అన్వేషించండి

Dakshinamurthy: ఇంట్లో దక్షిణామూర్తి ఫొటో ముందు 10 నిమిషాలు కూర్చోండి! మీ జీవితంలో ఊహించని మార్పులు!

నిత్యం ఇంట్లో ప్రత్యేకంగా పూజలు చేసే సమయం, అవకాశం లేనివారు ఈ ఒక్క ఫొటో అయినా ఇంట్లో పెట్టుకుని కనీసం రోజుకి 10 నిముషాలు ఈ స్తోత్తాన్ని పఠిస్తే చాలంటారు ఆధ్యాత్మికవేత్తలు

ఇంట్లో దక్షిణామూర్తి ఫొటో పెట్టుకుని రోజూ 10 నిముషాల పాటూ ఆ ఫొటో ముందు ప్రశాంతంగా కూర్చుంటే చాలు..ఆ ఫలితాన్ని మీరు ఊహించలేరని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. దక్షిణామూర్తి  స్తోత్రంకానీ, మంత్రాన్ని కానీ పఠిస్తే అపమృత్యు దోషం తొలగిపోతుంది, మేధా శక్తి పెరుగుతుంది, ధారణ, స్పష్టత కలుగుతాయి. కేవలం విద్యార్ధులకు మాత్రమే కాదు అన్ని వయసుల వారికీ ఇది వర్తిస్తుంది. దక్షిణామూర్తిని పూజిస్తే మంచి ఆలోచనలు కలుగుతాయి, సత్వగుణం వృద్ధి చెందుతుంది, ప్రారబ్ధ కర్మల ప్రభావం తగ్గుతుంది. ఇంట్లో సుఖ సంతోషాలుంటాయి. ఈ స్త్రోత్రం లేదా మంత్రాన్ని చదవడం రాకుంటే  శ్రీ దక్షిణామూర్తి చిత్రపటం ముందు ప్రశాంతంగా కూర్చుని ఆ పేరుని స్మరించినా స్వామి అనుగ్రహం ఉంటుంది. ఈ జన్మలోనే కాదు రాబోయే జన్మల్లోనూ దక్షిణామూర్తి అనుగ్రహం వలన మంచి విద్య వస్తుంది. మీకు ఉండే సమయాన్ని బట్టి  108 సార్లు లేదా 1008 సార్లు దక్షిణామూర్తి  జపం చేయవచ్చు. మంత్రం అయినా పూజ అయినా భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో చేయాలి. ఫలితం కోసం యాంత్రికంగా చేయకూడదు.  

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం ఇక్కడుంది చదువుకోండి..

 
శ్రీ దక్షిణామూర్తి స్తోత్రము......

శాంతిపాఠః
ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం
యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై |
తంహదేవమాత్మ బుద్ధిప్రకాశం
ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ||

ధ్యానమ్
ఓం మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వంయువానం
వర్శిష్ఠాంతేవసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః |
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ||

వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం
సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ |
త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం
జననమరణదుఃఖచ్ఛేద దక్షం నమామి ||

చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువా |
గురోస్తు మౌనవ్యాఖ్యానం శిష్యాస్తుచ్ఛిన్నసంశయాః ||

ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే |
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః ||

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ||

నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణామ్ |
గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః ||

చిదోఘనాయ మహేశాయ వటమూలనివాసినే |
సచ్చిదానంద రూపాయ దక్షిణామూర్తయే నమః ||

ఈశ్వరో గురురాత్మేతి మూత్రిభేద విభాగినే |
వ్యోమవద్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః ||

అంగుష్థతర్జనీయోగముద్రా వ్యాజేనయోగినామ్ |
శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్యోగతా శివః ||

ఓం శాంతిః శాంతిః శాంతిః ||

విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయా |
యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం
తస్మై శ్రీ గురుమూర్తయే నమఇదం శ్రీదక్షిణామూర్తయే || 1 ||

బీజస్యాంతతి వాంకురో జగదితం ప్రాఙ్నర్వికల్పం పునః
మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతం |
మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా
స్మై శ్రీ గురుమూర్తయే నమఇదం శ్రీదక్షిణామూర్తయే || 2 ||

యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే
సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ |
యస్సాక్షాత్కరణాద్భవేన్న పురనావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 3 ||

నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం
జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే |
జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్
స్మై శ్రీ గురుమూర్తయే నమఇదం శ్రీదక్షిణామూర్తయే || 4 ||

దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః
స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః |
మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 5 ||

రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోప సంహరణతో యోఽభూత్సుషుప్తః పుమాన్ |
ప్రాగస్వాప్సమితి ప్రభోదసమయే యః ప్రత్యభిజ్ఞాయతే
స్మై శ్రీ గురుమూర్తయే నమఇదం శ్రీదక్షిణామూర్తయే || 6 ||

బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తా స్వను వర్తమాన మహమిత్యంతః స్ఫురంతం సదా |
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే|| 7 ||

విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః
శిష్యచార్యతయా తథైవ పితృ పుత్రాద్యాత్మనా భేదతః |
స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయా పరిభ్రామితః
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 8 ||

భూరంభాంస్యనలోఽనిలోఽంబర మహర్నాథో హిమాంశుః పుమాన్
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్ |
నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభో
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 9 ||

సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్వ శ్రవణాత్తదర్థ మననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్ |
సర్వాత్మత్వమహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః
సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్ || 10 ||

|| ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం దక్షిణాముర్తిస్తోత్రం సంపూర్ణమ్ |

 గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించినది మాత్రమే. ఇక్కడ ABP దేశం ఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఆచరించే ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి. 

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Advertisement

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
Mana Shankara Vara Prasad Garu Trailer: ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
Soldier Suicide: కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
Embed widget