News
News
X

విదుర నీతి: మీలో ఈ లక్షణాలుంటే నేరుగా నరకానికే!

కొన్ని పనులు చెయ్యడం నేరుగా మరణాన్ని కోరి తెచ్చుకున్నట్టే అని మహాభారతంలోని విదుర నీతి చెబుతోంది. అవేమిటో చూడండి.

FOLLOW US: 

న ప్రమేయం పెద్దగా లేకుండానే జీవన శైలీ క్రమంగా మార్పు చెందుతూ వస్తోంది. ఈ మార్పులు మన జీవితం మీద నేరుగా ప్రభావం చూపుతున్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కొన్ని పనులు చెయ్యడం నేరుగా మరణాన్ని కోరి తెచ్చుకున్నట్టే అని మహాభారతంలోని విదుర నీతి చెబుతోంది. అవేంటో చూడండి. 

⦿ తనని తాను గొప్పవాడిగా ఊహించుకుంటూ ఇతరులను తక్కువగా చూసేవాళ్లు చావుకు దగ్గరగా ఉంటారట. ఎందుకంటే వీళ్లకు జీవితంలో విలువైనది ఏదీ ఉండదు.

⦿ అతిగా మాట్లాడేవాళ్లు కూడా అనేక సమస్యలకు కారణమవుతారు. ఇలాంటి వ్యక్తులు ఇతరుల గురించి చెడుగా ప్రచారం చేస్తారు. వీరిని కూడా మృత్యువు వెంటాడుతుంది. అతిగా మాట్లాడడం నరకానికి దగ్గరి దారి.

⦿ తన కోపమే తన శత్రువు. ఇది మానవుని అతిపెద్ద దుర్గుణాల్లో ఒకటి. ఎలాంటి కారణం లేకుండా ఇతరులపై ఆగ్రహం వ్యక్తం చేసేవాళ్లు నేరుగా నరకానికే పోతారట.

News Reels

⦿ ఇతరులకు సేవ చేయనివారు, సహాయపడనివారు కూడా నేరుగా నరకానికి పోతారట. ఎదుటివాళ్లను గౌరవించని వ్యక్తి మానవ జీవితానికి పనికిరాడట.

⦿ విదురుడు చెప్పిన దాని ప్రకారం స్నేహితులను, కుటుంబాన్ని మోసం చేయడం చాలా పెద్ద తప్పు. ఇలాంటి వ్యక్తులకు నరక ద్వారాలు బార్లా తెరచి ఉంటాయట. ముఖ్యంగా స్నేహితులతో నిజాయితీగా ఉండాలి.

⦿ మనిషి దుర్గుణాల్లో అసూయ, స్వార్థం కూడా ఉన్నాయి. ఇలాంటి వాళ్లు ఎప్పుడూ తన స్వార్థం కోసమే ఆలోచిస్తారు. కాబట్టి నరకమే వీరికి ఆహ్వానం పలుకుతుంది. ఈ లక్షణాలను వదిలించుకుంటే జీవితంలో విజయం సాధించడమే కాదు, ఆర్థికంగా, మానసికంగా బలంగా ఉంటారు.

⦿ జీవితంలో మార్పు కోరుకుంటే దాని కోసం ఏదైనా ఆలోచన చెయ్యాలి. అది ఆచరణలో ఉంచాలి. సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలి. మంచి జరగడం కోసం చెడు సమయాల్లో నిర్ణయాలు తీసుకోవద్దు.

⦿ జీవితమంటే మంచి, చెడులు, కష్టసుఖాల కలయిక. కాబట్టి ఎలాంటి వాటినైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలి. చెడు గురించి విచారం వద్దు, అది ఎల్లకాలం ఉండదు.

⦿ డబ్బు శాశ్వతం కాదని గుర్తు పెట్టుకోవాలి. ఇది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఆర్థికంగా స్థిరంగా ఉండాలనే లక్ష్యం కేవలం డబ్బుతో మాత్రమే సాధ్యం కాదు. అందుకు తగిన ఆలోచనా విధానం, ఆచరణ జీవన విధానం ఉండాలి.

⦿ ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోడానికి ప్రయత్నిస్తుండాలి. నేర్చుకునే వాటితో తృప్తి చెందితే అభివృద్ధి అక్కడితో ఆగిపోతుంది.

⦿ ఎక్కడైతే సౌకర్యంగా ఉండడం మొదలవుతుందో ఇక అక్కడ ఉండడం వల్ల నేర్చుకోవడం ఆగిపోతుందని  తెలుసుకోవాలి. జీవితంలో మార్పు సహజం. దానికి సర్వదా సన్నధ్దంగా ఉండాలి.

⦿ భౌతికంగా, ఆర్థికంగా, మానసికంగా మీరు మీ అదుపులోనే ఉండేట్టు జాగ్రత్త పడాలి. అందువల్ల మీ ప్రయాణం మీ అదుపాజ్ఞలలో సాగుతుంది. ప్రతి మలుపు మీ ఎరుకలో ఉంటుంది.

⦿ మీరు మీతో నిజాయితీగా ఉన్నారో లేదో ప్రశ్నించుకోవాలి. ఇతరులకు చెప్పే ముందు ఆత్మ పరిశీలన ద్వారా మనల్ని మనం అంచనా వేసుకోవాలి. అత్మ ప్రబోధానికి మించిన జ్ఞాన బోధ లేదు.

⦿ కాస్త ఒత్తిడి మంచి జీవితానికి దారి ఏర్పాటు చేసుకునేందుకు అవసరం. కాబట్టి కొన్ని విషయాల్లో ఒత్తిడి విజయానికి దోహదం చేస్తుంది. విజయం కావాలనుకుంటే కాస్త ఒత్తిడిని భరించే శక్తి కలిగి ఉండడం మంచిదే.

Also Read: జీవితంలో విజయం సాధించాలంటే కావల్సిన మొదటి ఆయుధం ఏంటి - విదురుడు ఏం చెప్పాడు!

Published at : 17 Oct 2022 04:59 PM (IST) Tags: vidura neethi vidura neeti Hell

సంబంధిత కథనాలు

Daily Horoscope Today 28th November 2022: ఈ రాశివారికి ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ, నవంబరు 28 రాశిఫలాలు

Daily Horoscope Today 28th November 2022: ఈ రాశివారికి ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ, నవంబరు 28 రాశిఫలాలు

Kaal Bhairav Astami 2022: డిసెంబరు 1 కాలభైరవాష్టమి, దుర్గణాలు తొలగించి సిరి, సంపదలు ఇచ్చే భైరవుడు

Kaal Bhairav Astami 2022:  డిసెంబరు 1 కాలభైరవాష్టమి, దుర్గణాలు తొలగించి సిరి, సంపదలు ఇచ్చే భైరవుడు

Weekly Horoscope 27 November to December 3: ఈ రాశులవారి జీవితంలో ఊహించని మార్పు వస్తుంది, మేషం నుంచి కన్యా రాశి వరకూ వారఫలాలు

Weekly Horoscope 27 November to December 3: ఈ రాశులవారి జీవితంలో ఊహించని మార్పు వస్తుంది,  మేషం నుంచి కన్యా రాశి వరకూ వారఫలాలు

27 November to 3rd December 2022 Weekly Horoscope: ఆర్థిక సమస్యలు తీరుతాయి, అనుకున్న పనులు పూర్తిచేస్తారు, తులా నుంచి మీన రాశి వరకూ వారఫలాలు

27 November to 3rd December 2022 Weekly Horoscope:  ఆర్థిక సమస్యలు తీరుతాయి, అనుకున్న పనులు పూర్తిచేస్తారు, తులా నుంచి మీన రాశి వరకూ వారఫలాలు

Love Horoscope Today 27th November 2022: ఈ రాశివారి మనసులో ఎన్నో ఆలోచనలు, ఏదో పరధ్యానంలో ఉంటారు

Love Horoscope Today 27th November 2022: ఈ రాశివారి మనసులో ఎన్నో ఆలోచనలు, ఏదో పరధ్యానంలో ఉంటారు

టాప్ స్టోరీస్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం: సీఎం కేసీఆర్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం:  సీఎం కేసీఆర్

Bandi Sanjay : పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Bandi Sanjay :  పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!

Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!