Today Panchang 13th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, పరశురామ ద్వాదశి ప్రత్యేకత
కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్య పూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి...
మే 12 గురువారం పంచాంగం
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
తేదీ: 13- 05 - 2022
వారం: శుక్రవారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, శుక్లపక్షం
తిథి : ద్వాదశి శుక్రవారం మధ్యాహ్నం 2.34 వరకు తదుపరి త్రయోదశి
వారం : శుక్రవారం
నక్షత్రం: హస్త సాయంత్రం 4.27 తదుపరి చిత్త
వర్జ్యం : రాత్రి 12.25 నుంచి 2.00
దుర్ముహూర్తం : ఉదయం 8.06 నుంచి 8.57 తిరిగి మధ్యాహ్నం 12.22 నుంచి 1.13
అమృతఘడియలు : ఉదయం 10.28 నుంచి 12.04
సూర్యోదయం: 05:33
సూర్యాస్తమయం : 06:20
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
శుక్రవారం ద‌్వాదశి తిథి...ఈ రోజు వచ్చే ద్వాదశిని పరశురామ ద్వాదశి అంటారు. ఈ సందర్భంగా పరశురాముడి గురించి కొన్ని విషయాలతో పాటూ... శ్రీ పరశురామ స్తుతిః మీకోసం....
పరశురామ అంటే పార్షుతో రాముడు.. అది గొడ్డలి. క్రూరత్వం నుంచి భూమిని కాపాడటానికి పరశురాముడి అవతరించాడు. ఆయన శివ భక్తుడు. ఆయన ఆయుధం గొడ్డలి. పరశురాముడు ప్రసేనాజిత్ కుమార్తె రేణుక, బ్రిగు రాజవంశీయులైన జమదగ్ని దంపతులకు ఐదవ కుమారుడిగా జన్మించాడు. లక్ష్మీ అవతారమైన ధనవిని పెళ్లిచేసుకున్నాడు. హిందూ పురాణాల ప్రకారం పరశురాముడు చిరంజీవి. ఆయన ఇప్పటికీ జీవించిఉన్నట్టు విశ్వశిస్తారు. భీష్ముడు, ద్రోణాచార్యులు, కర్ణుడు...వీరి ముగ్గురి గురువు పరశురాముడు. ఈ అవతారాన్ని ఆవేశావతారం అంటారు... అంటే భగవంతుడికి ఆవేశం ఉన్నంతవరకే పరశురాముడు తన అవతార లక్ష్యాన్ని నేరవేర్చగాలుగుతాడు . ఈ రోజు పరశురామ ద్వాదశి సందర్భంగా శ్రీ పరశురామ స్తుతి....
శ్రీ పరశురామ స్తుతిః
కులాచలా యస్య మహీం ద్విజేభ్యః
ప్రయచ్ఛతః సోమదృషత్త్వమాపుః |
బభూవురుత్సర్గజలం సముద్రాః
స రైణుకేయః శ్రియమాతనీతు ||
నాశిష్యః కిమభూద్భవః కిపభవన్నాపుత్రిణీ రేణుకా
నాభూద్విశ్వమకార్ముకం కిమితి యః ప్రీణాతు రామత్రపా |
విప్రాణాం ప్రతిమన్దిరం మణిగణోన్మిశ్రాణి దణ్డాహతే-
ర్నాంబ్ధీనో స మయా యమోఽర్పి మహిషేణాంభాంసి నోద్వాహితః ||
పాయాద్వో యమదగ్నివంశతిలకో వీరవ్రతాలఙ్కృతో
రామో నామ మునీశ్వరో నృపవధే భాస్వత్కుఠారాయుధః |
యేనాశేషహతాహితాఙ్గరుధిరైః సన్తర్పితాః పూర్వజా
భక్త్యా చాశ్వమఖే సముద్రవసనా భూర్హన్తకారీకృతా ||
ద్వారే కల్పతరుం గృహే సురగవీం చిన్తామణీనఙ్గదే
పీయూషం సరసీషు విప్రవదనే విద్యాశ్చతస్రో దశ |
ఏవం కర్తుమయం తపస్యతి భృగోర్వంశావతంసో మునిః
పాయాద్వోఽఖిలరాజకక్షయకరో భూదేవభూషామణిః ||
ఇతి శ్రీ పరశురామ స్తుతిః |
Also Read: ఈ ఐదు రాశులవారికి పెళ్లికన్నా సహజీవనమే ఇష్టమట, మీరున్నారా ఇందులో
Also Read: 2022-2023లో ఈ రాశివారు ఆ ఒక్కటీ తప్ప అన్ని విషయాల్లోనూ మహారాజులే