యమైన పాత్ర. అందువల్ల ఈ రోజున కొనుగోలు చేసింది పెరుగుతూనే ఉంటుందని నమ్మకం.

మరో పురాణ కథ కూడా ప్రాచూర్యంలో ఉంది. ఈ రోజునే కుబేరుడు స్వర్గంలో సంపదకు సంబంధించిన బాధ్యతలు స్వీకరించిన రోజుగా కూడ చెబుతారు. ఈ రోజున కుబేరుని పూజించడం, బంగారం కొనుగోలు చెయ్యడం వల్ల శాంతి, సమృద్ది కలుగుతుందని కూడా నమ్ముతారు.

ఈరోజున చేసే దాన ధర్మాలతో మంచి ఫలితం లభిస్తుంది. దీన్ని కృతయుగారంభానికి సూచనగా కూడా జరుపుకుంటారని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణ, సుధాముల స్నేహానికి గుర్తుగా కూడా ఈ పండుగ జరుపుకుంటారు. వారి స్నేహానికి ఫలితంగా సుధాముడు అక్షయమైన సంపదలు పొందిన రోజుగా చెప్పుకుంటారు. లక్ష్మీ దేవి నారాయణుడిని వరించిన రోజుగా కూడా చెప్పుకుంటారు.

ఆదిశంకరుడు కనకధారాస్తవం రచించిన రోజు కూడా అక్షయ తృతీయే కావడం విశేషం. పూరి పుణ్య క్షేత్రంలో జగన్నాథుని రథ యాత్రకు ఉపయోగించే రథం తయారీ మొదలు పెట్టె రోజు కూడా అక్షయ తృతీయ. సింహాద్రిలో నారసింహుడి నిజరూప దర్శనానికి అనుమతి ఉంటుంది. చందనోత్సవం కూడా జరిగేది ఈ రోజే.

నిజంగా ఈరోజు బంగారం కొనాలా?

తమ శక్తికొలది బంగారం కొని దాన్ని పూజించి దానం చెయ్యాలని శాస్త్రం చెబుతోంది. పూజ వరకు అందరూ చేస్తారు. కానీ దానం గురించి ఎవరూ పట్టించుకోరు. ఈరోజున చేసే అన్నదానానికి చాలా మంచి ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతోంది. ఈరోజున నువ్వులు, మంచం, పరుపు, బట్టలు, కుంకుమ, గంథం, కొబ్బరికాయ, మజ్జిగ దానం చేస్తే ఇంట్లో సంపద వృద్ధి చెందుతుందని పండితులు చెబుతున్నారు. రాగి లేదా వెండి పాత్రలో నీళ్లు పోసి తులసీ దళాలు వేసి.. దానం చేస్తే ఇంట్లో పెళ్లి కానీ వారుంటే పెళ్లి అవుతుందని కూడా నమ్మకం. ఈరోజున చెప్పులు దానం చేస్తే మోక్షం లభిస్తుందని కూడా కొన్ని పురాణాలు చెబుతున్నాయి.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు. 

Also Read: గంగా పుష్కరాలకు కాశీ వెళుతున్నారా - టెంట్ సిటీలో రూమ్స్ ఇలా బుక్ చేసుకోండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget