News
News
X

Valentine Day Special: ఈ మంత్రం జపిస్తే లవ్ సక్సెస్ అవుతుందట

లోకాలన్నింటినీ మోహింప చేయగల శక్తి ఉన్నవాడు మన్మథుడు.. మన్మథుడినే మైమరపించే శక్తి ఉన్న అతిలోత సౌందర్యవతి రతీదేవి. వీరిద్దరి ప్రేమ, వివాహం...మరు జన్మ గురించి ఆసక్తికర విషయాలు...

FOLLOW US: 

పురాణాల్లో ప్రేమకు సంకేతం రతీ మన్మథులు. మన్మథునిని కామదేవుడు, కాముడు, మదనుడు, రతికాంతుడు అని ఎన్నో పేర్లతో పిలుస్తారు. ఆయన అర్థాంగి రతీదేవి. ప్రేమికులకు, ప్రేమకు సరైన నిర్వచనం చెప్పే ఈ జంటని తలుచుకుంటే ప్రేమ సఫలం అవుతుందంటారు. వీరికి సంబంధించి ప్రేమ, వివాహం గురించి 'కామవివాహం' అనే పేరుతో శివపురాణం రుద్రసింహతలో ఉంది. 

భారతీయ సాహిత్యంలో ప్రేమదేవతగా పిలిచే పాత్ర రతీదేవి. ఆమె ప్రజాపతి పుత్రిక అని కొందరు, దక్షుని కుమార్తె అని ఇంకొందరు అంటారు. మన్మథుడు బ్రహ్మ మనసు నుంచి జన్మించిన తర్వాత ఆ బ్రహ్మదేవుడు తనతో సహా అందరినీ మోహింప చేయ గల శక్తిని మన్మథుడికి అనుగ్రహించాడు. ఆ శక్తిని తానొకసారి పరీక్షించి చూసుకోవాలని అనుకున్న మన్మథుడు... వెంటనే అక్కడే ఉన్న బ్రహ్మ మానసపుత్రిక అయిన సంధ్య, మరీచి, దక్షుడు లాంటి వారితో సహా బ్రహ్మదేవుడి మీద కూడా తన పూలబాణాలను ప్రయోగించాడు. ఎంతో కఠినమైన ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగిన వారంతా తమకు కామ వికారం కలగడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అంతలో అక్కడ శివుడు ప్రత్యక్షమై ఆ వికారానికి కారణం మన్మథుడని తెలుసుకుని ఆగ్రహం చూపుతాడు.  శివుడి కోపాన్ని తట్టుకోలేక మన్మ థుడు పక్కకు తొలిగాడు. ఇంతలో బ్రహ్మ కూడా వాస్తవ స్థితికి వచ్చి తనను సైతం వికారానికి గురిచేసిన మన్మథుడు శివుడి మూడో కంటి అగ్ని జ్వాలలకు అంతమవు తాడని శపిస్తాడు.

