అన్వేషించండి

Vastu Tips In Telugu : మీ ఇంట్లో ఈ చిన్న పొరపాటు చేస్తే అప్పుల భారం పెరుగుతుంది!

Vastu Tips In Telugu : కొంతమంది జీవితంలో ఎంత కష్టపడినా అప్పుల బాధ నుంచి బయటపడలేరు. మీరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, మీ ఇంట్లో తప్పకుండా ఈ అంశాలపై శ్రద్ధ వహించండి.

Vastu Tips In Telugu : ఇల్లు కట్టడం, గృహ ప్రవేశం, ఆస్తి కొనుగోలు. ప్రతి విషయంలోనూ వాస్తు శాస్త్రాన్ని దృష్టిలో ఉంచుకుని వాస్తు ప్రకారం పనిచేస్తాం. ఇది మన జీవితంలో వాస్తు శాస్త్రానికి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. జీవితంలో ఏదో ఒక సమయంలో, ఒక వ్యక్తి కొన్ని కారణాల వల్ల అప్పు తీసుకుంటాడు. ఈ అప్పుకు వడ్డీ కట్టడానికే జీవితమంతా గడిచిపోతుంది. అయినా అప్పుల భారం నుంచి ఉపశమనం లభించదు. అలాంటప్పుడు మీరు వాస్తు సహాయం తీసుకోవచ్చు. వాస్తు శాస్త్రం జీవితాన్ని మార్చగల కొన్ని సూత్రాలను వివరిస్తుంది.

రాత్రిపూట వంట‌పాత్ర‌లు క‌డ‌గ‌క‌పోవ‌డం
మనం ఎంత ఆధునికత వైపు అడుగులు వేసినా నేటికీ చాలా ఇళ్లలో ఉప‌యోగించిన‌ ప్లేట్లు, పాత్రలు డైనింగ్ టేబుల్‌పైనే మిగిలిపోతున్నాయి. వాస్తు ప్రకారం, రాత్రిపూట మురికి, అనవసరమైన పాత్రలను ఉంచడం వల్ల అప్పులు పెరుగుతాయి. అందుకే వాస్తు నియమాలను పాటించండి. రాత్రిపూట ఉపయోగించిన పాత్రలను సింక్‌లో ఉంచకుండా శుభ్రం చేయండి.

Also Read : ఈ వాస్తు చిట్కాల‌తో ప్ర‌తికూలశ‌క్తుల‌ను ఇంటి నుంచి బ‌య‌ట‌కు త‌ర‌మండి!

డస్ట్‌బిన్‌ను ఈ దిశలో ఉంచవద్దు
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఈశాన్య దిశలో చెత్తబుట్టను ఉంచ‌కూడదు. ఇది ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. డస్ట్‌బిన్‌ను ఆగ్నేయ దిశలో ఉంచవద్దు, ఇది డబ్బు ఆదా చేయడంలో అడ్డంకులను కలిగిస్తుంది. అందుకే ఇంటి నైరుతి దిక్కు చెత్తబుట్టను ఉంచేందుకు అనుకూలమని చెబుతారు.

మంచం మీద ఆహారం తినవద్దు
వాస్తు శాస్త్రంలో ప్రతి స్థలానికి దాని ప్రవర్తన ప్రకారం ప్రాధాన్యం ఇచ్చారు. పడుకోవడానికి మంచం, తినడానికి డైనింగ్ టేబుల్, స్నానం చేయడానికి బాత్రూమ్ మొదలైనవి. కానీ చాలా మంది దీనికి విరుద్ధంగా చేస్తారు. చాలా మందికి మంచం మీద భోజనం చేసే అలవాటు ఉంటుంది. మంచంపై భోజనం చేసి అన్నపూర్ణాదేవిని అవమానిస్తే.. త‌ద్వారా ఆ ఇంట్లో వాస్తు దోషాలు తలెత్తడానికి ఎక్కువ సమయం పట్టదు. మంచం మీద ఆహారం తినవద్దు, ఈ సలహా జ్యోతిషశాస్త్రంలో కూడా సూచించారు.

బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంచవద్దు
బాత్రూంలో ఖాళీ బకెట్లు ఉంచవద్దు. వాస్తు ప్రకారం, బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంచడం శ్రేయస్కరం కాదు. ఇది ఇంట్లో ఆర్థిక సంక్షోభాన్ని ప్రోత్సహిస్తుంది, ఆ ఇంటిలో వ్యక్తి అప్పుల చక్రంలో కూరుకుపోతాడు. అంతేకాకుండా, బాత్రూంలో నల్లరంగు బకెట్ ఉంచడం కూడా ఖచ్చితంగా నిషేధించారు.

గోడ రంగు
ఇంటి లేదా కార్యాలయంలోని గోడ ముదురు రంగులో ఉండకూడదు. ఇల్లు, పనిచేసే స్థలం ఒక వ్యక్తి జీవితంలో ముఖ్యమైన భాగాలు. కాబట్టి ఇంటితో పాటు పని ప్రదేశాల గోడకు పెయింటింగ్ చేసేటప్పుడు ముదురు రంగులను ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి. వాస్తు ప్రకారం ఇది మీ ఇల్లు లేదా పని ప్ర‌దేశం వైపు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. ఇది మిమ్మల్ని తీవ్రమైన దీర్ఘకాలిక అనారోగ్యానికి గురి చేస్తుంది.

బీరువా ఏ వైపు ఎదురుగా ఉండాలి?
వాస్తు శాస్త్రం ప్రకారం, డబ్బు ఉంచే బీరువా, ఐరన్ సేఫ్‌ ఎల్లప్పుడూ ఉత్తరం వైపు ఉండాలి. దీని కారణంగా, మీ ఇంట్లో రుణం తీసుకునే సమస్య ఎప్పటికీ తలెత్తదు. ఫ‌లితంగా మీ ఇంట్లో ఆనందం, శాంతి ఉంటుంది.

బాత్రూమ్ ఈ దిశలో ఉండకూడదు
వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు కట్టేటప్పుడు నైరుతి దిశలో బాత్‌రూమ్‌ను నిర్మించకూడదు. మీ ఇంట్లో బాత్రూమ్ నైరుతి దిశలో ఉంటే, మీ బాత్రూమ్ దిశను మార్చే పనిని ఈరోజే ప్రారంభించండి. ఎందుకంటే ఈ దిశలో బాత్రూమ్ ఉంటే అప్పుల భారం పెరుగుతుంది.

లక్ష్మీదేవి, కుబేరుడి ప్ర‌తిమ‌లు
మీ ఇంటి వాస్తు దోషం తొలగి అప్పులు తీరాలంటే మీ ఇంట్లో లక్ష్మీ, కుబేరుడి ప్ర‌తిమ‌లు ఉంచండి. ఈ పరిహారం చేయడం ద్వారా మీరు లక్ష్మీదేవి, కుబేరుడి అనుగ్రహాన్ని పొందుతారు. ఫ‌లితంగా మీ ఇంట్లో సంప‌ద పెంపొందుతుంది.

Also Read : స్టడీ రూమ్‌లో ఈ వస్తువులు ఉంటే మీ పిల్ల‌లు చ‌దువులో ముందుంటారు!

సాయంత్రం ఈ వస్తువులు దానం చేయవద్దు

- హిందూ ధ‌ర్మం, జ్యోతిష్యం, వాస్తు శాస్త్రాల్లో దాన సంప్రదాయానికి గొప్ప ప్రాముఖ్యత ఇచ్చారు. కానీ సూర్యాస్తమయం తర్వాత దానం చేయడం అశుభం. సాయంత్రం పూట దానం               చేయకూడని వస్తువులు ఏంటో తెలుసా?
- సాయంత్రం పూట ఎవరికీ అప్పు ఇవ్వవద్దు. ఎందుకంటే సాయంత్రం లక్ష్మి ఇంటికి వచ్చే సమయం.
- సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా ఉల్లి, వెల్లుల్లిని దానం చేయడం వాస్తు శాస్త్రంల ప్ర‌కారం అశుభం. దీని వల్ల జీవితాంతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుంది.
- సూర్యాస్తమయం తర్వాత పాలు, పెరుగు దానం చేయడం శ్రేయస్కరం కాదు. ఇది ఒక వ్యక్తి జాతకంలో హానికరమైన ప్రభావాలను కలిగిస్తుంది.
- ఇంటిని శుచిగా, శుభ్రంగా ఉంచడం మంచిదే, కానీ రాత్రిపూట ఊడ్చడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి. సాయంత్రం వేళలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని చెబుతారు. ఈ                   సమయంలో ఇంటిని తుడిస్తే మీరు మీ అదృష్టాన్ని కోల్పోతారు. అందుకే రాత్రిపూట ఇంటిని ఊడ్చకూడదు.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget