Diwali2023: దీపావళికి ముందు ఈ 7 పనులు చేస్తే ధనలక్ష్మీ ఆశీర్వాదం మీ వెంటే…!!
దీపావళి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని అమావాస్య తేదీన జరుపుకుంటారు. దీపావళి 2023 ఈ ఏడాది నవంబర్ 12న రానుంది. దీపావళి పండగకు ముందు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.
హిందూ మతంలో, దీపావళి పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. దీపావళి రోజున దేశం మొత్తం దీపాల కాంతితో వెలిగిపోతుంది. దీపావళి ప్రతి ఏడాది కార్తీక మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం దీపావళి 12 నవంబర్ 2023 న వస్తోంది. ఈ రోజున, లక్ష్మీ దేవి, గణేశుడిని ఆనందం శ్రేయస్సును కోరుకుంటూ పూజిస్తారు. దీపావళి రోజున రాముడు లంకాపతి రావణుడిని చంపి అయోధ్యకు తిరిగి వచ్చాడనే నమ్మకం ఉంది. 14 ఏళ్ల వనవాసం ముగించుకుని శ్రీరాముడు తిరిగి వచ్చిన సందర్భంగా అయోధ్య ప్రజలు ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించారు. అప్పటి నుండి, దీపావళిని దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం గొప్ప వైభవంగా జరుపుకుంటారు. దీనితో పాటు, లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి, దీపావళికి ముందు కొన్ని పనులు చేయాలి. ఇలా చేయడం ద్వారా ఏడాది పొడవునా లక్ష్మి దేవి తన ఆశీస్సులను కొనసాగిస్తుంది.
ఇల్లు శుభ్రపరచడం:
దీపావళికి కొన్ని రోజుల ముందు ఇంటిని శుభ్రం చేయడం ప్రారంభించండి ఇంటిలోని ప్రతి మూలను పూర్తిగా శుభ్రం చేయండి. ధూళి ఎక్కువగా ఉన్న ఇంటికి లక్ష్మీదేవి రాదని నమ్ముతారు.
ఇంట్లో నుండి పనికిరాని వస్తువులను బయటకు పారేయండి:
దీపావళికి ముందు , ఇంట్లో ఏ మూలలో చెత్తను ఉంచవద్దు. మీ ఇంట్లో ఏవైనా విరిగిపోయిన లేదా పాత వస్తువులు ఉంటే, దీపావళికి ముందు వాటిని ఇంట్లో నుండి విసిరేయండి.
పూజ గది పరిశుభ్రత:
దీపావళికి ముందు మీ పూజ గదిని శుభ్రం చేయడం మర్చిపోవద్దు . శుభ్రం చేసిన తర్వాత ఇంట్లో గంగాజలం చల్లాలి. వాస్తు ప్రకారం, దీపావళి సమయంలో, పూజ గదిని ఎరుపు, ఆకుపచ్చ, గులాబీ, పసుపు నారింజ రంగులతో అలంకరించాలి.
విరిగిన విగ్రహాలను పారేయండి:
వాస్తు ప్రకారం, విరిగిన విగ్రహాలను పూజించకూడదు. అలా చేయడం అశుభంగా భావిస్తారు. అందుకే, దీపావళి పూజకు ముందు, విరిగిన విగ్రహాలను నిమజ్జనం చేయండి లేదా వాటిని చెట్టు కింద ఉంచండి.
ఆగిపోయిన గడియారాలను పారేయండి:
ఇంట్లో ఏదైనా పాత ఆగిపోయిన వాచ్ ఉంటే, దీపావళికి ముందు ఖచ్చితంగా దాన్ని తీసివేయండి. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో విరిగిన లేదా ఆగిపోయిన గడియారం కుటుంబ సభ్యుల పురోగతికి అడ్డంకులు తెస్తుంది.
కిటికీల తలుపులు శుభ్రపరచడం:
దీపావళికి ముందు, ఇంటి ప్రధాన ద్వారం కిటికీలు తలుపులు పూర్తిగా శుభ్రం చేయండి. అలాగే, కిటికీలు తలుపుల నుండి శబ్దం వచ్చినట్లయితే, ఖచ్చితంగా వాటిని మరమ్మతు చేయండి.
విరిగిన మంచాన్ని తీసేయండి:
వాస్తు ప్రకారం ఇంట్లో విరిగిన మంచాన్ని ఉపయోగించకూడదు. దీని వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. మనస్సు ఆందోళన చెందుతుంది. అందుకని దీపావళికి ముందు ఇంట్లోంచి విరిగిన మంచాన్ని తీసేయండి.
ప్రధాన ద్వారం, పూజాగది అలంకరణ:
దీపావళికి మీ ఇంటి ప్రధాన ద్వారం, పూజాగదిని అలంకరించాలి. ఈ రోజు ఇంటి ప్రధాన గుమ్మానికి మామిడి ఆకులు కట్టి ద్వారం ముందు రంగోలి వేయండి. ఇంటి పెరట్లో లైటింగ్ ఏర్పాటు చేయండి. ఇంట్లో మంచి వెలుతురు ఉండాలి. చీకటి ఉండకూడదు. మత విశ్వాసాల ప్రకారం, లక్ష్మి దేవి శుభ్రమైన, ప్రకాశవంతమైన ప్రదేశాలను ఇష్టపడుతుంది.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.