అన్వేషించండి

Buddha Statue Vastu: ఇంట్లో బుద్ద విగ్రహం పెట్టుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

బుద్ధ విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకునే ముందు ఆ విగ్రహానికి సంబంధించిన కొన్ని వాస్తు నియమాలను గురించి తెలుసుకోవడం అవసరం. నియమానుసారం బుద్ధ విగ్రహాన్ని పెట్టుకుంటే అదృష్టం వరిస్తుంది.

ఇంట్లో బుద్ధ విగ్రహాలు అలంకరించుకోవడం ఈ మధ్య ట్రెండ్ గా మారింది. అయితే బుద్ధ విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకునే ముందు ఆ విగ్రహానికి సంబంధించిన కొన్ని వాస్తు నియమాలను గురించి తెలుసుకోవడం అవసరం. ఇలా నియమానుసారం బుద్ధ విగ్రహాన్ని పెట్టుకుంటే అదృష్టం మిమ్మల్ని వరించే అవకాశం సుగమం అవుతుంది.

ఇంట్లో ఒక నిర్ణీత ప్రదేశంలో బుద్ధ విగ్రహాన్ని ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల్లో మానసిక వికాసం, సామరస్యం వెల్లివిరుస్తుంది.

గౌతమ బుద్ధుడు జ్ఞానం, సామరస్యం, అత్మ బలానికి చిహ్నం. ఫెంగ్షూయ్, వాస్తులో బుద్ధుని విగ్రహం పవిత్రమైందిగా బావిస్తారు. వాస్తుప్రకారం ఇంట్లో కుడి మూలన బుద్ధుడి విగ్రహం పెట్టుకోవడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

బుద్ధ విగ్రహాలు రకరకాల పద్ధతుల్లో తయారుచేసినవి మార్కెట్ లో లభిస్తున్నాయి. రకరకాల భంగిమల్లో కూడా దొరుకుతాయి. ఎలాంటి విగ్రహం ఎక్కడ అమర్చుకోవాలనేది కూడా తెలుసుకోవడం అవసరం.

పడుకుని ఉన్న బుద్ధుడు

కుడి చేతిని  తలకింద పెట్టుకుని పడుకుని ఉన్న భంగిమలో ఉన్న బుద్ధుడు జ్ఞానం, ముక్తికి ప్రతీక. ఈ బుద్ధ ప్రతిమ ఇంట్లో శాంతి నెలకొనేందుకు దోహదం చేస్తుంది. దీన్ని ఇంట్లో పడమర దిక్కుగా ముఖం ఉండేలా అమర్చుకుంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది.

ఆశీర్వదిస్తున్న బుద్ధ ప్రతిమ

ఆశీర్వాదం కోసం ఎత్తిన బుద్ధుడి చెయ్యి ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ చేరకుండా నివారిస్తుంది. ఇలాంటి విగ్రహం శాతం, భయం నుంచి విముక్తికి సంకేతం. వాస్తు దోషాలను పోగొట్టేందుకు ఇలా ఆశీర్వాద భంగిమలో ఉన్న బుద్ధ విగ్రహం ఇంట్లో పెట్టుకోవాలి. ఆశీర్వద ముద్రలో ఉన్న బుద్ధ విగ్రహాన్ని ప్రవేశ ద్వారం దగ్గర ఉంచడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించకుండా నివారించబడుతుంది.

ధ్యాన బుద్ధ

ధ్యానంలో ఉన్న బుద్ధుని ప్రతిమ ఇంట్లో శాంతిని చేకూరుస్తుంది. ఈ విగ్రహాన్ని మీరు ద్యానం చేసుకునే చోట పెట్టుకోవచ్చు. లేదా విశ్రాంతిగా గడిపే చోట కూడా ఈ చిత్రాన్ని లేదా విగ్రహాన్ని అలంకరించుకోవచ్చు. ఈ విగ్రహాన్ని చూసినపుడు ఒక శాంతి భావన మనసులోకి వస్తుంది.

తోటలో ఎక్కడ పెట్టుకోవాలి?

బుద్ధ విగ్రహం ఇంట్లో శాంతిని పెంచే సాధనం. దీన్ని బాల్కని లేదా తోటలో పెట్టుకుంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. పూల మొక్క పక్కన ఈ విగ్రహాన్ని అలంకరించుకోవడం వల్ల అందంగా ఉండడం మాత్రమే కాదు ఆ ప్రాంతం అంతా కూడా పాజిటివ్ నెస్ తో వైబ్రెంట్ గా మారుతుంది. తోటలో విశ్రాంతి భంగిమలో ఉన్న బుద్ధ విగ్రహం లేదా ద్యాన బుద్దుడి విగ్రహాన్ని కూడా పెట్టుకోవచ్చు.

బుద్ధ విగ్రహాన్ని అలంకించేందుకు కొన్ని వాస్తు నియమాలు

  • అన్నింటి కంటే ముందు బుద్ధ విగ్రహం కేవలం ఒక అలంకార వస్తువు కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇది పవిత్రమైన, శక్తివంతమైన మూర్తి అని మరచిపోవద్దు.
  • బుద్ధ విగ్రహాన్ని నేల మీద లేదా లాకర్ లో పెట్టకూడదు
  • బుద్ధ విగ్రహం ఎప్పుడు కూడా చూసేందకు కంటికి సమాంతరంగా లేదా తలపైకెత్తి చూసే విధంగా పెట్టుకోవాలి. కళ్లు దించి చూసే విధంగా బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోవద్దు. కూర్చుంటున్నపుడు లేదా పడుకుంటున్నపుడు బుద్దుడి వైపు కాళ్లు ఉండకుండా జాగ్రత్త పడాలి.
  • విగ్రహం చుట్టు చెత్త చేరనియ్యకూడదు. విగ్రహం, విగ్రహం పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా దుమ్ము, ధూళీ చేరకుండా శుభ్రంగా ఉంచుకోవాలి.
  • బెడ్ రూమ్ లో, బాత్ రూమ్ లో, వంట గదిలో బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోవద్దు.

Also Read: శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది, రామాయణాన్ని నారాయణుడి కథగా కాదు నరుడి కథగా చదవాలంటారు ఎందుకు!

గమనిక: పండితులు, వివిధ ఆధ్యాత్మిక పుస్తకాల్లో పేర్కొన్న కొన్ని పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Embed widget