News
News
X

Kali Yuga:కలియుగాంతం ఎప్పుడంటే….! ఏ యుగంలో ఎన్ని సంవత్సరాలు?

వేదాలను అనుసరించి యుగాలు మొత్తం నాలుగు. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఒక్కో యుగాన్ని ఎవరు పాలించారు...వాటి కాపరిమితి ఎంత...ఏ యుగంలో సంతోషంగా ఉన్నారు?

FOLLOW US: 
Share:

మొదటి యుగంలో ధర్మం నాలుగుపాదాలపై నడిస్తే..రెండో యుగంలో మూడు పాదాలపై....మూడో యుగంలో రెండు పాదాలపై నడిచింది. ఇక ప్రస్తుతం నడుస్తోన్న కలియుగంలో ధర్మం, మంచి అనే మాటలకు చోటే లేదు. ఇంతకీ ఏ యుగం ఎలా సాగిందో చూద్దాం...

నాలుగు యుగాల్లో మొదటిది సత్యయుగం . దీన్నే కృతయుగం అని కూడా అంటారు.  ఈ యుగంలో భగవంతుడు నారాయణుడు, లక్ష్మీ సహితంగా భూమిని పరిపాలించాడు. దీని కాల పరిమాణం 17 లక్షల 28 వేల సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం నాలుగుపాదాల మీద నడిచిందని శివపూరాణం చెబుతోంది.

ప్రజలు ఎలాంటి ఈతిబాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉన్నారు. అకాల మరణాల మాటేలేదు. కృత యుగానిరి రాజు సూర్యుడు, మంత్రి గురువు అంటే బృహస్పతి. గురువు బంగారానికి అధిపతి కావున ఎక్కడ చూసినా బంగారు మయంగా ఉండేది. ప్రభువు-ప్రజల మధ్య ఎలాంటి విభేదం, విరోధం లేకుండా కాలం చక్కగా నడిచింది. సూర్య ప్రభావంతో సుక్షత్రియులు, గురు ప్రభావంతో సద్బ్రాహ్మణులు జన్మించి ధర్మమైన పాలన నడిచింది. సత్యయుగం వైవశ్వత మన్వంతరంలో కార్తీక శుద్ధ నవమి రోజు ప్రారంభమైంది.

త్రేతాయుగంలో భగవంతుడు శ్రీ రామచంద్రుడుగా అవతరించి రావణాసురుణ్ణి సంహరించి ధర్మ సంస్థాపన చేసాడు. ఈ యుగం పరిమితి 12 లక్షల96 వేల సంవత్సరాలు.  ఈ యుగంలో ధర్మం మూడు పాదాలపై నడిచింది.

త్రేతాయుగంలో రాజుగా కుజుడు, మంత్రిగా శుక్రుడు ఉన్నారు. కుజుడు యువకుడు, యుద్ధప్రియుడు, సుక్షిత్రుయుడు, బాహుబల పరాక్రమవంతుడు, రాజుగా ఆచారాలకు కట్టుబడి ఉండకుండా తిరిగేవాడు. రాక్షస గురువైన శుక్రాచార్యుడు స్త్రీ కారకుడు మాయ మంత్ర తంత్రవాది, కుజుడుకి పరమ శత్రువు. రాజుమాటకి మంత్రి మాటకి పడకపోవడం వల్ల మంత్రులు క్రూర స్వభావులై రాజ్యపాలనను బ్రష్టు పట్టించారు. స్త్రీ వ్యామోహంతో కలహాలు పెంచి దైవకార్యాలు నిర్వహించే వంశాలను అంతరరించేలా చేశారు. ఇలా రాక్షసులు, దుర్మార్గుల వలన త్రేతాయుగంలో ధర్మం ఒకభాగం దెబ్బతిని మూడుపాదాలపై నడిచిందంది. 
 ఈ యుగము వైశాఖ శుద్ధ తదియ రోజు ప్రారంభమైంది.

మూడో యుగం ద్వాపర యుగం. శ్రీ మహావిష్ణువు శ్రీ కృష్ణుడుగా అవతరించాడు. దీని కాల పరిమాణం 8 లక్షల 64 వేల సంవత్సరాలు.  ద్వాపర యుగంలో రాజుగా చంద్రుడు, మంత్రిగా బుధుడు ఉన్నారు.  చంద్రుడిది గురు వర్గం....బుధుడిది శనివర్గం. అందుకే వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు.  బుధుడు చెడు విద్యలను రాక్షసులకు , దుర్మార్గులకు ఇఛ్చి సాధువులు, సజ్జనులు, స్త్రీలకు అపకారం చేయమని పురికొల్పుతాడు. దేవతా కార్యాలను సగానికి సగం నశింపచేసి... రాజులకు బ్రాహ్మణులకు భావ విభేదం కల్పిస్తాడు. చంద్రుడు సకలవిద్యా పారంగతుడు. రాజులను విద్యా పారంగతులను చేసి..ధనుర్విద్యలు నేర్పించి... దుష్టులను-మాయావులను నాశనం చేయడానికి సహకరిస్తాడు. ఈ విధంగా ద్వాపర యుగంలో ధర్మం రెండు భాగాలు నశించి కలియుగం ప్రారంభమవుతుంది. నాలుగోది కలియుగం. దీని కాలపరిమితి 4 లక్షల 32 వేల సంవత్సరాలు. అందులో సుమారుగా ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయినాయి. హిందూ , బౌద్ధ కాలమానములకు ఆధార గ్రంధమైన సూర్య సిద్ధాంతం ప్రకారం పూర్వ శఖము 3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైంది. కృష్ణుడు సరిగ్గా అదే సమయానికి అవతారమును చాలించాడని భావిస్తారు. 

