Afterlife in different religions: మరణం తర్వాత ఏం జరుగుతుంది? స్వర్గం నరకం పునర్జన్మ భావనలపై 10 మతాల నమ్మకాలు!
After Death: పునర్జన్మ ఉంటుందని 20 వేలకు పైగా మతాలు నమ్ముతాయి. మరి మరణానంతరం ఏం జరుగుతుంది? ఏ మతగ్రంధాలు ఏం చెబుతున్నాయ్? ఈ కథనంలో తెలుసుకుందాం

Afterlife in different Religions
మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మరణం తర్వాత ఏం జరుగుతుందని?
స్వర్గం, నరకం ఉంటుందా?
పునర్జన్మ నిజంగా ఉంటుందా?
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4000 మతాలు ఉన్నాయి. మరణం తర్వాత ఏం జరుగుతుంది? దీని గురించి దాదాపు అన్ని మతాలు నమ్ముతాయి. 10 ప్రధాన మతాల ప్రకారం మరణం తర్వాత నమ్మకాల గురించి తెలుసుకుందాం.

క్రైస్తవ మతం
క్రైస్తవ మతంలో మరణం అంతం కాదు, మరణం తరువాత కొత్త జీవితం ప్రారంభమవుతుంది. క్రైస్తవులు ఆత్మ ఉంటుందని నమ్ముతారు . మరణానంతరం దేవుడు వారిని తీర్పు తీరుస్తాడు. చాలా మంది ప్రజలు స్వర్గానికి లేదా నరకానికి వెళతారని నమ్ముతారు.

ఇస్లాం
ఇస్లాంలో మరణానికి భయపడకుండా దానిని స్వీకరించమని బోధిస్తుంది, ఎందుకంటే ఇది అంతం కాదు. అల్లాహ్ మానవుని ఆత్మను తీసుకోవడానికి ఒక దేవదూతను పంపుతారని .. దేవదూతలు విశ్వాసాన్ని పరీక్షిస్తారని వారు నమ్ముతారు. ముస్లింలు పవిత్రంగా ఉంటే, తీర్పు రోజున ఎదురుచూడటానికి బర్జాఖ్ కు పంపిస్తారని నమ్ముతారు
హిందువులు
ఎక్కువ మంది హిందువులు మరణం , పునర్జన్మల చక్రం గుండా వెళతారని నమ్ముతారు, దీనిని సంసార చక్రం లేదా పునర్జన్మ అంటారు. మనిషి మరొక శరీరంలో , జంతువు రూపంలో కూడా మళ్లీ పుట్టవచ్చు. కొంతమంది హిందువులు మోక్షం ద్వారా పునర్జన్మ చక్రం నుంచి విముక్తి పొందుతారని నమ్ముతారు.

బౌద్ధ ధర్మం
బౌద్ధమతంలో జీవితం , మరణం నిరంతరం కొనసాగే ప్రక్రియ. మరణం తరువాత ఆత్మ కొనసాగుతుంది ..ఎన్నోసార్లు పునర్జన్మించవచ్చు. పునర్జన్మ ఎప్పుడు, ఎక్కడ ఎలా జరుగుతుందనేది వ్యక్తి కర్మల ద్వారా నిర్ణయించబడుతుందని చాలా మంది నమ్ముతారు.

సిక్కులు
మరణానంతరం ఆత్మ దాని కర్మల ఆధారంగా పునర్జన్మను పొందుతుందని నమ్ముతారు. భగవంతుని ధ్యానం , అహంకారాన్ని నియంత్రించడం ద్వారా పునర్జన్మ చక్రం నుంచి విముక్తి పొందవచ్చు.

యహూదీ
ఈ మతంలో మరణానంతరం జీవితం గురించి వేర్వేరు నమ్మకాలు ఉన్నాయి. యహూదీ మతం ప్రకారం మరణం మనిషి మనుగడకు ముగింపు కాదు. మరణించిన వారు తిరిగి జీవించడం కూడా ఈ మతం ఒక ప్రాథమిక విశ్వాసం.


బహాయి ధర్మం
మరణానంతరం ఆత్మ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందని చెబుతుంది బహాయి ధర్మం. ఆత్మ ఆధ్యాత్మిక ప్రపంచం గుండా వెళుతున్నప్పుడు శరీరం మట్టిలో కలిసిపోతుంది, కాని ఆత్మ స్వేచ్ఛ , ఆనందాన్ని అనుభవిస్తుంది. ఇందులో దేవుని కృప , జీవించి ఉన్నవారి మంచి పనులు ప్రార్థనల సహాయం లభిస్తుందని బహాయిలు నమ్ముతారు. మరణాన్ని భయపడే విషయంగా చూడరు.
జైన ధర్మం
భారతదేశంలో ఒక ప్రధాన మతంగా ఉండటమే కాకుండా ప్రపంచంలోని పురాతన ధర్మాలలో ఒకటైన జైన ధర్మం ప్రకారం ఆత్మ ఉంటుందని నమ్ముతారు. ఆత్మ ఎప్పుడూ జననం పునర్జన్మ చక్రాల గుండా వెళుతుంది. ఆత్మను కర్మ నుంచి విముక్తి చేయడం ద్వారా మోక్షం పొందాలి, ఇది పునర్జన్మ చక్రానికి బంధిస్తుంది. మంచి కర్మ మార్గం పూర్తిగా అహింసాత్మక జీవితాన్ని గడపడమేనని జైనులు నమ్ముతారు.

జొరాస్ట్రియన్
ఈ మతం ప్రకారం మరణం తర్వాత ఆత్మను చిన్వాట్ వంతెనపై తీర్పు తీరుస్తారు, ఇది స్వర్గానికి లేదా నరకానికి వెళుతుందని నమ్ముతారు. జొరాస్ట్రియన్ మతం మంచి ఆలోచనలు, మంచి మాటలు , మంచి పనులను విశ్వసిస్తుంది. వారి ప్రకారం, అన్ని ఆత్మలు కాలక్రమేణా శుద్ధి అయి భగవంతుని వద్దకు తిరిగి వస్తాయి.

షింటో మతం
జపాన్ లో ప్రారంభమైన షింటో మతం ఇది ఒక స్థానిక మతం, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 మిలియన్లకు పైగా అనుచరులు ఉన్నారు. మరణానంతరం జీవితం గురించి షింటో దృక్పథం, ఆత్మ శరీర మరణం తర్వాత కూడా జీవించి ఉంటుంది , జీవించి ఉన్నవారికి సహాయం చేస్తుంది అనే ఆలోచన చుట్టూ తిరుగుతుంది. ఈ మతాన్ని అనుసరించేవారు మరణానంతరం మనిషి పవిత్ర ఆత్మగా మారుతుందని నమ్ముతారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించినది మాత్రమే. ఇక్కడ ABP దేశం ఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం






















