వామ్మో, మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా? అవి మరణానికి సంకేతాలు
ఈ కలలు చాలా విషయాలు చెబుతుంటాయి. వాటి అర్థాలు కొన్ని సార్లు అర్థమవుతాయి. కానీ చాలా సార్లు అర్థం కావు. ఇలా నిద్రలో మనం చూసే కలకు మన జీవితానికి సంబంధం ఉంటుందా? వీటిని శకునాలుగా పరిగణించాలా?
నిద్ర పొయే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో కల చూసే ఉంటారు. చాలా వరకు కలలు మనకు గుర్తుండవు. కానీ కొన్ని కలలు గుర్తుంటాయి. కొన్ని స్పష్టంగా గుర్తుంటే మరి కొన్ని అస్పష్టంగా గుర్తుంటాయి. అసలు కలలకు అర్థం ఉంటుందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
హిందు పురాణాలను అనుసరించి ఎలాంటి కలలు ఎలాంటి ఫలితాలిస్తాయో అగ్ని పురాణం వివరిస్తుంది. అగ్నిపురాణంలోని ఏడవ అధ్యాయంలో అరణ్య వాసంలో ఉన్న రాముడు ఈ జ్ఞానాన్ని సీతా లక్ష్మణులకు బోధించాడని చెప్తారు. సీతకు, లక్ష్మణుడికి తరచుగా కలల ద్వారా సంకేతాలు అందడం, ఆ కలలు వారిని కలవర పెట్టడం జరిగేదని.. రాముడు వాటిని విశ్లేషించి వివరణలు ఇచ్చాడని ఈ పురాణం చెబుతోంది.
కొన్ని కలలు జీవితంలో జరగబోయే వాటికి సూచనలు కావచ్చుకూడా. కొన్ని మంచి శకునాలైతే మరికొన్ని చెడు శకునాలు. శరీరం మీద గడ్డి లేదా చెట్టు పెరిగినట్టు కలలో కనిపిస్తే, కలలో మనకు మనం గుండుతో లేదా చిరిగిన కనిపిస్తే లేదా ఎత్తు నుంచి పడిపోతున్నట్టు కలలు వస్తే అది జరగబోయే చెడుకు సంకేతంగా అపశకునంగా భావించాలి.
ఈ కలలు మంచివి కావట
కలలో వివాహం, పాట పాడడం, పాములను, చండాలులను చంపుతున్నట్టు కలలు వస్తే కూడా మంచిది కాదని శాస్త్రం చెబుతోంది. పక్షి మాంసం తింటున్నట్టు లేదా తేనె తాగుతున్నట్టు కల వచ్చినా మంచిది కాదు. ఇలాంటి కలలు దేవతలు, బ్రాహ్మణలు, రాజు లేదా గురువు మీ మీద కోపంగా ఉన్నారనడానికి సంకేతాలట.
కలలు అపశకునాలు ఎదురైతే వీటికి పరిహారాలను తెలుసుకోవాలి. వీటి నివారణ కోసం యజ్ఞాలు చెయ్యాల్సి రావచ్చు. ఇలాంటి పీడకలలు తరచుగా వేధిస్తుంటే విష్ణువు, శివుడు, గణేషుడు, సూర్యుని ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది. నిద్రకు ఉపక్రమించిన మొదటి భాగంలో కల వస్తే అది ఏడాదిలో దానికి సంబంధించిన ఫలితాలు కనిపిస్తాయి. నిద్ర పోయిన తర్వాత రెండవ భాగంలో వచ్చే కలలు ఆరునెలల్లో, తెల్లవారు జామున వచ్చే కలలు పది పదిహేను రోజుల్లో ఫలితాలను ఇస్తాయని అంటారు. ఒక మంచి కల తర్వాత చెడు కల వస్తే చెడు కల నిజమవుతుంది. కనుక మంచి కల వచ్చిన తర్వాత మెలకువ వస్తే ఇక నిద్రపోకూడదని అంటుంటారు.
కొన్ని కలలు సమీప భవిష్యత్తులో వచ్చే వ్యాధులకు సూచన గా చెప్పుకోవచ్చు
- కలలో మీరు ఆనందంగా నవ్వుతూ కనిపించడం లేదా వివాహానికి హాజరవ్వడం, సంగీతం వినడం లేదా పాడడం వంటివి త్వరలో మీకేదో ప్రమాదం జరగబోతోందనడానికి సూచన.
- కలలో ఎవరో తిరుగుతున్నట్టు అనిపిస్తే అది త్వరలో కలిగే సంపద నష్టాన్ని సూచిస్తుంది.
- పంది, కోతి, పిల్లి వంటివి కలలో కనిపిస్తే అది ప్రమాద సంకేతం.
- కోపంతో తిడుతున్న లేదా కోపిష్టి బ్రాహ్మడు కలలో కనిపిస్తే తీవ్ర ప్రమాదపు అంచున ఉన్నట్టు అర్థం.
- గేదేలు, గాడిద, ఎలుగుబండి, ఒంటెలు తరుముతుంటే ఆ వ్యక్తి త్వరలో అనారోగ్యం బారిన పడతాడనడానికి సంకేతం.
మరణాన్ని సూచిస్తాయి
- చంద్ర లేదా సూర్య గ్రహణం కలలో కనిపిస్తే ఆ వ్యక్తి త్వరలో మరణిస్తాడని అర్థం
- ఒంటె, గేదే, కంచర గాడిద మీద దక్షిణదిశగా ప్రయాణిస్తున్నట్టు కల వస్తే వారంలో వారు చనిపోవచ్చు.
- తైలాభిషేకం కలలో కనిపిస్తే వారంలో వారికి మృత్యువు తప్పదు.
- నల్లని వస్త్రాలు ధరించిన స్త్రీ కలలో కనిపించినా ప్రాణ హాని పొంచి ఉందని అర్థం
- జుట్టు లేదా గోళ్లు కత్తిరించుకుంటున్నట్టు కల వచ్చినా అది అపశకునమే.
- కాకీ లేదా కుక్క దాడి చేస్తున్నట్లు కల వచ్చినా మరణం పొంచి ఉందని చెప్పే సూచన.
ఇలాంటి కలలు వచ్చినపుడు సహజంగానే ఆందోళన కలుగుతుంది. పీడకలలు వేధిస్తుంటే నిత్యం ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. 108 సార్లు 11 సెట్లు జపిస్తే అపమృత్యు భయం నుంచి ఉపశమనం దొరుకుతుంది. బ్రహ్మ వైవ్రత పురాణాన్ని అనుసరించి మనం చూసే ప్రతి కలకు ఒక అర్థం ఉంటుంది. కొన్ని కలలు శుభప్రదమైతే మరి కొన్ని అపశకునాలు కావచ్చు.
గమనిక: పండితులు, వివిధ శాస్త్రాలు, ఆధ్యాత్మిక పుస్తకాల్లో పేర్కొన్న కొన్ని చెడు సంకేతాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.