కలియుగానికి రాజు శని...మంత్రులు రాహు-కేతువులు. మంత్రులిద్దరికీ ఒకరకంటే ఒకరికి పడదు. రాహువు శనికి మిత్రుడు. కలియుగం ఆరంభంలో నాలుగు ధర్మ శాస్త్రాలు...వాటిని రక్షించే బ్రాహ్మణులను, అగ్రహారాలను , రాజులను నశింపచేస్తూ వచ్చారు. అప్పటి నుంచి క్రూరత్వం, అసత్యం, అప్రమాణం, అధర్మం, అన్యాయం తలెత్తాయి. ఈ యుగంలో వావి-వరుసలు తప్పి, వర్ణ సంకరములు మొదలై దొరలే దొంగలవుతారు. దైవభక్తి తగ్గి హింసా సిద్ధాంతాలు పెరుగుతాయి. పాపం వల్ల దుంఖం అనుభవిస్తాం అనే భయంపోయి... స్త్రీని, ధనాన్ని పొందినవాడే గొప్పవాడని అనుకునే రోజులొస్తాయి. అధర్మం పెరుగుతుంది, వర్ణద్వేషాలు, మత విద్వేషాలు పెరుగుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే కలియుగంలో మంచి అనే మాటకి చోటు లేకుండా అధర్మానికే మొగ్గు చూపుతారు. కలియుగాంతంలో కల్కి రూపంలో భగవంతుడు అవతరించి తిరిగి సత్య యుగ స్థాపనకు మార్గం సుగమం చేస్తాడని శివపురాణం చెబుతోంది.

Published at : 28 Jul 2021 11:07 AM (IST) Tags: When did Kali Yuga Completed? Times of all Yugas satya yuga tretayuga dwaparayuga kaliyuga

సంబంధిత కథనాలు

Horoscope Today 31st January 2023: ఈ రాశివారు సవాళ్లను కూడా అనుకూలంగా మలుచుకుంటారు, జనవరి 31 రాశిఫలాలు

Horoscope Today 31st January 2023: ఈ రాశివారు సవాళ్లను కూడా అనుకూలంగా మలుచుకుంటారు, జనవరి 31 రాశిఫలాలు

Horoscope Today 30th January 2023: రాబోయే రోజుల్లో ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది, జనవరి 30 రాశిఫలాలు

Horoscope Today 30th January 2023:  రాబోయే రోజుల్లో ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది, జనవరి 30 రాశిఫలాలు

Bhishma Pratigya Mahabharat: భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏంటి - ఇంతకీ భీష్ముడు ఏం సందర్భంలో ఏమని ప్రతిజ్ఞ చేశాడు!

Bhishma Pratigya Mahabharat: భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏంటి - ఇంతకీ భీష్ముడు ఏం సందర్భంలో ఏమని ప్రతిజ్ఞ చేశాడు!

Bhishma Ashtami 2023:అందరూ కృష్ణుడిని తలుచుకుంటే కృష్ణుడు ఎవర్ని స్మరించాడో తెలుసా!

Bhishma Ashtami 2023:అందరూ కృష్ణుడిని తలుచుకుంటే కృష్ణుడు ఎవర్ని స్మరించాడో తెలుసా!

Srimad Bhagavatam:పెళ్లి ఆలస్యం అయ్యే అమ్మాయిలు రుక్మిణీ కళ్యాణం - మరి పెళ్లికాని అబ్బాయిలు ఏం చదవాలంటే!

Srimad Bhagavatam:పెళ్లి ఆలస్యం అయ్యే అమ్మాయిలు రుక్మిణీ కళ్యాణం - మరి పెళ్లికాని అబ్బాయిలు ఏం చదవాలంటే!

టాప్ స్టోరీస్

Amar Raja Fire Accident: చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు

Amar Raja Fire Accident: చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు

Minister KTR Tour : రేపు కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ టూర్, ప్రతిపక్ష పార్టీల నేతల అరెస్టులు!

Minister KTR Tour : రేపు కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ టూర్, ప్రతిపక్ష పార్టీల నేతల అరెస్టులు!

Vizag Steel Plant: ఆ ప్రధానుల మెడలు వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం: మంత్రి అమర్నాథ్

Vizag Steel Plant: ఆ ప్రధానుల మెడలు వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం: మంత్రి అమర్నాథ్

Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్‌లో నాని ఏమన్నాడంటే?

Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్‌లో నాని ఏమన్నాడంటే?