అన్వేషించండి

The Mystery of the Sweating Idol: ఈ ఆలయంలో విగ్రహానికి చెమట్లు పడతాయ్ - ఇదంతా దేవుడి మహిమేనా!

Nachiyar Kovil Thirunaraiyur: ఈ ఆలయంలో ఊరేగింపు సమయంలో గరత్మంతుడికి చెమట్లు పడుతుంటాయి. రాయికి చెమట్లు పట్టడం ఏంటనేది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగా మారింది...అసలేంటీ ఈ ఆలయ విశిష్టత....

The Mystery of the Sweating Idol:  ఎన్నో ఆలయాలు...ప్రతి ఆలయంలో ఓ ప్రత్యేకత...ఈ కోవకు చెందిన ఆలయమే తిరునాయూర్ లో ఉంది.  శ్రీమహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు తమిళనాడు కుంభకోణానికి దగ్గర్లో ఉన్న తిరునాయూర్ క్షేత్రంలో అదృశ్యరూపంలో విహరిస్తుంటాడని చెబుతారు. అందుకు నిదర్శంగా ఇక్కడ స్వామివారి ఊరేగింపు సమయంలో బరువు పెరుగుతూ ఉండడం, చెమట్లు పట్టడం జరుగుతుంటుంది.  ఇదెలా జరుగుతోంది అన్నది ఇప్పటికీ మిస్టరీ...

అమ్మవారి కోసం వెనక్కుతగ్గిన స్వామివారి వాహనం

తమిళనాడు రాష్ట్రం తిరునాయూర్ క్షేత్రంలో శ్రీ మహావిష్ణువుకి ఏడాదికి  2సార్లు ఊరేగింపు ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవంలో అమ్మవారు హంసవాహనం మీద , అయ్యవారు గరుడవాహనంపై ఊరేగుతుంటారు. ఆ సమయంలో  గరుడ వాహనం చకచకా వెళ్లిపోతుంటుంది. అమ్మవారున్న హంసవాహమం నెమ్మదిగా కదులుతుంటుంది. అది గమనించిన గరుడుడు..స్వామితో ఏమన్నాడంటే... అమ్మవారున్న హంసవాహనం కన్నా ముందుకి వెళ్లను..తగిన వేగంతో వెళుతూ హంసవాహనం వెనకాలే కదులుతుంటాను అని చెప్పాడు. స్వామివారి అంగీకారంతో నెమ్మదిగా కదలడం ప్రారంభించిన గరుత్మంతుడు...ఈ మేరకు బరువు పెరుగుతూ ఉంటాడు. 

Also Read: ఈ అత్తా - కోడలు ఓ దగ్గరికి చేరితే యుగాంతమే - సైన్స్ కి అందని మిస్టరీ ఇది!

బరువుపెరిగే గరుత్మంతుడు

ఈ ఆలయంలో వాహనసేవ ప్రారంభమైనప్పుడు గరుడవాహనం తేలికంగా ఉంటుంది..కేవలం నలుగురు మోస్తే చాలు కదులుతుంది. అలా ముందుకు కదిలిన గరుడవాహనం ఆ తర్వాత 5 ప్రాకారాలు దాటి దేవాలయం సింహద్వారం దగ్గరకు వచ్చేసరికి బరువు పెరుగుతుంది.  రెండో ప్రాకారాన్ని దాటే సమయానికి 8 మంది.. మూడో ప్రకారం దాటేటప్పుడు 16 మంది...నాలుగో ప్రాకారం దాటేసరికి 32 మంది...ఐదో ప్రాకారం దాటేసరికి 64 మంది...ఐదో ప్రాకారం దాటేసరికి విపరీతమైన బరువు పెరిగి మొత్తం 120 మంది మోయాల్సి వస్తుందట. ప్రధాన వీధుల్లోకి వచ్చేసరికి వాహనాన్ని మోసేవారి సంఖ్య మరింత పెరుగుతుంటుంది. 

చెమట్లు పట్టే విగ్రహం

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆలయంలో ఊరేగింపు జరుగుతున్న సమయంలో గరత్మంతుడి విగ్రహం బరువు పెరుగుతూ ఉంటుందని చెప్పుకున్నాం కదా...ఈ బరువు పెరుగుతున్న సమయంలో ఆ భారానికి విగ్రహానికి చెమట్లు పడుతుంటాయి. ఈ క్షేత్రంలో ఉన్న గరుత్మంతుడిని కాలగారుడన్ అని పిలుస్తారు. మహాశక్తి వంతుడైన ఈ కాలగరుడన్ నవనాగుల్ని ఆభరణాలుగా ధరిస్తాడు...

Also Read: శమంతక మణి గురించి ప్రచారంలో ఉన్న కథలేంటి - ఇప్పుడా మణి ఎక్కడుందో తెలుసా!

గరుత్మంతుడి ఆభరణాలుగా నవనాగులు

  • ఆదిశేషుడు - గరుత్మంతుడికి కంకణం
  • కర్కోటకుడు - గరుత్మంతుడి పూలదండ
  • పద్మనాభుడు - గరుత్మంతుడి కుడిచెవి ఆభరణం
  • మహా పద్ముడు - గరుత్మంతుడి ఎడమచేతి ఆభరణం
  • శంఖపాలుడు - గరుత్మంతుడి కిరీటానికి ఆభరణం
  • గుళికుడు - గరుత్మంతుడి కుడి చేయి ఆభరణం
  • తక్షకుడు - గరుత్మంతుడి వడ్డాణం
  • వాసుకి - గరుత్మంతుడి జంధ్యం
  • తొమ్మిదో సర్పం ఆయన కంఠానికి అలంకరణ 

108 శ్రీ వైష్ణవ దేశాలలో ఒకటిగా వెలుగుతోన్న తిరునాయూర్ కి నాచ్చియార్ కోయిల్ దర్శించుకునేందుకు హైదరాబాద్ నుంచి వెళితే మార్గ మధ్యలో మహాబలిపురం కూడా దర్శించుకోవచ్చు. హైదరాబాద్ నుంచి అనంతపురం బెంగళూరు మీదుగా కూడా నాచ్చియార్ వెళ్లొచ్చు.  

శ్రీ విష్ణు గాయత్రి
ఓం నారాయణాయ విద్మహే 
వాసుదేవాయ ధీమహి
తన్నోవిష్ణుః ప్రచోదయాత్

శ్రీ గరుడ గాయత్రి
ఓం తత్పురుషాయ విద్మహే 
సువర్ణ పక్షాయ ధీమహి 
తన్నో గరుడః ప్రచోదయాత్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Neha Shetty : గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Embed widget