Also Read: తొలిచూపులోనే భీముడితో ప్రేమలో పడిన హిడింబి

మన్మథుడికి బ్రహ్మ శాపం
శివుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడని గ్రహించిన మన్మథుడు మెల్లగా బ్రహ్మ దగ్గరకు వచ్చి, తనకిచ్చిన శాపాన్ని ఉపసంహరించుకోవాలని అర్థిస్తాడు . బ్రహ్మ మన్మథుడికి ధైర్యం చెబుతూ దైవ ప్రేరణతోనే అలా జరిగిందని... శివుడి కోపాగ్నికి నువ్వు దహనం కావడంలో కుమార జననం అనే దివ్య సంఘటన ఇమిడి ఉంది. శివుడి మూడో నేత్రానికి దహనమైనా ఆ తర్వాత మళ్లీ నీకు మేలే జరుగుతుందని అని బ్రహ్మ.. మన్మ థుడికి చెబుతాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు దక్ష ప్రజాపతి మన్మథుడి దగ్గరకు వచ్చి తన స్వేదం నుంచి పుట్టిన తన కుమార్తెను వివాహమాడాలని కోరతాడు. ఆమె పేరు రతీదేవి అని, సర్వలోక సౌందర్యవతి అని చెప్పి రతికి, మన్మథుడికి దక్ష ప్రజాపతి వివాహం చేస్తాడు. మన్మథుడు రతి అనే శోభాయుక్తమైన తన భార్యను చూసి అనురాగం నిండిన మనసు కలవాడయ్యాడు. ఆ క్షణంలో మన్మథుడి బాణాలు మన్మథుడినే కొట్టాయి. దీంతో మదనుడు కూడా సమ్మోహనం చెందుతాడు. నా బాణాలకన్నా ఆమె చూపులే వేగవంతంగా ఉన్నాయని ఆశ్చరప్యపోతాడు. ఏది పున్నమి చంద్రుడో, ఏది రతీదేవి ముఖమో తెలియనంతగా రెప్పవేయకుండా చూస్తుండిపోతాడు మన్మథుడు. రతీదేవితో ఆనందంగా ఉన్న మన్మథుడు... బ్రహ్మ ఇచ్చిన శాపం గురించి మరిచిపోతాడు. తారకాసురుడిని సంహరించడం కోసం పార్వతికి శివుడికి జన్మించే కుమారుడే తగిన వాడని బ్రహ్మ దేవతలకు చెప్పడంతో దేవతలంతా వెళ్లి తపోనిష్ఠలో ఉన్న పరమేశ్వరుడి మనసు మార్చటానికి మన్మథుడిని ఆశ్రయిస్తారు. దైవకార్యం నెరవేర్చటానికి సిద్ధమైన మన్మథుడు ఆ ప్రయత్నంలో భాగంగా శివుడి ఆగ్రహానికి మాడి మసైపోతాడు. 

శివుడు కోపాగ్నికి దగ్ధమైన మన్మథుడు ఆ తరువాత ఏమయ్యాడో భాగవతంలో వ్యాసుడు చెప్పిన కథ ఇది
శివుడి ఆగ్రహానికి మాడి మసైపోయిన మన్మథుడిని చూసి రతీ దేవి విలపిస్తుండగా దేవతలంతా ఆమెను ఓదార్చి.. మన్మథుడు తిరిగి ప్రద్యుమ్నుడు అనే పేరుతో జన్మిస్తాడని చెబుతారు. రతీ దేవికి నమ్మకం కలిగేందుకు నారదుడు మరింత క్లారిటీ ఇస్తాడు.  కృష్ణుడికి రుక్మిణిదేవికి ప్రద్యుమ్నుడు జన్మిస్తాడు. అయితే జన్మించిన కొద్ది రోజుల్లోనే శంబరాసురుడు అనే ఒక అనే రాక్షసుడు ప్రద్యుమ్నుడిని సంహరించే ప్రయత్నం చేస్తాడు. ఆ రాక్షసుడి బారినుంచి బాలుడిని రక్షించుకోమని నారదుడు రతీదేవికి చెబుతాడు.  ఆ దేవముని చెప్పిన మాటలు అనుసరించి మాయావతి అనే పేరుతో శంబరాసురుడి ఇంట్లోనే దాసిగా చేరింది రతీదేవి. ఆ తర్వాత బాలుడు పుట్టిన ఎనిమిది రోజులకే శంబరాసురుడు  కాకి రూపంలో రహస్యంగా పురిటింటిలో ప్రవేశించి ఆ బాలుడిని తీసుకెళ్లి సముద్రంలో పడేశాడు. 

రతీదేవిని చేరుకున్న మన్మథుడు 
సముద్రంలో పడిన బాలుడిని ఒక పెద్ద చేప మింగింది. ఆ చేప జాలరి వలకు చిక్కడంతో..పెద్దగా, అందంగా , విచిత్రంగా ఉన్న చేపని తీసుకెళ్లి మళ్లీ శంబరాసురుడికి కానుకగా ఇస్తాడు జాలరి. వంటపని చేసేవాడు చేపను తరిగి చూడగా  దాని కడుపులోంచి బాలుడు బయటపడిన విషయం..అక్కడే దాసీ రూపంలో ఉన్న రతీదేవి జాగ్రత్తగా కాపాడుతూ వచ్చింది.  యుక్త వయస్సుకు వచ్చిన తర్వాత ఒక రోజున ఆమె గతాన్నంతా వివరించి చెప్పింది. అదే సమయంలో  శంబరాసురుడిని జయించటానికి తనకు తెలిసిన మహామాయ అనే విద్యను నేర్పించింది. ఆ విద్య సహాయంతో రాక్షసుడిని సంహరించిన  ప్రద్యుమ్నుడు రతీదేవితో కలసి ఆకాశ మార్గాన ద్వారకా నగరానికి వెళతారు.  శ్రీకృష్ణుడి లా రూపురేఖలున్న ప్రద్యుమ్నుడిని చూసి అందరూ కృష్ణుడేమోనని అనుకుంటారు.  రుక్మిణీదేవి కూడా పురిట్లోనే తనకు దూరమైన తనయుడు ఉండిఉంటే ఇలాగే ఉండేవాడేమో అనుకుంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన నారదుడు విషయమంతా వివరిస్తాడు. ఆ తర్వాత ప్రద్యుమ్నుడు రతీదేవితో పాటూ రుక్మిణి సోదరుడు రుక్మి కుమార్తె అయిన రుక్మవతిని పెళ్లిచేసుకుంటాడు. ఆ వివాహం వల్ల శ్రీకృష్ణుడికి రుక్మిణి సోదరుడైన రుక్మికి ఉన్న విరోధం నశిస్తుంది. 

మన్మథునికి ప్రత్యేకించి ఆలయాలేవీ లేకపోవచ్చు. కానీ అనేక భార్య రతీదేవితో కలిసి మన్మథుడు చేసే ప్రేమప్రయాణం అనేక ప్రాచీన ఆలయాల గోడలపై చిత్రాలుగా కనిపిస్తుంది.  మన్మథుని పేరుతో ఎన్నో పర్వదినాలు కూడా మన గ్రంథాల్లో కనిపిస్తాయి. ఫాల్గుణ కృష్ణ తదియ రోజు కామమహోత్సవం అనీ, చైత్ర శుద్ధ త్రయోదశి మదన త్రయోదశి అనీ మన్మథుని కొలుచుకునేందుకు కేటాయించారు.  ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున వచ్చే హోళీ (కాముని పున్నిమ) రోజునే మన్మథుని శివుడు దహించివేశాడంటారు. అందుకు సూచనగా కొన్ని ప్రాంతాలలో మంటలు వేయడం కనిపిస్తుంది.  

మన్మథుని ప్రసన్నం చేసుకునేందుకు కామగాయత్రి పేరుతో మంత్రం కూడా ఉంది. ఈ మంత్రాని పఠిస్తే జీవితంలో మంచి తోడు దొరకడంతో పాటూ బంధం కలకాలం నిలిచి ఉంటుందని చెబుతారు. 
'ఓం కామ దేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి తన్నో అనంగ ప్రచోదయాత్!'

Also Read: పగలు కనిపించి రాత్రి పూట మాయమయ్యే శివలింగం , అక్కడ క్షణం క్షణం అద్భుతమే

 

Published at : 14 Feb 2022 07:54 AM (IST) Tags: story of rati and kamdev rati kamdev and rati indian gods and goddess kamdev and rati story kamdev and rati love story

సంబంధిత కథనాలు

Navratri 2022: శరన్నవరాత్రుల్లో రెండోరోజు పఠించాల్సిన స్తోత్రం

Navratri 2022: శరన్నవరాత్రుల్లో రెండోరోజు పఠించాల్సిన స్తోత్రం

Navratri 2022: ఆయుష్షు కీర్తినిచ్చే బాలా త్రిపుర సుందరీదేవి, అమ్మవారు ఆవిర్భావం ఎలా జరిగిందంటే!

Navratri 2022: ఆయుష్షు కీర్తినిచ్చే బాలా త్రిపుర సుందరీదేవి, అమ్మవారు ఆవిర్భావం ఎలా జరిగిందంటే!

Horoscope Today 27th September 2022: మేషం, సింహం సహా ఈ రాశులవారిపై బాలాత్రిపుర సుందరి ఆశీస్సులు ఉంటాయి, సెప్టెంబరు 27 రాశిఫలాలు

Horoscope Today 27th September 2022: మేషం, సింహం సహా ఈ రాశులవారిపై బాలాత్రిపుర సుందరి ఆశీస్సులు ఉంటాయి, సెప్టెంబరు 27 రాశిఫలాలు

Brihadeeshwara Temple: ఈ ఆలయం నీడ నేల మీద పడదు, హీరో విక్రమ్ చెప్పిన ఆ ‘అద్భుత’ దేవాలయం ఇదే!

Brihadeeshwara Temple: ఈ ఆలయం నీడ నేల మీద పడదు, హీరో విక్రమ్ చెప్పిన ఆ ‘అద్భుత’ దేవాలయం ఇదే!

Tirumala Brahmotsavam 2022: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ‌, సెప్టెంబర్ 27న సీఎం పట్టువస్త్రాల సమర్పణ

Tirumala Brahmotsavam 2022: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ‌, సెప్టెంబర్ 27న సీఎం పట్టువస్త్రాల సమర్పణ

టాప్ స్టోరీస్

NIA Searches: పీఎఫ్ఐపై ఎన్ఐఏ ఫోకస్! దేశవ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్, పలువురి అరెస్టు - సడెన్‌గా ఎందుకిలా?

NIA Searches: పీఎఫ్ఐపై ఎన్ఐఏ ఫోకస్! దేశవ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్, పలువురి అరెస్టు - సడెన్‌గా ఎందుకిలా?

Kcr Reservation Politics : రిజర్వేషన్ల అంశానికి కేసీఆర్ ఎలాంటి ముగింపు తీసుకు రాబోతున్నారు ? గిరిజన కోటా జీవో ఎందుకు ఆలస్యం అవుతోంది ?

Kcr Reservation Politics :    రిజర్వేషన్ల అంశానికి కేసీఆర్ ఎలాంటి ముగింపు తీసుకు రాబోతున్నారు ? గిరిజన కోటా  జీవో ఎందుకు ఆలస్యం అవుతోంది ?

YSRCP News: టీడీపీ బంగాళాఖాతంలోకి, ఆగని పేరు మార్పు రచ్చ! వరుస ట్వీట్లతో కౌంటర్ ఇస్తున్న వైసీపీ నేతలు

YSRCP News: టీడీపీ బంగాళాఖాతంలోకి, ఆగని పేరు మార్పు రచ్చ! వరుస ట్వీట్లతో కౌంటర్ ఇస్తున్న వైసీపీ నేతలు

Chiranjeevi - Godfather Climax Fight : 'గాడ్ ఫాదర్' క్లైమాక్స్ - చిరు, సల్మాన్ ఫ్యాన్స్‌కు ట్రీట్ - ఎక్స్‌క్లూజివ్ న్యూస్ ఏంటంటే?

Chiranjeevi - Godfather Climax Fight : 'గాడ్ ఫాదర్' క్లైమాక్స్ - చిరు, సల్మాన్ ఫ్యాన్స్‌కు ట్రీట్ - ఎక్స్‌క్లూజివ్ న్యూస్ ఏంటంటే?