Today Panchang 18th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, వినాయక శ్లోకం
కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్య పూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి...
మే 18 బుధవారం పంచాంగం
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
తేదీ: 18- 05 - 2022
వారం: బుధవారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, బహుళపక్షం
తిథి : విదియ బుధవారం ఉదయం 5.44 వరకు తదుపరి తదియ రాత్రి తెల్లవారుజామున 2.54
వారం : బుధవారం
నక్షత్రం: జ్యేష్ట మధ్యాహ్నం 10.48 తదుపరి మూల
వర్జ్యం : సాయంత్రం 6.22 నుంచి 7.53 వరకు
దుర్ముహూర్తం : ఉదయం 11.31 నుంచి 12.23 వరకు
అమృతఘడియలు : రాత్రితెల్లవారుజామున 3.28 నుంచి 4.59 వరకు
సూర్యోదయం: 05:31
సూర్యాస్తమయం : 06:21
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
బుధవారం వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన రోజు.బుధవారం వినాయకుడికి ఎర్ర మందారాలతో పూజించడంవల్ల అనుకున్న కార్యాలు నెరవేరుతాయి.చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ముఖ్యంగా గణేషుడి ముందు గుంజీలు తీస్తే చాలామంచిది అంటారు. అంటే భక్తులు గుంజీలు తీయడం గణనాథుడికి ఇష్టమా...దీని వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది.
శ్రీ మహావిష్ణువు ఓసార కైలాసానికి వెళ్లాడట. అక్కడ మర్యాదలన్నీ అయ్యాక శివ,కేశవులిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో అక్కడకు వచ్చిన గణపతి చటుక్కున్న శ్రీహరి చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని విచిత్రంగా చూసి చటుక్కున తీసుకుని నోట్లో పెట్టేసుకున్నాడు. విష్ణువు ఎంత బతిమాలినా వినాయకుడు ఆ చక్రం తిరిగివ్వలేదు. చిన్నపిల్లాడు కదా ఏం చేద్దాం అని ఆలోచించిన శ్రీమహావిష్ణువు రెండు చేతులతో చెవులు పట్టుకుని సరదాగా గుంజీలు తీయడం ప్రారంభించాడట. అది చూసి బాలగణేషుడు నవ్వటం మొదలెట్టాడట.అప్పుడు గణపతి నోట్లోంచి విష్ణుచక్రం కిందపడింది. అలా తనపని పూర్తిచేసుకోవడం కోసం సాక్షాత్తూ విష్ణుమూర్తి గుంజీలు తీయడంతో..అప్పటి నుంచి భక్తులు కూడా వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు గుంజీలు తీయడం ప్రారంభించారు.
సిద్ధి వినాయక స్తోత్రం
విఘ్నేశ విఘ్నచయఖండననామధేయ
శ్రీశంకరాత్మజ సురాధిపవంద్యపాద |
దుర్గామహావ్రతఫలాఖిలమంగలాత్మన్
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ||
సత్పద్మరాగమణివర్ణశరీరకాంతిః
శ్రీసిద్ధిబుద్ధిపరిచర్చితకుంకుమశ్రీః |
దక్షస్తనే వలయితాతిమనోజ్ఞశుండో
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ||
పాశాంకుశాబ్జపరశూంశ్చ దధచ్చతుర్భి-
-ర్దోర్భిశ్చ శోణకుసుమస్త్రగుమాంగజాతః |
సిందూరశోభితలలాటవిధుప్రకాశో
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ||
కార్యేషు విఘ్నచయభీతవిరంచిముఖ్యైః
సంపూజితః సురవరైరపి మోదకాద్యైః |
సర్వేషు చ ప్రథమమేవ సురేషు పూజ్యో
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ||
శీఘ్రాంచనస్ఖలనతుంగరవోర్ధ్వకంఠ
స్థూలేందురుద్రగణహాసితదేవసంఘః |
శూర్పశ్రుతిశ్చ పృథువర్తులతుంగతుందో
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ||
యజ్ఞోపవీతపదలంభితనాగరాజో
మాసాదిపుణ్యదదృశీకృతఋక్షరాజః |
భక్తాభయప్రద దయాలయ విఘ్నరాజ
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ||
సద్రత్నసారతతిరాజితసత్కిరీటః
కౌసుంభచారువసనద్వయ ఊర్జితశ్రీః |
సర్వత్ర మంగలకరస్మరణప్రతాపో
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ||
దేవాంతకాద్యసురభీతసురార్తిహర్తా
విజ్ఞానబోధనవరేణ తమోఽపహర్తా |
ఆనందితత్రిభువనేశ కుమారబంధో
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ||
ఇతి శ్రీముద్గలపురాణే శ్రీ సిద్ధి వినాయక స్తోత్రం |
ఇతి శ్రీ సిద్ధి వినాయకార్పణమస్తు ||
Also Read: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!
Also Read: మీరు ఏప్రిల్ లో పుట్టారా- కోపం పక్కనపెడితే మీలో ఎన్ని ప్లస్ లు ఉన్నాయో తెలుసా
Also Read: ఈ నెలలో పుట్టిన వారు లవ్ లో ఫెయిల్ అవుతారు, వ్యక్తిగతంగా సక్సెస్ అవుతారు