News
News
X

vinayaka chavithi 2022: వినాయకుడి ముందు గుంజీలు ఎందుకు తీస్తారు!

vinayaka chavithi 2022: వినాయకుడి ఆలయాలకు వెళ్లినవారు, వినాయక పూజలు నిర్వహించేవారు పూజ అనంతరం గుంజీలు తీస్తుంటారు. అలా గుంజీలు తీస్తే మంచిదని చెబుతారు. ఇంతకీ గుంజీల వెనుకున్న అసలు కారణం ఏంటో తెలుసా!

FOLLOW US: 

vinayaka chavithi 2022: వినాయకుడి ముందు గుంజీలు తీయడం వెనుక ఓ పురాణగాథ ప్రచారంలో ఉంది. పార్వతీదేవికి శ్రీమహావిష్ణువు సోదరుడు. అందుకే పార్వతీదేవిని నారాయణి అని కూడా అంటారు.  శివుడిని చూడటానికి ఒకసారి మహావిష్ణువు కైలాసానికి వెళ్లాడు. సుదర్శనం, గద సహా ఆయుధాలన్నీ తీసి పక్కనపెట్టి, శివుని పక్కన కూర్చుని ముచ్చట్లలో పడతాడు. అక్కడే ఆడుకుంటున్న బాల గణపతి స్వర్ణకాంతులతో ధగధగలాడుతున్న సుదర్శనచక్రాన్ని తీసుకుని అమాంతం నోట్లో వేసుకుని మింగేశాడు. శివుడితో కబుర్లలో మునిగిన విష్ణువు దీనిని గమనించలేదు. 

Also Read: పార్వతీదేవి వినాయకుడిని దేనితో తయారు చేసింది, ఏనుగు ముఖం పెట్టకముందు వినాయకుడి రూపం ఇదే!

కొద్దిసేపటి తర్వాత తన ఆయుధాలు ఉంచిన చోట చూస్తే సుదర్శన చక్రం కనిపించలేదు. ఎక్కడ ఉంచానో అనుకుంటూ వెతకడం ప్రారంభించాడు. అప్పుడే అక్కడకు వచ్చిన బాలగణేషుడు ఏం వెతుకున్నావ్ అని అడిగితే.. ‘నా సుదర్శన చక్రం ఎక్కడ పెట్టానో మరిచిపోయాను..దానినే వెతుకుతున్నా అని సమాధానం చెప్పాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు బాలగణేషుడు నవ్వుతూ.. నేను మింగేశానుకదా అంటాడు. తన చక్రాన్ని తిరిగి ఇచ్చేయమని మహావిష్ణువు బతిమలాడతాడు. అప్పుడు బాలుడిని ప్రశన్నం చేసుకునేందుకు మహావిష్ణువు..తన కుడిచేత్తో ఎడమ చెవిని, ఎడమచేత్తో కుడి చెవిని పట్టుకుని గుంజీలు తీయడం మొదలుపెడతాడు. విష్ణువు గుంజీలు తీస్తుంటే విచిత్రంగా అనిపించడంతో వినాయకుడు పగలబడి నవ్వుతాడు. విపరీతంగా నవ్వడంతో కడుపులో ఉన్న సుదర్శన చక్రం నోటి నుంచి బయటపడుతుంది. విష్ణువు ఆ చక్రాన్ని తీసుకుని ఊపిరి పీల్చుకుంటాడు. అప్పటి నుంచీ వినాయకుడి ముందు గుంజీలు తీసి వేడుకుంటే ఏం కోరుకున్నా నెరవేర్చేస్తాడని భక్తుల విశ్వాసం. 

Also Read: వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే ఏమవుతుంది, ఈ రోజున తప్పనిసరిగా చదువుకోవాల్సిన కథలివే!

మట్టివినాయకుడినే వినియోగించండి
గణేశ పూజకు ఒండ్రుమట్టితో చేసిన వినాయకుడి ప్రతిమను ఉపయోగించాలి. ఎందుకంటే వాగులు, నదులు, కాలువలు సహా జలాశయాలన్నీ పూడికతో నిండి ఉంటాయి. బంకమట్టికోసం ఆయా జలాశయాలలో దిగి, తమకు కావలసినంత మట్టిని తీయడం వల్ల పూడిక తీసినట్లవుతుంది. నీళ్లు తేటపడతాయి. అదీగాక మట్టిని తాకడం, దానితో బొమ్మలు చేయడం వల్ల మట్టిలోని మంచి గుణాలు ఒంటికి పడతాయి. ఒండ్రుమట్టిలో నానడం ఒంటికి మంచిదని ప్రకృతి వైద్యులు ఎప్పుడో చెప్పారు. పూజానంతరం ఆయా మట్టి విగ్రహాలను నీటిలో కలపడం వల్ల ఆయా పత్రాలలోని ఔషధగుణాలు నీటిలో చేరి కాలుష్యం తగ్గుతుంది. అందుకే మట్టి గణపతిని వినియోగించండి..ప్రకృతిని కాపాడండి..

సిద్ధి వినాయక స్తోత్రం (Siddhi Vinayaka Stotram in Telugu)

విఘ్నేశ విఘ్నచయఖండననామధేయ
శ్రీశంకరాత్మజ సురాధిపవంద్యపాద |
దుర్గామహావ్రతఫలాఖిలమంగలాత్మన్
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ || 

సత్పద్మరాగమణివర్ణశరీరకాంతిః
శ్రీసిద్ధిబుద్ధిపరిచర్చితకుంకుమశ్రీః |
దక్షస్తనే వలయితాతిమనోజ్ఞశుండో
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ||

పాశాంకుశాబ్జపరశూంశ్చ దధచ్చతుర్భి-
-ర్దోర్భిశ్చ శోణకుసుమస్త్రగుమాంగజాతః |
సిందూరశోభితలలాటవిధుప్రకాశో
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ || 

కార్యేషు విఘ్నచయభీతవిరంచిముఖ్యైః
సంపూజితః సురవరైరపి మోదకాద్యైః |
సర్వేషు చ ప్రథమమేవ సురేషు పూజ్యో
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ || 

శీఘ్రాంచనస్ఖలనతుంగరవోర్ధ్వకంఠ
స్థూలేందురుద్రగణహాసితదేవసంఘః |
శూర్పశ్రుతిశ్చ పృథువర్తులతుంగతుందో
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ || 

యజ్ఞోపవీతపదలంభితనాగరాజో
మాసాదిపుణ్యదదృశీకృతఋక్షరాజః |
భక్తాభయప్రద దయాలయ విఘ్నరాజ
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ || 

సద్రత్నసారతతిరాజితసత్కిరీటః
కౌసుంభచారువసనద్వయ ఊర్జితశ్రీః |
సర్వత్ర మంగలకరస్మరణప్రతాపో
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ || 

దేవాంతకాద్యసురభీతసురార్తిహర్తా
విజ్ఞానబోధనవరేణ తమోఽపహర్తా |
ఆనందితత్రిభువనేశ కుమారబంధో
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ || 

ఇతి శ్రీముద్గలపురాణే శ్రీ సిద్ధి వినాయక స్తోత్రం |
ఇతి  శ్రీ సిద్ధి వినాయకార్పణమస్తు ||

Published at : 30 Aug 2022 12:52 PM (IST) Tags: Ganesh Chaturthi 2022 ganesh chaturthi 2022 date ganesh chaturthi 2022 date and time 2022 ganesh chaturthi ganesh chaturthi puja vidhi ganesh chaturthi pooja vidhi ganesh chaturthi august 2022 date gunjis sit to stand exercise in front of Lord Ganesha

సంబంధిత కథనాలు

zodiac signs: ఈ రాశులవారితో వాదన పెట్టుకుంటే మీపై మీకే విరక్తి వస్తుందట!

zodiac signs: ఈ రాశులవారితో వాదన పెట్టుకుంటే మీపై మీకే విరక్తి వస్తుందట!

Navratri 2022: శివయ్య ప్రేమ గెలిచిన బ్రహ్మచారిణి, ఈ అవతారాన్ని పూజిస్తే సంతోషం, సౌభాగ్యం, సంపద

Navratri 2022: శివయ్య ప్రేమ గెలిచిన బ్రహ్మచారిణి, ఈ అవతారాన్ని పూజిస్తే సంతోషం, సౌభాగ్యం, సంపద

Indian Food: మీకు అదృష్టాన్ని తెచ్చే ఆహారాలు ఇవే - ఇది మీ జేబులో ఉంటే డబ్బు ఖర్చు తగ్గుతుందట !

Indian Food: మీకు అదృష్టాన్ని తెచ్చే ఆహారాలు ఇవే - ఇది మీ జేబులో ఉంటే డబ్బు ఖర్చు తగ్గుతుందట !

Navratri 2022: శరన్నవరాత్రుల్లో రెండోరోజు పఠించాల్సిన స్తోత్రం

Navratri 2022: శరన్నవరాత్రుల్లో రెండోరోజు పఠించాల్సిన స్తోత్రం

Navratri 2022: ఆయుష్షు కీర్తినిచ్చే బాలా త్రిపుర సుందరీదేవి, అమ్మవారు ఆవిర్భావం ఎలా జరిగిందంటే!

Navratri 2022: ఆయుష్షు కీర్తినిచ్చే బాలా త్రిపుర సుందరీదేవి, అమ్మవారు ఆవిర్భావం ఎలా జరిగిందంటే!

టాప్ స్టోరీస్

Vijayashanti: పండక్కి పైసలెట్ల? సర్కార్ ఉద్యోగులే కేసీఆర్‌ను పడగొడతరు - విజయశాంతి

Vijayashanti: పండక్కి పైసలెట్ల? సర్కార్ ఉద్యోగులే కేసీఆర్‌ను పడగొడతరు - విజయశాంతి

Supreme Court Live Streams: సుప్రీం కోర్టు విచారణలు లైవ్‌లో ఇలా చూడొచ్చు!

Supreme Court Live Streams: సుప్రీం కోర్టు విచారణలు లైవ్‌లో ఇలా చూడొచ్చు!

ఏవండీ ఆవిడ వద్దు! నెల్లూరు టిక్‌టాక్‌ మ్యారేజ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌

ఏవండీ ఆవిడ వద్దు! నెల్లూరు టిక్‌టాక్‌ మ్యారేజ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి