అన్వేషించండి

Vastu Tips In Telugu: పడకగదిలో ఈ వస్తువులు పెడితే దంప‌తుల మ‌ధ్య‌ ప్రేమ పెరుగుతుంది

Vastu Tips In Telugu: దాంప‌త్య జీవితంలో ప్రేమ మాధుర్యాన్ని పెంచడానికి వాస్తు శాస్త్రంలోని కొన్ని నియమాలను అనుసరించవచ్చు. మీ పడకగదిలో కొన్ని వస్తువులను ఉంచినట్లయితే మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

Vastu Tips In Telugu : మారుతున్న నేటి కాలంలో అందరూ ఆనంద‌క‌ర‌ వైవాహిక జీవితాన్ని కోరుకుంటున్నారు. వేగవంతమైన జీవితంలో ఆనందంగా జీవించడం చాలా కష్టం. బాధ్యతలు, పని భారం కారణంగా, చాలా మంది జంటలు ఒకరికొకరు తగినంత సమయం ఇవ్వలేరు, ఇది వారి మధ్య అంతరాన్ని సృష్టిస్తుంది. వివాహం తర్వాత, వ్యక్తులు వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, చాలా కాలం పాటు సంబంధాన్ని సంతోషంగా ఉంచడానికి అన్ని పద్ధతులను అనుసరిస్తారు. ప్రస్తుతం భార్యాభర్తల మధ్య అంతరం పెరుగుతోంది. ఇలాంటి స‌మ‌స్య‌ల‌కు కొన్ని వాస్తు చిట్కాలు ఉన్నాయి,  వాటిని అనుసరించినట్లయితే మీరు మీ వైవాహిక జీవితాన్ని మళ్లీ సంతోషంగా, రంగుల‌మ‌యంగా మార్చుకోగలరు. వాస్తు చిట్కాలు వైవాహిక జీవితాన్ని ఆనందమయం చేయడమే కాకుండా, భార్యాభర్తల మధ్య పరస్పర ప్రేమను కూడా పెంచుతాయి. అలాగే ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు.

పడకగదిలో అద్దం
భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగడానికి, గొడవలు తగ్గడానికి దంప‌తులు తమ పడకగదిలో అద్దం పెట్టుకోవాలి. వాస్తు ప్రకారం, పడకగదిలో అద్దం ఉంచడం శుభప్రదంగా పరిగణిస్తారు. అయితే, మంచం ముందు అద్దం పెట్టవద్దు.

Also Read : ఈ వస్తువులు బహుమతిగా ఇస్తే దురదృష్టాన్ని ఆహ్వానించినట్టే!

ల‌వ్ బ‌ర్డ్స్‌
వివాహితులు తమ పడకగదిలో లవ్ బర్డ్స్ చిత్రాన్ని ఉంచాలి. దీనిని వాస్తుశాస్త్రంలో చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇలా చేయడం వల్ల దంపతులకు ఒకరిపై ఒకరికి ప్రేమ పెరుగుతుంది. ఈ చిత్రం ప్రేమకు చిహ్నం, దీనిని పడకగదిలో ఉంచడం వ‌ల్ల ఎల్లప్పుడూ దంప‌తుల‌ మధ్య ప్రేమను పెంచుతుంది.

ఎలక్ట్రానిక్ వస్తువులు
ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా ఉండటం వల్ల మీ జీవితం ఆనందంగా ఉంటుంది. వాస్తు ప్రకారం, ఎలక్ట్రానిక్ పరికరాలను పడకగదిలో ఎప్పుడూ ఉంచకూడదు. ఎందుకంటే ఇది సానుకూల శక్తిని తగ్గిస్తుంది, మీ దాంప‌త్య‌ సంబంధంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అందువ‌ల్ల మొబైల్, ల్యాప్‌టాప్ మొదలైన వాటిని పడకగదికి దూరంగా ఉంచండి.

డెక‌రేష‌న్ ఫ్ల‌వ‌ర్స్‌
ప్రజలు తమ పడకగదిని అలంకరించుకోవడానికి పువ్వులను ఉంచుతారు, కానీ పడకగదిలో ఎండిపోయిన లేదా ముళ్లు ఉన్న‌ పువ్వులను ఎప్పుడూ ఉంచకూడ‌దు. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య టెన్షన్ పెరుగుతుంది. వాస్తు ప్రకారం, తాజా, వికసించే పువ్వులను ఎల్లప్పుడూ పడకగదిలో ఉంచాలి. ఇది వైవాహిక‌ బంధంలో ప్రేమను పెంచుతుంది.

Also Read : ఇంట్లో ఏడు గుర్రాల పెయింటింగ్ పెడితే ఎలాంటి లాభాలు కలుగుతాయి.?

మనీ ప్లాంట్ 
పడకగదిలో మనీ ప్లాంట్ ఉంచడం భార్య‌భ‌ర్త‌లకు ప్రయోజనకరంగా పరిగణిస్తారు. వాస్తు ప్రకారం, పడకగదిలో మనీ ప్లాంట్ ఉంచడం వ‌ల్ల‌ అదృష్టం కలిసి వ‌స్తుంది, ఎందుకంటే ఇది శుక్రునికి సంకేతం. ఇది భార్యాభర్తల బంధాన్ని మధురంగా ​​మార్చడంతోపాటు వారి మధ్య ప్రేమను పెంచుతుంది.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget