(Source: Poll of Polls)
Kirit Shakti Peeth: చెట్ల వేళ్ళతో అల్లుకున్న పురాతన శివాలయం, ఇదో శక్తిపీఠం! తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ప్రదేశం!
Shri Kiriteswari Temple: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ముర్షిదాబాద్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ ఆలయం, శక్తిపీఠం గురించి ఇక్కడ తెలుసుకుందాం. ముర్షిదాబాద్ జిల్లాలోని అత్యంత పురాతన ఆలయం ఇది

Kiriteswari Gupta Mandir Murshidabad: పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ జిల్లా కిరీటేశ్వరి శక్తిపీఠం (కిరిట్‌కోనా గ్రామంలో) ఉంది. ఈ సమీపంలోనే చెట్ల వేళ్లు తో అల్లుకున్న పురాతన శివాలయం ఇది. కిరీటేశ్వరి గుప్త మందిర్ (Kiriteshwari Gupta Mandir) పాత శివాలయం అంటారు. భక్తులు, పర్యాటకులు తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ప్రదేశాలు ఇవి.

కిరీటేశ్వరి శక్తిపీఠం
ఈ ఆలయం వెయ్యి సంవత్సరాలకు పైబడినది. 1405లో ముస్లిం ఆక్రమణల సమయంలో ధ్వంసమైంది. ప్రస్తుత కిరీటేశ్వరి ఆలయం 19వ శతాబ్దంలో రాజా దర్పనారాయణ్ రాయ్ ద్వారా పునర్నిర్మితమైంది. ముర్షిదాబాద్ రాజుల కులదేవతగా పూజలందుకుంది. ప్రస్తుతం ఈ పాత శివాలయం కొద్ది ఆనవాళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆలయం పూర్తిగా కూలిపోయి, చుట్టూ పెరిగిన మర్రిచెట్టు వేళ్లు విగ్రహంపై అల్లుకుని సహజ సౌందర్యాన్నిస్తాయ్. అందుకే దీనిని అల్లుకున్న శివాలయం అని కూడా భక్తులంటారు.

ఊడల మధ్య శివుడు
ఇక్కడ చెట్ల ఊడలు అల్లుకున్న శివుడిని దర్శించుకోవడం ప్రత్యేకంగా భావిస్తారు భక్తులు. స్థానికుల విశ్వాసం ప్రకారం ఈ ఆలయం శివుడి భార్య సతీదేవి "నిద్రించిన స్థలం" అని చెబుతారు. 51 శక్తిపీఠాలలో ఒకటిగా, సతీదేవి కిరీటం (తలపట్టు) పడిన చోటుగా ప్రసిద్ధి. హిందూ పురాణాల ప్రకారం దక్ష యాగం సమయంలో పుట్టింట్లో అవమానం భరించలేక సతీదేవి ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత ఆమె శరీరాన్ని విష్ణువు తన సుదర్శన చక్రంతో ముక్కలు చేశాడు. ఆ భాగాలు భూమి మీద పడిన చోట్ల శక్తి పీఠాలు ఏర్పడ్డాయి. కిరీటేశ్వరిలో సతీ దేవి ముకుటం (కిరీటం) పడిందని చెబుతారు. అందుకే ఇక్కడ అమ్మవారిని 'విమలా' (పవిత్రమైనది)గా పూజిస్తారు. ఇది శరీర భాగం కాకుండా ముకుటం పడిన చోట కాబట్టి, కొందరు దీన్ని 'ఉప-పీఠం'గా పిలుస్తారు.

ఈ ఆలయానికి ఎలా వెళ్లాలి?
కిరిట్‌కోనా గ్రామం, నబాగ్రామ్ బ్లాక్, లాల్‌బాగ్ సబ్-డివిజన్, ముర్షిదాబాద్ జిల్లా, పశ్చిమ బెంగాల్. భాగీరథి నది ఒడ్డున ఉంది ఉంది ఈ ఆలయం. కిరీటేశ్వరి ఆలయం నుంచి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దహపారా ధామ్ రైల్వే స్టేషన్ నుంచి 5 కిలోమీటర్లు... ముర్షిదాబాద్ స్టేషన్ నుంచి ఫెర్రీ ద్వారా భాగీరథి నది దాటి..లోకల్ వెహికల్ లో వెళితే అరగంటలో ఆలయాన్ని చేరుకోవచ్చు. కోల్ కతా నుంచి 195 కిలోమీటర్లు. బస్సులో ప్రయాణం చేస్తే నాలుగైదు గంటలు పజుతుంది. కోల్ కతా నెతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టాక్సీలో వెళ్లొచ్చు.
ఆలయ టైమింగ్స్
రోజూ సూర్యోదయం నుంచి రాత్రి 9 గంటల వరకూ ఆలయం తెరిచి ఉంటుంది. మహాశివరాత్రి, దుర్గా పూజలు , పౌష్ మేళా (డిసెంబర్-జనవరి)లో ఫోక్ డాన్స్‌లు, కుమారి పూజలు జరుగుతాయి. భక్తులు నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించి పూజలు చేయొచ్చు.
ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ ప్రాంతం 2023 సెప్టెంబర్‌లో భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ద్వారా బెస్ట్ టూరిజం విలేజ్ ఆఫ్ ఇండియాగా ఎంపికైంది. ఇది గ్రామీణ టూరిజాన్‌ను ప్రోత్సహించడానికి 795 గ్రామాల నుంచి ఎంపికైంది. దీనికి సమీపంలో 16 చిన్న ఆలయాల కాంప్లెక్స్ ఉంది..అందులో పరమేశ్వరుడు, కాలభైరవుడి ఆలయాలున్నాయి.
ఈ శక్తిపీఠం ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుంది. భక్తులు, పర్యాటక ప్రేమికులు దర్శించుకోవాల్సిన అద్భుత ప్రదేశం ఇది.






















