అన్వేషించండి

Mirai Sampathi : తమ్ముడి కోసం రెక్కలు కాల్చుకున్న పక్షి రాజు కథేంటి? 'మిరాయ్ ' లో చూపించింది ఈ 'సంపాతి 'నే!

Mirai Special: జటాయువు కి ఒక అన్న "సంపాతి "ఉన్నాడు అని తెలుసా... తమ్ముడి కోసం రెక్కలు కాల్చుకున్న పక్షి రాజు కథ ఏంటి? ' మిరాయ్ ' సినిమా లో చూపించింది ఈ 'సంపాతి 'నే

రామాయణంలో మానవులు,దేవుళ్ళు, వానరులు, రాక్షసులే కాదు. ఇంకా అనేక జాతుల ప్రాణులు కనిపిస్తాయి. వాటిలో కొన్ని ఇప్పుడు  ఉనికిలో కూడా లేవు. కానీ యుగాల క్రితం అలాంటి అద్భుత జీవులు  ఉండేవని వాల్మీకి తన కావ్యంలో రాశారు. అలాంటి వాటిలో ఒక జాతి  అతి భీకరమైన  గండబేరుండ పక్షులు. ఇవి పక్షరూపంలోనే ఉంటాయి కానీ  పరిమాణంలో చాలా పెద్దది. ఎంతలా అంటే  పెద్ద ఏనుగులను సైతం  తన్నుకుని గాలిలోకి ఎగిరిపోయేవి. అలాంటి పక్షి రాజుల్లో  ఇద్దరి అన్నదమ్ముల కథ రామాయణంలో చాలా ప్రముఖంగా ఉంటుంది. వాటిలో 'జటాయువు' గురించి అందరికీ తెలుసు గానీ  తన అన్న 'సంపాతి' గురించి  చాలా తక్కువ మంది విని ఉంటారు.  

తమ్ముడి కోసం రెక్కలు కాల్చుకున్న  పక్షి రాజు 'సంపాతి '

పురాణాల ప్రకారం సూర్యుడి రథసారథంలో ఒకడైన 'అరుణుడి "  కి ఇద్దరు కొడుకులు.  అతి పెద్ద పక్షుల రూపంలో పుట్టిన  ఆ ఇద్దరిలో  పెద్దవాడు "సంపాతి", చిన్నవాడు "జటాయువు". చాలా శక్తివంతమైన ఆ ఇద్దరూ కావలసినప్పుడు మనుష్య రూపంలో తిరిగేవారు. యుగాల పాటు జీవించిన  ఆ ఇద్దరూ వయసులో ఉన్నప్పుడు  తమ తండ్రి నడిపే సూర్యుడి వేగంతో పోటీపడ్డారు. అంతేకాకుండా సూర్యుడ్ని చేరుకోవాలని  చాలా ఎత్తులకు ఎగిరారు. ఇంకా దగ్గరికి వెళ్ళొద్దని "సంపాతి" చెబుతున్నా వినకుండా 'జటాయు' సూర్యుడు దగ్గరికి వరకూ ఎగిరాడు.  అయితే సూర్యుడి వేడిని తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోతున్న  "జటాయువు"ను చూచి రక్షణగా తన రెక్కలు చాపాడు సంపాతి. దానితో సూర్యుడి వేడికి సంపాతి రెండు రెక్కలూ కాలిపోయాయి.  ఎగరలేని స్థితిలో  "సంపాతి " వింధ్య పర్వతంపై పడిపోయాడు. నిరాశ చెందిన 'సంపాతి '  ఆత్మహత్య చేసుకుందామని కొండ శిఖరం పైకి చేరుకోగా  అక్కడ ఒక ఆశ్రమంలో నివసిస్తున్న "నిశాకర" మహర్షి "సంపాతిని" గుర్తుపట్టి  భవిష్యత్తులో  రాముడు జన్మిస్తాడని  ఆయన భార్య సీతను వెతుక్కుంటూ  వానరులు  వస్తారని  వారికి ఆమె జాడను చెప్పిన తర్వాత  "సంపాతి " కి క్రొత్త రెక్కలు వస్తాయని తెలిపాడు. అప్పటినుంచి వానరుల కోసం ఎదురు చూస్తూ 8వేల సంవత్సరాలు పర్వతం పైనే బతికాడు 'సంపాతి'. తన కుమారుడు "సుపార్సువ్యుడు " ప్రతిరోజు తెచ్చి ఇచ్చే ఆహారంతో  సంపాతి జీవించేవాడు. 

వానరులని తినేద్దామని వచ్చి.. సహాయం చేసిన "సంపాతి "   

వేల సంవత్సరాల తర్వాత  సీత జాడను వెతుక్కుంటూ  ఆ ప్రాంతాలకు వచ్చిన వానరులను కొండపై నుండి చూచి ఆహారంగా తినేద్దామనుకుంటూ  సంపాతి నడుచుకుంటూ గుహలోంచి బయటకు వచ్చాడు. అదే సమయంలో వానరులు  సీతను కాపాడడానికి జటాయు రావణుడి కి అడ్డు వెళ్లడం  తన రెక్కలను రావణుడు  కత్తితో నరకడం  వంటి విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు విన్న "సంపాతి " తమ్ముడి చావు గురించి విని చాలా బాధపడ్డాడు.  సంపాతిని చూసి భయపడుతున్న వానరులతో తన కథంతా చెప్పాడు "సంపాతి ".  రావణుడు  సీతను ఎత్తుకొని పోవడం తాను కూడా చూసానని చెబుతూ  రావణుడి వివరాలు, లంకకు వెళ్లే దారి గురించి  వానరులకు వివరించాడు సంపాతి. ఆ వెంటనే "సంపాతి " కి కొత్త రెక్కలు వచ్చేసాయి. దానితో సంతోషపడ్డ "సంపాతి " వానర యువరాజు "అంగదుడ్ని " తన రెక్కలపై ఎక్కించుకుని  ఆకాశంలోకి ఎగిరి  దూరంగా సముద్రంలో ఉన్న లంకను చూపించాడు. ఆ తర్వాతనే "ఆంజనేయుడు " లంకకు ఎగిది వెళ్లడం , సీతను కలవడం, లంకాదహనం గావించడం వంటి అద్భుత కార్యాలు జరిగాయి. అలా సీత జాడ తెలియడంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించాడు "సంపాతి "

'మిరాయ్ " సినిమా ద్వారా మరోసారి చర్చలోనికి "సంపాతి "  

లేటెస్ట్ గా రిలీజ్ అయిన  'మిరాయ్ " సినిమాలో  రామాయణ కాలం నాటి కొన్ని పాత్రల ప్రస్తావన ఉంది. వాటిలో 'సంపాతి 'కూడా ఒకటే. రామాయణం లో చాలా తక్కువ మందికి తెలిసిన 'సంపాతి' పాత్ర  ప్రస్తావన మరోసారి ఇలాగా  సినిమా రూపంలో తీసుకురావడం ఫై రామాయణ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రామాయణ,భారతాలు, పురాణాల లో ఇలా ఎన్నో మరుగున పడ్డ  అద్భుత పాత్రలు ఉన్నాయని  అలాంటి వాటిపై మన దర్శక నిర్మాత రచయితలు దృష్టి పెడితే హాలీవుడ్ ను తలదన్నే కథలు  భారతీయ చలనచిత్ర రంగంపై  క్లాసిక్స్ గా మారతాయని  వారంటున్నారు.

టాప్ హెడ్ లైన్స్

10-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
10-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
మీన రాశి వారఫలాలు ఆగస్టు 9-15: మీ సంబంధాలలో మూడవ వ్యక్తి జోక్యం ఉద్రిక్తతను పెంచుతుంది జాగ్రత్త!
మీన రాశి వారఫలాలు ఆగస్టు 9-15: మీ సంబంధాలలో మూడవ వ్యక్తి జోక్యం ఉద్రిక్తతను పెంచుతుంది జాగ్రత్త!
కుంభ రాశి వారఫలాలు ఆగస్టు 9-15: భావోద్వేగాలకు లోనవకండి , ఈ వారం ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి!
కుంభ రాశి వారఫలాలు ఆగస్టు 9-15: భావోద్వేగాలకు లోనవకండి , ఈ వారం ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి!
మకర రాశి వారఫలాలు ఆగస్టు 9-15: చిన్న నిర్లక్ష్యం తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు, ఈ వారం అప్రమత్తంగా ఉండండి!
మకర రాశి వారఫలాలు ఆగస్టు 9-15: చిన్న నిర్లక్ష్యం తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు, ఈ వారం అప్రమత్తంగా ఉండండి!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget