Vastu Tips in Telugu: మీ ఇంట్లో గడియారం ఈ దిక్కున ఉంటే వెంటనే మార్చండి, అది మృత్యుగడియలకు సంకేతం
Vastu Shastra: ఇంట్లో గోడగడియారాన్ని ఎక్కడ, ఎలా ఉంచాలి? దీని గురించి వాస్తు శాస్త్రంలో చాలా సూచనలు ఉన్నాయి. గడియారాన్ని ఏ దిశలో ఉంచాలి? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం.
Vastu Shastra: మన జీవితంలో సమయం చాలా ముఖ్యమైంది. ఒకసారి పోయిన సమయం వెనక్కు తిరిగిరాదు. వాస్తుశాస్త్రంలో గడియారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. గోడ గడియారాన్ని ఎక్కడ, ఎలా ఉంచాలి. దీని గురించి వాస్తు శాస్త్రంలో చాలా సూచనలు ఉన్నాయి. గడియారాన్ని ఏ దిశలో ఉంచాలి అనే ప్రశ్నకు చాలా మంది మదిలో చాలా సందేహాలు ఉన్నాయి. మీరు గడియారాన్ని తప్పుడు దిశలో ఉంచినట్లయితే ఎన్నో సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. కార్పొరేట్ రంగంలో గడియారాలు చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. వాస్తు శాస్త్రంలో ఘడియలకు సంబంధించి ఎన్నో విషయాలు ఉన్నాయి.
మనం ఇంట్లో గడియారాన్ని సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం. ఎందుకంటే గడియారం దిశ మన పని దిశను, దాని ఫలితాలను నిర్ణయించడంలో సహాయపడుతుంది. వాస్తు ప్రకారం, గడియారాన్ని ఇల్లు లేదా కార్యాలయంలో తూర్పు, పడమర లేదా ఉత్తరం వైపు గోడపై అమర్చాలి. ఈ దిశల్లో అమర్చినట్లయితే ఇంట్లో సానుకూల శక్తిని ప్రసరిస్తాయి. అంతేకాదు ఈ దిశల్లో గడియారాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మనకు సమయం కూడా కలిసి వస్తుంది. చేపట్టినటు వంటి పనులు.. ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరుగుతాయి. అందుకే గడియారాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఈ దిశలలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవడం మంచిది.
గడియారాన్ని ఏ దిశలో పెట్టకూడదు?
గడియారాన్ని సరైన దిశలో ఉంచడం వల్ల మంచి ఫలితాలు వచ్చినట్లే, ఇంట్లో లేదా కార్యాలయంలో గడియారాన్ని తప్పు దిశలో ఉంచినట్లయితే, అది మీకు ప్రతికూల ఫలితాలను తెస్తుంది. అందువల్ల, సరైన దిశను ఎంచుకోవడం చాలా ముఖ్యం. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇల్లు లేదా కార్యాలయంలో దక్షిణ గోడపై గడియారాన్ని పెట్టకూడదు. ఎందుకంటే దక్షిణ దిశను యమ దిశగా పరిగణిస్తారు. ఆ దిక్కును మృత్యుదేవతగా పరిగణిస్తారు. ఈ దిశలో గడియారాన్ని ఉంచడం ద్వారా, వ్యాపార మార్గంలో అడ్డంకులు ఎదురవుతాయి. అంతేకాదు ఇది ఇంట్లో ఉన్న వ్యక్తులపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇంటి దక్షిణ దిశలో కాకుండా, ఇంటి ప్రధాన ద్వారం పైన గడియారాన్ని ఉంచకూడదు.
దిండు కింద వాచ్ ఉంచవద్దు:
మనలో చాలా మందికి రాత్రి పడుకునేముందు చేతికి ఉన్న వాచ్ ను తీసి దిండు కింద పెట్టుకునే అలవాటు ఉంటుంది. కానీ వాస్తు ప్రకారం వాచీని దిండు కింద పెట్టుకుని నిద్రించకూడదు. దిండు కింద గడియారం పెట్టుకుని నిద్రిస్తే.. దాని శబ్దం మన నిద్రకు భంగం కలిగించడమే కాదు.. దాని నుంచి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు మన మెదడు, గుండెపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. ఈ తరంగాల కారణంగా, మొత్తం గదిలో ప్రతికూల శక్తి ప్రసరిస్తుంది. ఇది మీ మనశ్శాంతికి భంగం కలిగిస్తుంది. మీ భావజాలాన్ని ప్రతికూలంగా చేస్తుంది.
ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంచకూడదు:
మీరు ఆగిపోయిన గడియారాన్ని ఇంట్లో ఉంచకూడదు. ఆగిపోయిన గడియారాన్ని అశుభంగా పరిగణిస్తారు. కష్టాలు ఎదురవ్వుతాయి. కొందరు సమయాన్నిపది నిమిషాల ముందుకు లేదా వెనక్కు పెడతారు. అలా చేయడం కూడా ఏమాత్రం మంచిది కాదు. గుండ్రంగా లేదా చతురస్రాకారంలో ఉండే గడియారాన్ని ఇంట్లో అమర్చుకోవాలి.
Also Read : Vastu Tips in Telugu: ఇంట్లో ఈ రంగులు అస్సలు వేయొద్దు - వాస్తు దోషంతో కష్టాలు వెంటాడుతాయ్!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.