Seven Horses Painting: ఇంట్లో ఏడు గుర్రాల పెయింటింగ్ పెడితే ఎలాంటి లాభాలు కలుగుతాయి.?
Seven Horses Painting: వాస్తుపరంగా ఇంటికి శుభప్రదంగా భావించే చిత్రాలు అనేకం ఉన్నాయి. అందులో ఒకటి ఏడు గుర్రాల పెయింటింగ్. దాని ప్రాముఖ్యత, ప్రయోజనాలు, దిశ గురించి తెలుసుకుందాం.
Seven Horses Painting: నేటి బిజీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు కష్టానికి తగిన ఫలం లభించదు. దీని అర్థం ఒకరు తమ పనిలో తక్కువ ప్రయత్నం చేస్తున్నారని కాదు. జీవితంలో అభివృద్ధి చెందాలంటే, కర్మను విశ్వసించాలి, శక్తిమంతంగా, ఆరోగ్యంగా ఉండాలి. సానుకూల, ప్రతికూల శక్తి రెండు రకాలుగా ఉంటుందని వాస్తు వివరిస్తుంది. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించేందుకు ఏడు గుర్రాలను పెయింటింగ్ ఉంచవచ్చని వాస్తు శాస్త్రం చెబుతోంది. దాని ప్రాముఖ్యత, ఈ పెయింటింగ్ ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలు, దానిని ఉంచడానికి దిశ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఏడు గుర్రాల పెయింటింగ్ ప్రాముఖ్యత
మన సంస్కృతిలో 7 అంకె ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇంద్రధనస్సులో ఏడు రంగులు ఉంటాయి. హిందూ ధర్మంలో వివాహ సమయంలో వధూవరులు ఏడు ప్రమాణాలు చేస్తారు. భారతదేశంలోని ఏడుగురు ఋషులు (సప్తఋషులు) 7వ అంకెను సూచిస్తారు. ఈ క్రమంలోనే ఏడు గుర్రాల పెయింటింగ్ గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. దీనిని ఇంట్లో ఉంచడం ద్వారా అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
Also Read : ఇంట్లో ఈ వస్తువులు ఖాళీగా ఉంచితే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి!
పాజిటివిటీని తెచ్చే చిత్రం
హిందూ ధర్మంలో సూర్య భగవానుడికి ఏడు గుర్రాలు ఉన్న రథం ఉంది. ఈ నేపథ్యంలోనే, వాస్తు ప్రకారం ఏడు గుర్రాల పెయింటింగ్ అసాధారణ ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ పెయింటింగ్ వాస్తు ప్రత్యేక ప్రాతినిధ్య పాత్రను కలిగి ఉంది. గుర్రం విజయం, శక్తిని సూచిస్తుంది. ఈ విధంగా, ఈ ఏడు గుర్రాల పెయింటింగ్ ఒకరి జీవితంలో బలం, విజయంతో పాటు కెరీర్‌లో గెలుపునిస్తుంది.
ఏడు గుర్రాల పెయింటింగ్ ఇంట్లోని వ్యక్తుల జీవితంలో సానుకూలతను తెస్తుంది. ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. శాస్త్రం ప్రకారం, ఈ పెయింటింగ్ ఇంటిలో శక్తి సమతుల్యతను ఏర్పరుస్తుంది. అంతేకాకుండా ఏడు గుర్రాలు పురోగతిని, విజయాన్ని సూచిస్తాయి.
లాభాలు
పరుగెత్తే గుర్రాలు వేగానికి సూచన. ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని కోరుకునే ఈ బిజీ ప్రపంచంలో వేగం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ పెయింటింగ్‌ను ఇంట్లో ఉంచితే, ఆ వ్యక్తి తన జీవితంలో ఏ పనినైనా ఎంత త్వరగా పూర్తి చేస్తాడో గమనించవచ్చు.
⦿ గుర్రం విజయానికి ప్రతినిధి. కాబట్టి ఈ ఏడు గుర్రాల పెయింటింగ్ ఒకరి జీవితంలోని అన్ని రంగాలలో విజయాన్ని నిర్ధారిస్తుంది.
⦿ ఇంట్లో ఈ ఏడు గుర్రాల పెయింటింగ్ వ్యక్తి జీవితంలో ఆర్థిక స్థిరత్వాన్ని తెస్తుంది.
⦿ ఫెంగ్ షుయ్‌లో గుర్రాలు ధైర్యం, వేగం, ఓర్పును సూచిస్తాయి. కాబట్టి, ఇది అదృష్టాన్ని తెస్తుంది.
⦿ అదనంగా, ఏడు గుర్రాల రథంపై కూర్చున్న సూర్యుని వర్ణ చిత్రం మరింత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ చిత్రం అదృష్టాన్ని తెస్తుంది.
Also Read : లక్ష్మీ దేవి వాహనం గుడ్లగూబ ఫొటోను ఇంట్లో పెట్టుకోవచ్చా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
ఏడు గుర్రాల పెయింటింగ్ ఎక్కడ ఉంచాలి?
ఈ శుభప్రదమైన పెయింటింగ్‌ను ఇంటి తూర్పు గోడకు వేలాడదీయాలి. ఉత్తరం గోడపై కూడా ఈ 7 గుర్రాల పోస్టర్ ఉంచవచ్చు. ఇది సేవా రంగంలో ఉన్న వ్యక్తి ప్రమోషన్‌కు కారణమవుతుంది. ఆ ఇంట్లో శ్రేయస్సు, సంపదను తెస్తుంది. ఈ పెయింటింగ్స్ పేరు, కీర్తిని తెస్తాయి కాబట్టి దక్షిణ భాగంలో కూడా ఉంచవచ్చు. అనేక కారణాల వల్ల, మీరు మీ ఇంటి దక్షిణ గోడపై పెయింటింగ్ ఉంచేందుకు వీలు కాకపోతే మీరు ఇంటి కిటికీ ముందు కూడా ఉంచవచ్చు. అయితే ఆ కిటికీ ఏడు గుర్రాల పెయింటింగ్‌కు ఎదురుగా ఉండేలా చూసుకోవాలి.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.